మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి


మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల 

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:- 

 కడప నుంచి బరిలో YS షర్మిల

 రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు

  బాపట్ల నుంచి జెడి శీలం 

 కాకినాడ నుంచి పళ్ళం రాజు 

అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్

 విశాఖ నుంచి సత్యారెడ్డి 

 ఏలూరు నుంచి లావణ్య

 రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ 

 చిత్తూరు బరిలో చిట్టిబాబు 

 హిందూపురం నుంచి షాహిన్ 

 ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి 

మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.

Share:

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నాయకులు వీరే ...

చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ మాజీ డైరెక్ట‌ర్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగి అసెంబ్లీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్ర‌వారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వ‌ర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప్ర‌త్తిపాటి పుల్లారావుగారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి స‌మ‌క్షంలో మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ కీల‌క‌నేత‌లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు క‌ప్పుకున్నారు. తెదేపాలో చేరిన‌వారిలో య‌డ్ల‌పాడు మండ‌ల జ‌డ్పీటీసీ స‌భ్యులు ముక్తా వాసు, చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ కొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు, మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌లు తులం సుధాక‌ర్‌, చెమిటిగంటి పార్వ‌తిదేవి, బిట్రా రాజేంద్ర‌ప్ర‌సాద్, షేక్ జ‌మీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిల‌ర్‌, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయ‌కులు పంగులూరి వెంగ‌ళ‌రాయుడు, వైకాపా సీనియ‌ర్ నాయ‌కులు గాలి బుచ్చ‌య్య‌,  బీసీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు, వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఎం.వి.ర‌త్నారెడ్డి, మ‌హిళావిభాగం ప‌ట్ట‌ణ అధ్య‌క్షురాలు యాదాల సుజాత‌, బుక్కాపురం స‌ర్పంచ్ అల్లం ఆంజ‌నేయులు, విద్యార్ధి విభాగం నాయ‌కులు నాగూర్‌, ఇక్భాల్‌, గౌస్‌లు, సీనియ‌ర్ నాయ‌కులు రామిశెట్టి తాండ‌వేశ్వ‌ర‌రావు, తోట సీత‌య్య‌, కోట నాగ‌పూర్ణ‌చంద్ర‌రావు, గుంజి బాజిల‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు TDP లో చేరారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...


1. విజయనగరం లోక్‌సభ - అప్పలనాయుడు, 

2. ఒంగోలు లోక్‌సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి, 

3. అనంతపురం లోక్‌సభ - అంబికా లక్ష్మినారాయణ, 

4. కడప లోక్‌సభ- చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్లు ప్రకటన.. 


1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు, 

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు, 

3. పాడేరు - వెంకటరమేష్‌ నాయుడు, 

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి, 

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, 

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌, 

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం, 

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, 

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించిన టీడీపీ

మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..

Share:

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.


Follow below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?


2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.

నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.

కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మిమ్మల్ని  బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.

పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.

మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)

స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.

డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.

ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.

Share:

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

రాజమండ్రి- పురంధేశ్వరి, 

అనకాపల్లి- సీఎం రమేష్‌

అరకు-కొత్తపల్లి గీత, 

రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి-వరప్రసాద్‌, 

నరసాపురం-శ్రీనివాసవర్మ

ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు, (TS)

వరంగల్‌-ఆరూరి రమేష్‌ (TS)


18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...

1.పిఠాపురం : పవన్ కళ్యాణ్

2. నెల్లిమర్ల: లోకం మాధవి

3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ 

5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ 

6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్

7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్ 

8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు 

9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ 

11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్ 

12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 

13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు 

14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్ 

15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు 

16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు 

17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు 

18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.

నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.

మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.


Click on below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా రకరకాల పేర్లు పుకార్లు షికారులు చేయక వాటన్నిటికీ తరలించుతూ నేడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కన్ఫామ్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా రామిరెడ్డి అనే వ్యక్తి చదలవాడకు టికెట్ కోరుతూ పురుగుల మందు తాగిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో నరసరావుపేటలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలుగా నరసరావుపేటలోని టిడిపి క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న చదలవాడా అనింది బాబు కాకుండా వేరే వారికి ఇస్తే పరిస్థితి దారు మారవుతుందని ఉద్దేశంతో టిడిపి పునః ఆలోచన చేసి చదలవాడకే టికెట్ కన్ఫామ్ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలంటే యువత అయితే బాగుంటుందని టిడిపి ఆలోచించినట్టు తెలుస్తుంది.

హాట్ సీట్లైనా నరసరావుపేట, విజయవాడ. విశాఖపట్నం, గుంటూరులలో సామాజిక ఆర్థికపరంగా బలంగా ఉండే వ్యక్తులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా అందులో 13 స్థానాలను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలలో విజయనగరం, కడప, ఒంగోలు, అనంతపురం ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు తెలియాల్సి ఉంది.

ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు,

 విశాఖపట్నం - భరత్, 

అమలాపురం - గంటి హరీష్ మాధుర్‌, 

ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్, 

విజయవాడ - కేశినేని చిన్ని, 

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌, 

నర్సరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, 

బాపట్ల - టి. కృష్ణప్రసాద్, 

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, 

కర్నూలు - బస్తిపాటి నాగరాజు, 

నంద్యాల - బైరెడ్డి శబరి, 

హిందూపూర్‌-బీకే పార్థసారథి


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

అసెంబ్లీ అభ్యర్థులు: పలాస-గౌతు శిరీష, 

పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, 

శ్రీకాకుళం-గొండు శంకర్‌, 

శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, 

కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, 

పెనమలూరు-బోడె ప్రసాద్, 

మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, 

నర్సరావుపేట - చదలవాడ అరవింద్‌ బాబు, 

చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్,

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


Follw below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్


Share:

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.