మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?


పల్నాడు జిల్లా :-  గడిచిన మహాశివరాత్రి రోజున లక్షలాదిమంది భక్తులు కోటప్పకొండకు చేరుకొని ఆ త్రికోటేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండి భక్తులు మూలవిరాట్ దర్శనానికై కిలోమీటర్ల మేర బారులు తిరిగి దర్శనం చేసుకున్నారు. అలాగే కోటప్పకొండకు కాలినడకన వెళ్లిన భక్తులకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రతిదీ. చాలామంది భక్తులు జనసంద్రోహాన్ని దాటుకొని ఆ దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోలేని వారు కూడా ఉన్నారు. అయినా కూడా శివరాత్రి రోజున 1కోటి 63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని శనివారం నాడు లెక్కించినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల ద్వారా 3,592,950రూ||, పూజా సామాగ్రి అమ్మడం ద్వారా 5,499,638 రూ||, మిగిలిన 7,255,639రూ|| హూండీల ద్వారా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g


Share:

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?


చిలకలూరిపేట :- ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకొక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీలలో ముఖ్య నేతలు తమకు సీటు దక్కపోవటంతో మరో పార్టీలోకి జంపింగ్లు జరిగిపోయాయి. మరికొందరు టిడిపి - జనసేన - బిజెపి పొత్తు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో టికెట్ దక్కకపోతే బిజెపి  పోటీ చేసి గెలవాలని ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పొత్తు ఉంటుందని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఫిక్సయినట్లు టిడిపి ముఖ్య నేతలకు సమాచారం అందించారు దానితోపాటు ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నట్లు టిడిపి నేతలకు చంద్రబాబు తెలియజేశారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో జరగబోయే అతిపెద్ద భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బిజెపి జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీక్రెట్ కేటాయించినట్లు. టిడిపికి 145 ఎమ్మెల్యే, 17 ఎంపీ పోత్తులో భాగంగా టిడిపికి దక్కినట్లు తెలుస్తుంది.
Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం


చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు నేషనల్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే భద్రాచలానికి చెందిన ఒక క్యాటరింగ్ బృందం కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఎడ్లపాడు సమీపంలో నేషనల్ హైవే డివైడర్ కు తగిలి బొలెరో బోల్తా పడింది. దీంతో వాహనం వెనుక తలుపులు తెరుచుకొని వాహనంలో ప్రయాణిస్తున్న బుజ్జి అనే మహిళ రోడ్డు మీద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ముగ్గురు(తులసి, లక్ష్మి, చిన్నమ్మాయి) మహిళలు పాటుగా ఉన్న డ్రైవరు, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణం వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం



Share:

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

 కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ

పల్నాడు జిల్లా :- 2024 కోటప్పకొండ తిరునాళ్ల కోలాహలం రంగ రంగ వైభవంగా జరిగింది. తిరుణాల ముగించుకొని వస్తున్న సమయంలో ఈటీ వద్ద యడవల్లికి చెందిన తెలుగు యువత ప్రభ నేలకొరిగింది. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లు ధ్వంసం అవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన వ్యక్తిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.

 అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరణాలను ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ప్రభలు నిర్వాహకులు తమ సాయశక్తుల ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని కొన్ని సమయంలో చిన్నచిన్న అపశృతులు జరగటం మామూలే అయినప్పటికీ అంత భారీ ఖర్చులతో భారీ ప్రభలను నిర్మించి ఇలాంటి అపసృతులు జరగటం నిర్వాహకులకు కలవర పెడుతుంటాయి.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ


Share:

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు

చిలకలూరిపేట :- ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారానికి స్పీడును పెంచాయి. అందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం కార్యక్రమం పూర్తి చేయగా, నారా భువనేశ్వరి కూడా తన వంతు పార్టీ గెలుపుకై పనిచేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శంఖారావం, రా కదలిరా, జయహో బిసి వంటి భారీ బహిరంగ కార్యక్రమాలను నిర్వహించగా అందులో భాగంగానే ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ & జనసేన ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ సభ రాజకీయ చరిత్రలోనే మరువలేని ఘట్టంగా ఉంటుందని అచ్చం నాయుడు తెలిపారు. ఈ చిలకలూరిపేట సభ నుండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కి సంబంధించి కీలక ప్రకటనలో చేయనున్నట్లు అచ్చం నాయుడు. అన్ని జిల్లాల టిడిపి తమ్ముళ్లు & జన సైనికులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

 https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.

పండుగ రోజు కోటప్పకొండ వెళ్తున్నారా ! అయితే ఇది గమనించండి.


కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి - పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి.

ఈ సందర్భంగా  ఎస్పీ  మాట్లాడుతూ...

