మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

చిలకలూరిపేట - రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న వైకాపా కుయుక్తులపై అప్రమత్తత, సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతునే జగన్ కుట్రలను ప్రతిఒక్కరు జాగ్రత్తగా గమనించాలని కోరారు. దువా చదివి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించేందుకు ముస్లింల ఆశీస్సులు అందించాలని కోరారు. నిజానికి ఎన్‌ఆర్సీ, సీఏఏ, ట్రిపుల్ తలాక్‌, కశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌పై లోక్‌సభ, రాజ్యసభలో బలపరిచింది వైసీపీనే అని మండిపడ్డారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేసిన ఆయన కొందరు స్వార్థంకోసం ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజైనా ముస్లిం మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి అందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు ప్రత్తిపాటి. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకబడ్జెట్, ఏటా రంజాన్‌ తోఫా ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో హజ్ హౌస్‌తో పాటు రూ.25 కోట్లతో కడపలోనూ హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. తెలుగుదేశంతోనే షాదీఖానాలు వచ్చాయన్న ప్రత్తిపాటి  గతంలో దుల్హన్ పథకాన్నీ వైకాపా నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మసీదుల ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అనే అన్నారు ప్రత్తిపాటి. మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికలకు రూ.50 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసి కాపాడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజుకీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు, తెలుగుదేశం అంటే అంత గౌరవం అన్నారు ప్రత్తిపాటి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నమ్మకాన్ని కదల్చలేరని కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం సోదరులకు మరింత సంక్షేమాన్ని అందించి తీరతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు.

గత మూడు నెలలుగా  మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్  యునియన్(AITUC) నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దె ఇళ్లల్లో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు.

గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగు చేయాలని, క్రొత్త పారిశుద్ధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది.

రెండు రోజులలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

 ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఒడిశా బాల చిన్నారావు అనే వ్యక్తి సాతులూరు మీదుగా నరసరావుపేట వెళ్తుండగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారావు స్కూటీని ఢీకొనడంతో తల బలంగా రోడ్డుకు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచార మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.

Share:

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్


చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను  తెలియజేయాలని కోరారు.

1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో  నీటి సరఫరా చేస్తున్నారు.

2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్  ల కొరత ఉన్నవి.

3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.

4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.

5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.

6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.

7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.

8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.

9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.

10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల  ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share:

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి


మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల 

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:- 

 కడప నుంచి బరిలో YS షర్మిల

 రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు

  బాపట్ల నుంచి జెడి శీలం 

 కాకినాడ నుంచి పళ్ళం రాజు 

అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్

 విశాఖ నుంచి సత్యారెడ్డి 

 ఏలూరు నుంచి లావణ్య

 రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ 

 చిత్తూరు బరిలో చిట్టిబాబు 

 హిందూపురం నుంచి షాహిన్ 

 ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి 

మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.

Share:

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నాయకులు వీరే ...

చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ మాజీ డైరెక్ట‌ర్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగి అసెంబ్లీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్ర‌వారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వ‌ర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప్ర‌త్తిపాటి పుల్లారావుగారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి స‌మ‌క్షంలో మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ కీల‌క‌నేత‌లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు క‌ప్పుకున్నారు. తెదేపాలో చేరిన‌వారిలో య‌డ్ల‌పాడు మండ‌ల జ‌డ్పీటీసీ స‌భ్యులు ముక్తా వాసు, చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ కొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు, మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌లు తులం సుధాక‌ర్‌, చెమిటిగంటి పార్వ‌తిదేవి, బిట్రా రాజేంద్ర‌ప్ర‌సాద్, షేక్ జ‌మీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిల‌ర్‌, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయ‌కులు పంగులూరి వెంగ‌ళ‌రాయుడు, వైకాపా సీనియ‌ర్ నాయ‌కులు గాలి బుచ్చ‌య్య‌,  బీసీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు, వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఎం.వి.ర‌త్నారెడ్డి, మ‌హిళావిభాగం ప‌ట్ట‌ణ అధ్య‌క్షురాలు యాదాల సుజాత‌, బుక్కాపురం స‌ర్పంచ్ అల్లం ఆంజ‌నేయులు, విద్యార్ధి విభాగం నాయ‌కులు నాగూర్‌, ఇక్భాల్‌, గౌస్‌లు, సీనియ‌ర్ నాయ‌కులు రామిశెట్టి తాండ‌వేశ్వ‌ర‌రావు, తోట సీత‌య్య‌, కోట నాగ‌పూర్ణ‌చంద్ర‌రావు, గుంజి బాజిల‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు TDP లో చేరారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...


1. విజయనగరం లోక్‌సభ - అప్పలనాయుడు, 

2. ఒంగోలు లోక్‌సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి, 

3. అనంతపురం లోక్‌సభ - అంబికా లక్ష్మినారాయణ, 

4. కడప లోక్‌సభ- చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్లు ప్రకటన.. 


1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు, 

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు, 

3. పాడేరు - వెంకటరమేష్‌ నాయుడు, 

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి, 

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, 

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌, 

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం, 

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, 

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించిన టీడీపీ

మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..

Share:

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.


Follow below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?


2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.

నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.

కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మిమ్మల్ని  బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.

పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.

మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)

స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.

డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.

ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.

Share:

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

రాజమండ్రి- పురంధేశ్వరి, 

అనకాపల్లి- సీఎం రమేష్‌

అరకు-కొత్తపల్లి గీత, 

రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి-వరప్రసాద్‌, 

నరసాపురం-శ్రీనివాసవర్మ

ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు, (TS)

వరంగల్‌-ఆరూరి రమేష్‌ (TS)


18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...

1.పిఠాపురం : పవన్ కళ్యాణ్

2. నెల్లిమర్ల: లోకం మాధవి

3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ 

5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ 

6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్

7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్ 

8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు 

9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ 

11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్ 

12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 

13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు 

14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్ 

15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు 

16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు 

17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు 

18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.

నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.

మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.


Click on below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.