మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

MPTC కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి వాలంటీర్ యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోము - దళిత సంఘాల నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మహిళా గ్రామ వాలంటీర్ చెవుల యామినిపై రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని సోమవారం పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. యామిని తన పని తాను సజావుగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆ సంఘాల నేతలు కోరారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో వాలంటీర్ యామిని ఆవేదన, తనపై వస్తున్న దృశ్యాలను చూసి తాము స్వతహాగా  వచ్చామని వారు తెలిపారు. నాదెండ్ల చేరుకున్న నేతలు ముందుగా యామిని గృహానికి వెళ్ళారు. యామినితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన విషయాలను యామిని వారికి వివరించింది. అక్కడినుండి యామినిని వెంటబెట్టుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. దళిత వర్గానికి చెందిన యువతిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని, విషయాన్ని ఇంతటితో ముగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తరువాత తహశీల్ధార్ సురేష్ ని వారు కలిశారు. యామినికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీటీసీ కుల అహంకారంతో, అధికారం ఉందికదా అని దళిత యువతి యామినిపై వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. తమకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, అంతేకానీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ గ్రహించాలన్నారు. యామినిపై వేధింపులు కొనసాగిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యామినికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంఛార్జి, దళిత చైతన్య స్రవంతి సభ్యులు, న్యాయవాది నల్లపు కోటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వంజా ముత్తయ్య, అంటరానితనం నిర్మూలనా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దార్ల రాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దావులూరి రవి కుమార్ మాదిగ, గ్రామ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, సేవా సమితి సభ్యులు అల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.