మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.