మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

అంబటి & కోడాల నాని దిష్టిబొమ్మలను తగలబెట్టిన చిలకలూరిపేట టిడిపి శ్రేణులు - తాతపూడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన టిడిపి నాయకులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిరసిస్తూ మండలంలోని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మధంతో సభా విలువలను తుంగలో తొక్కి నిండు శాసనసభలో శ్రీమతి భువనేశ్వరి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి శాసనసభను కౌరవ సభగా మార్చారని.. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని అందులో భాగంగానే నేడు శాసనసభలో మహిళలపై నోటికి ఏది వస్తే అది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని. పట్టణంలోని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఘటనలను నిరసిస్తూ పట్టణంలోని NRT సెంటర్ నందు శాసనసభ్యుడు అంబటి రాంబాబు, మంత్రివర్యులు కొడాలి నాని దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాగే తాతపూడి జాతీయ రహదారిపై నిర్వహించారు టిడిపి నాయకులు.



Share:

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:- పట్టణంలో రేపు అనగా 20/11/2021 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలోని బొందిలి పాలెం ఫీడర్ మరమ్మతులు కారణంగా రేపు అలాగా రేపు అనగా 20/11/2021 శనివారం నాడు జాగు పాలెం, బొందిలి పాలెం, చీరాల రోడ్డు, కొమరవెల్లి పాడు, గంటలమ్మచెట్టు, సుందర్ రెడ్డి హాస్పటల్, పెట్రోల్ బంక్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సిహెచ్ రామ్ బొట్లు తెలిపారు. వినియోగదారుడు సహకరించాలని ఆయన తెలియజేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

టిడిపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన చంద్రబాబు నాయుడు - వీడియో

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అసెంబ్లీ సమావేశాల నుండి శపథం చేసి బయటికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతరం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా మాట్లాడుతూ డిగ్నిఫైడ్గా ,పరువుతో ఉంటున్న తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. ప్రపంచంలోని నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు రాష్ట్రానికి తీసుకు వచ్చాను ,అని చాలా మంది రాజకీయ నాయకులతో తాను పని చేశానని తెలుపుతూ.. తన భార్య ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు.

Video

Share:

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని సభ్యులను విమర్శించారని అయినా తాము పట్టించుకోలేదని, చివరకు తన భార్యపై సభలో చర్చ జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ తాను ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.



Share:

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ సమావేశం ఈ ఒక్కరోజు మాత్రమే అని స్పీకర్ తమ్మినేని సీతారాం అనగా.. వెంటనే తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించుకోవాలి అని 15 రోజులు అయినా సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. వెనువెంటనే సీఎం జగన్ కలుగజేసుకుని పెద్దాయన అచ్చన్న అడిగినందుకు అయినా ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బదులిచ్చారు. అయితే సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని - అంతటితో ఆగకుండా చంద్రబాబు అసెంబ్లీ సమావేశం హాజరుకావాలని, ఆయన మొహం ఒకసారైనా చూడాలని ఉందని సీఎం జగన్ అచ్చన్నను కోరారు. చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా "ఉమెన్ ఎంపవర్ మెంట్" టాపిక్ పైన చర్చించారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి  - ఎవరు ? ఎక్కడ !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి 10 వార్డ్ కడిమికొండ శ్రీలక్ష్మి (టిడిపి రెబల్) ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే శ్రీలక్ష్మి టిడిపి రెబల్ అవ్వటంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



Share:

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామంటేనో, చనిపోయినప్పుడు బంధువులకు సమాచారం అందించేటప్పుడో, కోపం లోనో లేదా ఆనందంలోనో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనకు చిరాకు తెప్పించే విషయం కరోనా కాలర్ ట్యూన్. దీనివలన మనం చెప్పాలనుకున్న విషయం చెప్పలేక కాలర్ ట్యూన్ మీద కోపంతో విసిగిపోయి ఉన్నారా !  అయితే ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కరోనా కాలర్ ట్యూన్ వినబడితే వెంటనే 1 నొక్కండి అప్పుడు ట్యూన్ ఆగిపోయి రింగింగ్ శబ్దం వినబడుతుంది.

ఒకవేళ నీ ఫోన్ కి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారికి కరోనా కాలర్ ట్యూన్ వినపడకుండా ఉండాలంటే !

BSNL :- UNSUB అని టైప్ చేసి 56700 & 56799 నెంబర్కు కు మెసేజ్ చేయండి.

AIRTEL :-CANCT అని టైప్ చేసి 144 ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి.

JIO :- STOP అని టైప్ చేసి 155223 ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.



