మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

 ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు కారణం ఇదేనా ?

పల్నాడు జిల్లా :- చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. శరత్ పై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో, ప్రాసిక్యూషన్ వాదోపవాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి 14 రోజులు రిమైండర్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తెలంగాణలో కూడా ఇదే తరహా కేసుని నమోదు చేసినట్లు, ఒకే రకం కేసు పై రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం విరుద్ధమని, 409 సెక్షన్ వర్తించదు అని ప్రత్తిపాటికి సంబంధించిన బెనర్జీ లక్ష్మీనారాయణ వాదించారు. దీంతో 409 సెక్షన్ ను కేసు నుంచి తొలగించారు.

అసలు జీఎస్టీ ఎగవేత కేసులు ఇంత హడావిడిగా పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో అసలు కారణం జీఎస్టీ ఎగవేత లేదా ఇంకేమైనా ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వద్ద నుండి వెయ్యని రోడ్డుకు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. శరత్ తో పాటు మరో ఆరుగురిపై పై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.