మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో  - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు 

https://chilakaluripetspeednews.blogspot.com/`

చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం. 

మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక  ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.

కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. 

శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది. 

అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. 

రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి. 

 ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం. 
 













































































Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.