Share:

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ -  తృటిలో తప్పిన ప్రమాదం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఉన్న స్పీడ్ రిసిస్టర్స్ వద్ద కారును స్లో చేయగా, వెనక నుండి వచ్చిన లారీ కారును ఢీ కొనడంతో కారు డివైడర్ పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో కారు వెనుక భాగంతో పాటు ముందు భాగం కూడా ధ్వంసం అవ్వగా లోపలున్న ప్రయాణికులకు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగం తగ్గడంతో ప్రమాద స్థాయి తక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.



Share:

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరవేశాయి అక్కడి వైసీపీ శ్రేణులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు మొత్తం 24 వార్డుల గాను ఒక వార్డు ఏకగ్రీవం అవగా 12 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటివరకు వైసిపి 13 అభ్యర్థులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. 2 టిడిపి అభ్యర్థులు గెలిచి ఉన్నారు. మిగిలిన వార్డుల్లో టిడిపి ఆదిక్యత చూపిస్తుంది.



Share:

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్ష ధోరణితో  ఎయిడెడ్ పాఠశాలల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయు కార్యక్రమాన్ని తలపెడితే, అప్రజాస్వామికంగా విద్యార్థి సంఘాల నేతలను కనీసం శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,  ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాని నడపడానికి అప్పులు  దొరకని తరుణంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూముల్ని స్వాధీనం చేసుకుని వాటితో అప్పులు తెచ్చుకోవాలని చూడండం దారుణం అన్నారు. నాడు అమ్మఒడి ఇస్తామని అధికారంలోకి వచ్చి  నేడు అమ్మకానికి బడిని పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములు స్వాధీనం చేసుకోవాలని తీసుకువచ్చిన జీవో నెం.50, 51లను రద్దు చేయకపోతే  విద్యార్థులుతో మరియు యువజన సంఘలుతో  కలిసి ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చెప్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర TNSF కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్, గుంటూరు పార్లమెంట్ TNSF అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ TNSF అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు మరియు పలు TNSF విద్యార్థి సంఘాలు పాల్గొనడం తదితరులు జరిగింది.



Share:

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మరో 10 గొర్రెలు అస్వస్థతతో ఉండటంతో గమనించిన యజమానులు హుటా హుటిన వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని వైద్యశాలకు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు గొర్రెలు ప్లాస్టిక్ కవర్లను, ఇతర కలుషిత పదార్థాలను తినడం వల్ల మరణించాయని ఆయన తెలిపారు. చనిపోయిన 35 గొర్రెలు విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని అంచనా ! అస్వస్థతతో ఉన్న 10 గొర్రెలను ప్రాణాలతో కాపాడాలని షేక్ రఫాని వెటర్నరీ వైద్యులకు తెలిపారు.



Share:

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి(30) అనే యువకుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన యువకుడిని చిలకలూరిపేట లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పటల్ కు చేరుకొని ఘటనకు పాల్పడిన వ్యక్తిని పరామర్శించారు.



Share:

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని మాట తప్పడంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మాటతప్పారని,ఉద్యోగుల సీపీఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానని నమ్మబలికి ఉద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన ఘనత సాధించారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైస్సార్సీపీ సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేస్తానని చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ కమ్మ కులస్తుడు కావడంతో కమ్మకులాన్ని అనగదొక్కాలనే ఆయనకు చివరిరోజు వరకూ వేచి చూసేలా చేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని,ఇది చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను, ఆయన అభిమానులను మోసం చేయడమే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీలో పదవులకు సంబంధించిన విషయంగా ఈ అంశాన్ని చూడలేమని ఎమ్మెల్సీ,మంత్రి పదవి రాజ్యాంగ బద్ధమైన వి కనుక చిలకలూరిపేట కు రావాలనే ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరుగార్చడం వైస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించే విషయం అని మర్రి రాజశేఖర్ అభిమానులు మరోసారి మోసపోయిన విషయాన్ని గ్రహించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో,గుంటూరు జిల్లాలో వైస్సార్సీపీ ని పునాదులు పెకళించి వేస్తారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నియోజకవర్గ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్ కాంగ్రెస్ పాలన ఈ సంఘటనతో  అంతిమ క్షణాలు లెక్కించడం మొదలు అయిందని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రావి వెంకటరమణ నుఇదే తరహాలో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు.



Share:

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఉప్పుతెల్ల. సిద్దు , మేకపోతుల నాగేశ్వరరావు లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ డిసెంబర్ 10 వరకు అమలులో ఉన్నందున విరమించుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్ ,బి.సాయి నాయక్ , మాదాసు పృథ్వీరాజ్, ఎమ్.ఫణి, పి.మహేష్ ,జగదీష్ తదితరులు ఉన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.