✓ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి  వస్తూ వుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు శ్రీ త్రికొటేశ్వర స్వామి వారిని స్వేచ్చగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహలకు వెళ్ళడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవలసిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట చిలకలూరిపేట సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి పార్కింగ్ స్థలాల గురించి క్రింద  తెలిపిన సూచనలను పాటించాలని ఎస్పీ గారు తెలిపారు


 

 నరసరావుపేట వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :- 

1. నరసరావుపేట నుండి కోటప్పకొండకు వచ్చు భక్తులు/VIPలు మొదలగు వారు, వారి వారి వాహనాలలో/RTC బస్సులలో ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా పార్కింగ్ ప్రదేశమునకు చేరుకుని, క్రమ పద్ధతిలో వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.

2. తిరుగు ప్రయాణంలో పార్కింగ్ వెనుక వైపు ఏర్పాటు చేయబడిన మట్టి రోడ్డును ఉపయోగించి కొండకావూరు మీదుగా పమిడిమర్రు రోడ్డును చేరి JNTU కాలేజీ మీదుగా కాకాని రోడ్ ను ఉపయోగించవలెను.


 సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-


3. సంతమాగులూరు నుండి వచ్చు భక్తులు లక్ష్మీపురం కాలువ రోడ్డును ఉపయోగించి మిన్నెకల్లు, గురిజేపల్లి మీదుగా UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను. మిన్నేకల్లు నుండి కోటప్పకొండ వైపు వాహనాలు  అనుమతించబడదు

4. సంతమాగులూరు నుండి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో గురుజేపల్లి మీదుగా సంతమాగులూరు చేరవలెను.


 చిలకలూరిపేట వైపు నుండి వచ్చు వాహనదారులు :-


5. చిలకలూరిపేట నుండి వచ్చు భక్తులు పురుషోత్తపట్నం, యడవల్లి, UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద ఏర్పాటు చేయబడిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించుకొనవలెను.

6. చిలకలూరిపేట నుండి వచ్చు VIPలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా  UT జంక్షన్ చేరి ఎడమవైపుకు తిరిగి క్రషర్ రోడ్ ను ఉపయోగించి VIP పార్కింగ్ లో వాహనమును ఉంచి, VIP బస్ లలోనే కొండపైకి చేరవలెను.

7. తిరుగు ప్రయాణంలో క్రషర్ రోడ్డు మీదుగా UT జంక్షన్ ను చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా చెరువు రోడ్డు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.

8. చిలకలూరిపేట నుండి వెళ్ళు ప్రభలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా UT జంక్షన్ చేరి  నిధి దారి గుండా ప్రభల స్టాండుకు చేరవలెను.

9. చిలకలూరిపేట నుండి వచ్చు ట్రాక్టర్లు పురుషోత్తపట్నం, యడవల్లి, అట్టల ఫ్యాక్టరీ రోడ్ మీదుగా  యక్కలవారిపాలెం మీదుగా ప్రభల స్టాండ్ కు చేరవలెను.

10. చిలకలూరిపేట వైపు తిరిగి వెళ్ళు భక్తులు శారద ఫార్మసీ దగ్గరలో పార్కింగ్ నుండి RTC బస్సులు, కార్లు UT జంక్షన్ చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా గోవిందాపురం, కోమటినేనివారి పాలెం మీదుగా నరసరావుపేట-చిలకలూరిపేట రోడ్డుకు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.

11. గంగన్నపాలెం, కోమటనేనివారి పాలెం నుండి వచ్చు భక్తులు గోవిందాపురం, కమ్మవారిపాలెం మీదుగా మద్దిరాల చేరి యడవల్లి, UT జంక్షన్ ల మీదుగా పార్కింగ్ ప్రదేశం చేరవలెను.

12. అవిశాయపాలెం, కేసానుపల్లి మీదుగా కోటప్పకొండకు వచ్చు భక్తులు SRKT చేరి, యలమంద గ్రామం మీదుగా కోటప్పకొండ వెళ్ళవలెను.

13. యలమంద, గురువాయపాలెం వైపు నుండి వచ్చు భక్తులు బాతింగ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జ్ ను చేరి, యాదవ సత్రంనకు వెనుక గల పార్కింగ్ ప్రదేశం నందు వాహనాలను పార్కు చేసుకొనవలెను.

14. రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి నరసరావుపేటకి వెళ్ళు వాహనాలు, చిలకలూరిపేట మేజర్ కెనాల్ మీద ఏర్పాటు చేసిన రూట్ లో మాత్రమే వెళ్లి AM Reddy కాలేజి వద్ద నరసరావుపేట బైపాస్ కు వెళ్లవలయును. గురవాయపాలెం, యల్లమంద మీదుగా నరసరావుపేట వైపుకు వెళ్ళుటకు ఎటువంటి వాహనములు అనుమంతించబడవు.

