మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

అమ్మ ఒడి పథకం పొందాలంటే ఇకపై ఇది కచ్చితంగా ఉండాల్సిందే !!?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు ‌.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

అయితే తాజాగా అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థులు తమ అటెండెన్స్ 75% మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి పథకానికి అనర్హులు అని పథకానికి అటెండెన్స్ లింక్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

అమ్మ ఒడి పథకానికి వీరు మాత్రమే అర్హులు :- 

ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.

లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి

ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.

విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.





Share:

చిలకలూరిపేట - భారీగా పట్టుబడిన గోవా మద్యం

చిలకలూరిపేట -  భారీగా పట్టుబడిన గోవా మద్యం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరి పేట ఎక్సైజ్ శాఖ - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడులలో భారీగా మద్యం పట్టుబడింది. సుమారు 30 కేసుల మద్యాన్ని గోవా నుండి తీసుకువస్తుండగా చిలకలూరిపేట జాతీయ రహదారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ 30 కేసుల మద్యాన్ని పెయింట్ డబ్బా మధ్యలో ఉంచి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.



Share:

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మహిళా గ్రామ వాలంటీర్ చెవుల యామినిపై రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని సోమవారం పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. యామిని తన పని తాను సజావుగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆ సంఘాల నేతలు కోరారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో వాలంటీర్ యామిని ఆవేదన, తనపై వస్తున్న దృశ్యాలను చూసి తాము స్వతహాగా  వచ్చామని వారు తెలిపారు. నాదెండ్ల చేరుకున్న నేతలు ముందుగా యామిని గృహానికి వెళ్ళారు. యామినితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన విషయాలను యామిని వారికి వివరించింది. అక్కడినుండి యామినిని వెంటబెట్టుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. దళిత వర్గానికి చెందిన యువతిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని, విషయాన్ని ఇంతటితో ముగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తరువాత తహశీల్ధార్ సురేష్ ని వారు కలిశారు. యామినికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీటీసీ కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. తమకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, అంతేకానీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ గ్రహించాలన్నారు. యామినిపై వేధింపులు కొనసాగిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యామినికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంఛార్జి, దళిత చైతన్య స్రవంతి సభ్యులు, న్యాయవాది నల్లపు కోటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వంజా ముత్తయ్య, అంటరానితనం నిర్మూలనా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దార్ల రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దావులూరి రవి కుమార్ మాదిగ, గ్రామ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, సేవా సమితి సభ్యులు అల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-202 సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 11-10-2021 సోమవారం నాడు మొత్తం  1 కేసు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు.

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యింది.




Share:

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఈ రోజు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో స్పందన 'కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF)  ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వినతి పత్రం ఇవ్వటం  జరిగింది. ఈ సందర్భంగా జాకీర్  మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అద్యక్షులు కూరపాటి హనుమంతురావు,ఉపాద్యక్షులు మచ్చు వీరయ్య ,  పార్లమెంటు అదికార ప్రతినిది  ధైదా చిన్న బాబు,కార్యనిర్వాహక కార్యదర్శి మాలెంపాటి ప్రవీణ్ , షేక్ సాధిక్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు  పాల్గొన్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.