మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్


చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను  తెలియజేయాలని కోరారు.

1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో  నీటి సరఫరా చేస్తున్నారు.

2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్  ల కొరత ఉన్నవి.

3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.

4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.

5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.

6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.

7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.

8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.

9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.

10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల  ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.