మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన కావటి

చిలకలూరిపేట :- నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా నేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటీ మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు 10,000 మందితో కలిసి అంగరంగ వైభవంగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కావటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈరోజున స్వచ్ఛందంగా  నామినేషన్ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలంతా మరలా జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారన్నారు. ప్రజలు కనివిని ఎరుగని రీతిలో జగనన్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు ఇంటి వద్దకే పంపిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు.  ఎన్నికల ప్రచారంలో మేము పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు జగనన్న ఈ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని జగనన్న మేము ఓట్ల రూపంలో రుణం తీర్చుకోని జగనన్ననే మరల ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం మేము జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేపించుకున్నామన్నారు. అదేవిధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు కూడా లబ్ధి పొందామని స్వచ్ఛందంగా ప్రతిపక్ష పార్టీలు వారు కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావటి అనే నేను అత్యధిక మెజార్టీతో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు పర్యాలు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు పనిచేశారని ఈ మూడు పర్యాలో పేట అభివృద్ధికి నోచుకోక పోగా ఎన్నో అవస్థలు ప్రజలు పడ్డారని కావటి తెలియజేశారు. ఈరోజున నామినేషన్ కార్యక్రమానికి వచ్చే మా నాయకులను కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేది లేదని తెలిపారు. పుల్లారావు అనే వాడు 2019లో ఓడిపోతే నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నారన్నారు. పేటలో పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ చేసిన అరాచకాలు పేట ప్రజలు ఇంకా మర్చిపోలేదని కావటి గుర్తు చేశారు. చివరికి ఆర్యవైశ్యులు దీపావళి మందులు అమ్ముకుంటే వాళ్ల దగ్గరికి కూడా పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ అధికారులు పంపించి షాపులు మూపించి వాళ్ళని నానారకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు. పుల్లారావు గతంలో వైసిపి తీర్థం పుచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తే అవి జగనన్న దగ్గర పారకపోయేసరికే మరలా చంద్రబాబు దగ్గరికి వెళ్లి కాళ్ళ వేల పడి టిడిపి టికెట్ తీసుకున్నారని తెలిపారు. పుల్లారావు మాట్లాడుతూ నేను స్థానికుడిని కాదు అని తెలియజేస్తున్నారు. కానీ పుల్లారావు ఎక్కడ నుంచి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి సొసైటీ చైర్మన్గా ఓడిపోతే చిలకలూరిపేట వచ్చి ఎన్టీఆర్ హయాంలో టీడీపీ టికెట్ తెచ్చుకొని రాజకీయ రంగం ప్రవేశం చేసిన నీచమైన రాజకీయ జీవిత చరిత్ర పుల్లారావుదని కావటి తెలిపారు. పుల్లారావు ఈరోజున ఎన్ని బూటకపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కనీసం పుల్లారావు కి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి రేపు జరిగే ఎన్నికల్లో ఉంటుందని కావటి తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.