మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది

చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ , జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో , సౌత్ ఇండియా లోని ప్రధాన కూరగాయల ఇంపోర్ట్స్ లో తమకంటూ ఒక ప్రత్యేక  గుర్తింపు పొందిన చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ఈ రోజు చాల గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది.మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో పండే ఎటువంటి కూరగాయల పంటలను సైతం హోల్ సేల్ & రిటైల్ సప్లై చేసిన ఘనత చిలకలూరిపేట మార్కెట్ ఉన్నదన్న విషయం ఇప్పుడు ఉన్నకొత్త వ్యాపారులకు, ప్రజా పతినిధులకు తెలియకపోవచ్చు. పాత రోజులలో  పక్క రాష్ట్రాలలో ఉండే రైతులు సైతం ఇక్కడి వారితో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవారు.విపత్తు వచ్చిన సమయాలలో మార్కెట్ తరుపున వారి స్థోమత తగట్టుగా ఆర్ధిక సాయం,కూరగాయల పంపిణి  చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికి మన రాష్ట్రము లోని ప్రముఖ పుణ్యక్షేతాలకు పండుగ రోజులలో ఉచితంగా కూరగాయల పంపిణి చేస్తూ ఉంటారు. ఆలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. ఇక్కడ ఉన్న వర్తకసంఘం వారు ఐకమత్యంతో ఉంటూ తమ తమ వ్యాపారాలలో బిజీ గా ఉండేవారు. కమిషన్ షాపు వారు అయితే నైట్ 1 గంటల నుండి వ్యాపారాలకు అన్ని ఎర్పాట్లు చేసుకుంటూ సమయానికి నిద్ర,ఆహారాలు లేకుండా ఎప్పుడు పట్టణానికి కూరగాయల సప్లై అందించేవారు. 

కానీ ఇప్పుడు పరిస్థితి చాల దారుణంగా తయారు అయినది. చుట్టుపక్కల వ్యాపారాలు పెరిగిపోవటంతో మార్కెట్లో వ్యాపారాలు లేక కనీసం ఇంట్లో ఖర్చులకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేనంత దారుణమైన తాయారు అయినది. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో వ్యాపారాలు లేక కమిషన్ షాపులకు లక్షలలో అప్పులలో కురుకుపోయి ఉన్నారు. కరోనా కారణంగా మార్కెట్ షాపులను చిన్న మార్కెట్ యార్డ్ లోనికి మార్చారు. అయితే అసలే ఎండా కాలం కూరగాయల పైనా ఎప్పుడు తేమ లేకపోతే కుళ్లిపోయి పాడైపోతాయి. వేడిగాలులు తో కూరగాయలు వడపడిపోయి వ్యాపారులు చాల నష్టపోతున్నారు. 

అక్కడి వారితో మాట్లాడిన మా బృందానికి వారి మాటలు విని చాల బాధ అనిపించింది. 

కరోనా అని చెప్పి మమ్మల్ని మార్కెట్ యార్డుకి (ఇక్కడికి) పంపించారు. 100 షాపులలో  గత లాక్ డౌన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు షాపులు పెట్టుకోవటానికి ధైర్యం సరిపోక 40 షాపులు ముందుకు వచ్చాయి. అయితే వడగాలులకు కూరగాయలు కుళ్లిపోవటంతో వ్యాపారాలు లేక నష్టాలలో కమిషన్ షాపులకు లక్షలలో నష్టాలు పడి షాపులు తీసేసారు. ఇప్పటికి 10 షాపులు రన్నింగ్ లో ఉన్నాయి. మిగిలిన వారు వ్యాపారాలు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. రెక్కాడితే డొక్కాడని మా బ్రతుకులకు 2 నెలలుగా ఇంట్లో కనీసం సరుకులు తెచుకోవటనికి డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని పిల్లల్ని , పెద్ద వారిని, చూసుకోలేక అటు కమిషన్ వ్యాపారులకు డబ్బులు కట్టలేక ఆత్మ హత్య చేసుకుందాం అని చాల సార్లు ఆలోచించా అన్నారు. ఆ మాటలకూ మా రిపోర్టర్ షాక్ గురి అయ్యారు. నిజంగానే ఆ వ్యాపారాలు పడే బాధ వారికీ మాత్రమే తెలుస్తుంది. కూరగాయల వ్యాపారం తప్ప ఇంకేం చెయ్యలేని మేము కొత్త వ్యాపారాలలో ఇమడలేము అని తెలిపారు.   
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1000 మందికి పైగా ఈ మార్కెట్ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి విపత్తు వచ్చిన ముందుగా మార్కెట్ పైన పడి, మార్కెట్ ఖాళీ చేపించి, వ్యాపారాల స్థావరాన్ని మారుస్తున్నారు. వ్యాపారాలు లేక మేము మా కుటుంబాలు పడుతున్న బాధలు ఎవరికీ రాకూడదు అని అనుకుంటున్నాం. మార్కెట్ చుట్టుపక్కలో ఉన్న చిల్లర కోట్ల దుకాణాల్లో రోజు చూస్తున్నాం కరోనా రూల్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా ఎలా ఉంటున్నారో. అయితే మార్కెట్ లో షాప్ మార్చి షాప్ ( బేసి, సరి సంఖ్యల విధానంతో ) కోవిద్ రూల్స్ పాటిస్తూ వ్యాపారాలు సాగిస్తాం అని చెప్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోని పరిస్థితిలో మేము ఇలా ఉన్నాము అని వాపోయారు. 
ఏ ప్రాంత అభివృద్ధి లో అయిన వ్యాపారులే ముఖ్య పాత్ర పోషిస్తారు. అంతే కానీ వాళ్ళని బాధ పెట్టాలి అని చూస్తే మాత్రం ప్రాంతానికి చాల నష్టం కలుగుతుంది. 



ఇది చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ కధనం - CHILAKALURIPET SPEED NEWS  


















































Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.