మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.