మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

తూబాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 8

కనపర్రు గ్రామంలో - 1

ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 









































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి

మార్కండేయనగర్ లో - 3

సాలిపేట లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 1

రాజాపేట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 















































Share:

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ అతి సమీపంలో పేకాట నిర్వహిస్తునట్లు వచ్చిన సమాచారంతో టౌన్ SI అజయ్ బాబు దాడులు నిర్వహించారు. హనుమయ్యమ్మ సత్రం పక్కనే ఉన్న విగ్నేశ్వరా కారు ట్రావెల్స్ వద్ద ఈ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మొబైల్స్, 3500 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారి పైన కేసు నమోదు చేసారు.  

























Share:

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో  - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు 

https://chilakaluripetspeednews.blogspot.com/`

చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం. 

మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక  ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.

కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. 

శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది. 

అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. 

రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి. 

 ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం. 
 













































































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.