15. నరసరావుపేట టౌస్ నుండి కోటప్పకొండ కి వచ్చే ప్రభలు ఉదయం 10.00 గంటలకు బయలదేరి వయా యల్లమంద, గురవాయపాలెం గ్రామాల మీదుగా సాయంత్రం 4.00 గంటలకి ప్రభల నిధి వద్దకి చేరుకోనవలయును. తరువాత అనుమతించబడవు.

16. రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి రాత్రి 1.00 AM తరువాత తిరిగి వెళ్ళే వాహనాలు ఐరన్ బ్రిడ్జి మీదుగా  గోనేపూడి, కేసానుపల్లి మీదుగా నరసరావుపేట వైపుకు గాని చిలకలూరిపేట వైపుకు గాని వెళ్ళ వచ్చును.

17. AM రెడ్డి కాలేజ్ జంక్షన్ నుండి వాహనాలు బైకులు కాలుకట్ట పైకి అనుమతి లేదు.

18. కొండపైకి నడిచి వెళ్ళు భక్తులు మెట్ల దారిలో మాత్రమె నడచి వెళ్ళ వలయును. ఘాట్ రోడ్ లో భక్తులు కాలి నడకన వెళ్ళుటకు ఎలాంటి అనుమతులు లేవు. 

19. కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగు చేసుకొనుటకు పల్నాడు జిల్లా పోలీసు వారిచే ఏర్పాటు చేసిన “Kotappakonda Parking” అనే App ను Google Play store నుండి Download చేసుకుని App Home page లో కనపడుతున్న బైక్, ఆటో, కార్, ట్రాక్టర్ గుర్తులపైన తాకగా మీకు దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలాలను సూచిస్తుంది. వాటిల్లో మీకు అందుబాటులో ఉన్న పార్కింగు ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.    


 భక్తులకి పోలీసు వారి ముఖ్య గమనిక

1. మీ విలువైన వస్తువులు అనగా సెల్ ఫోన్లు, బంగారం మరియు డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి.

2. మీ వాహనాలను మీకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోగలరు. రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపరాదు.

3. చిన్నపిల్లలని మీ వెంట జాగ్రత్తగా తప్పిపోకుండా చూసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరైనా పిల్లలు గానీ, పెద్దలుగానీ తప్పిపోయిన యెడల కంట్రొల్ రూమ్ నందు సంప్రదించగలరు.

Share:

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.


చిలకలూరిపేట :- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాక్షస పాలనకు చిరునామాగా మారారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు అన్నారు. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేట 32వ వార్డు శాంతినగర్‌లోని శాంతినిలయం చర్చిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శరత్ క్షేమంగా ఉండాలని.. త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు దయతో వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసుల నుంచి శరత్ నిర్దోషిగా బయటకు వస్తారని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌రెడ్డి ఏపీఎస్‌డీఆర్‌ఐని అడ్డంపెట్టుకొని శరత్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేయడం, బెదిరించడం, లొంగకపోతే కేసులు పెట్టడం అధికారపార్టీకి మాములైందన్నారు. శరత్‌ను అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట:-  జాతీయ బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  మాజీ మంత్రి,నర్సరావు పేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడుకు మంగళవారం వినతిపత్రం అందించడం జరిగింది. పట్టణ ములోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో భాగంగా కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృధ్వీరాజ్ సాయి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్ మాట్లాడుతూ  నరసరావుపేట రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో బి.సి సామాజిక వర్గానికి 53 సెంట్లు భూమి, భవన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, ఆ స్థలం ముందు కొంతమంది  శాశ్వత రేకుల షెడ్లు, చిన్న..చిన్న పాకాల నిర్మాణాలు చేపడుతున్నారని, ఇవి తొలగించాలని సంబంధిత అధికారులకు తెలియపరిచిన కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మునుముందు భవన నిర్మాణం చేపట్టేటప్పుడు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

 చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:-  పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట వైయస్ఆర్సిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మరియు పార్టీలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి కేడర్ చాలా బలంగా ఉంటుందని. చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి పార్టీ గెలుపుకి కృషి చేద్దామని. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు గెలుపుకై కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజులు కార్యకర్తలు సమయమును పాటిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఏడికి ఏడు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి కి మనం అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడి తాను రెండుసార్లు ఎమ్మెల్యేని అయ్యానని ఒకసారి మంత్రిగా కూడా పని చేశానని కష్టం విలువ తనకు తెలుసునని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అదే వైఎస్ఆర్సిపి ముఖ్య అజెండా అని ఆయన తెలిపారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ


ఆంధ్రప్రదేశ్ :- బీసీలు అందని ఐక్యం చేస్తూ రేపు మంగళగిరిలో జయహో బిసి అనే పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు వారి అభివృద్ధి అభ్యుదయానికి ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు TDP పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున బిసి కార్యకర్తలు, పార్టీలోని ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. పల్నాడు జిల్లా నుండి భారీగా బూత్ స్థాయి నుండి కార్యకర్తలు, ముఖ్య నేతలు, బీసీ అధికార ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఈ సభ దేశంలోనే అతిపెద్ద బీసీ సభ అవుతుందని వారు తెలియజేశారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

 https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి


పాఠశాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్ ని ఆన్లైన్లో పొందవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ జిల్లాని సెలెక్ట్ చేసి స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.ఈనెల 18 నుండి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు.


https://www.bse.ap.gov.in/apsscht24/RegDefault.aspx


చిలకలూరిపేట పట్టణంలోని వార్తలను త్వరగా పొందడం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి & ఆ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.


https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్

చిలకలూరిపేట - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆఫీసు నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి రూ.1,70,000/- చెక్కును మంజూరు చేసారు.ఈరోజు నాగండ్ల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్  చెక్కును అందజేశారు.

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ వాస్తవ్యులు కనడం గౌతం రామ్ సాయి ఊరి నడిబొడ్డున కట్టలపాము కరవగా ఆ పురుగు విషం ఊపిరితిత్తులకి చేరి అనారోగ్యంతో హస్పిటల్ లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారి కుటుంబానికి అండగా  శ్రీ మర్రి రాజశేఖర్ ముఖ్యమంత్రి సహయనిధి నుండి 70,000/-డెబ్భై వేల రూపాయలు మంజూరు చేయించారు.ఈరోజు వారి కుటుంబ సభ్యులకు చెక్కు అందించారు.

అలాగే గోవిందపురం వాస్తవ్యులు నీరుకొండ నాగరాజకుమారి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరు అయిన 80,000/-యెనభైవేలరూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు. వారితో పాటుగా మండల యువజన విభాగ మాజీ అధ్యక్షులు వేజర్ల కోటేశ్వరరావు, తోట పుల్లారావు, ఆలా మస్తాన్, గాయాల కొండలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి, శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ కి తమ ధన్యవాదాలు తెలియజేశారు.


చిలకలూరిపేట పట్టణంలోని వార్తలను త్వరగా పొందడం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి & ఆ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది - అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.


చిలకలూరిపేట నియోజకర్గం :-  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి గెలుపు ఖాయమైన నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్టుచేసి  వేధింపులకు పాల్పడుతోందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. చిలకలూరిపేట నివాసంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ఆయన వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత నల్లపాటి రాము, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్తిపాటి నివాసానికి తరలివచ్చారు.  ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమని సర్వేల్లో సుస్పష్టంగా తెలిసిందని.. ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా ప్రత్తిపాటి నిలిచారని అన్నారు. ఇది గమనించి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రత్తిపాటిని ఏమీ చేయలేక కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి సవాళ్లు ఎన్నో చూశామని.. భయపడేది ప్రసక్తే లేదని తెదేపా నేతలకు తెలిపారు. నేను గానీ నా కుటుంబసభ్యులు గానీ తప్పు చేయలేదు.. తలవంచేది లేదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కక్షకట్టి చిన్న పిల్లోడిని జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. శరత్ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు... ఉన్నత విద్యావంతుడు. రాజకీయాలకు దూరంగా తన పని ఏదో తాను చేసుకుంటున్నాడని అని పేర్కొన్నారు. ఎక్కడా తెరపై కనిపించరు.. అత్యంత సౌమ్యుడు... అలా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. తన రాజకీయ జీవితం కోసం కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కష్టసమయాన్ని తమ కుటుంబం మొత్తం కలిసి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెదేపా కుటుంబం మొత్తం అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ కూడా భరోసా ఇచ్చారని అన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్తిపాటి.

Share:

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

 ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు కారణం ఇదేనా ?

పల్నాడు జిల్లా :- చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. శరత్ పై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో, ప్రాసిక్యూషన్ వాదోపవాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి 14 రోజులు రిమైండర్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తెలంగాణలో కూడా ఇదే తరహా కేసుని నమోదు చేసినట్లు, ఒకే రకం కేసు పై రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం విరుద్ధమని, 409 సెక్షన్ వర్తించదు అని ప్రత్తిపాటికి సంబంధించిన బెనర్జీ లక్ష్మీనారాయణ వాదించారు. దీంతో 409 సెక్షన్ ను కేసు నుంచి తొలగించారు.

అసలు జీఎస్టీ ఎగవేత కేసులు ఇంత హడావిడిగా పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో అసలు కారణం జీఎస్టీ ఎగవేత లేదా ఇంకేమైనా ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వద్ద నుండి వెయ్యని రోడ్డుకు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. శరత్ తో పాటు మరో ఆరుగురిపై పై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.