మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

భారత్ పై పాకిస్తాన్ భారీ విజయం. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో తడబడింది. రోహిత్ శర్మ డెకౌట్ అవగా వెంటనే కేఎల్ రాహుల్ (3) తో వెనుదిరిగాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్(11) అవుటయ్యాడు. కోహ్లీ(57) పంత్ కొంచెం సేపు మెరిపించినా భారత్ 20 ఓవర్లకు గాను 151-7 వికెట్లు నష్టంతో మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.

తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బాబర్ ఆజం(68) రిజ్వాన్(79) చెలరేగిపోయారు. పాకిస్తాన్ ఆట ముందు భారత్ బౌలర్లు తేలిపోయారు. షమ్మీ, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఎవరిని వదలకుండా వీర బాదుడు బాధి పారేశారు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్స్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 13 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది.



Share:

నేడే దాయాదుల పోరు - విజయం ఎవరిని వరించనుంది ?

నేడే దాయాదుల పోరు - విజయం ఎవరిని వరించనుంది ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ప్రపంచం మొత్తం ఆ రెండు దేశాల మధ్య ఏం జరిగినా పెద్ద న్యూస్ మరియు వింతలా చెప్పుకుంటారు. అలాంటిది గత కొంత కాలంగా ఆ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొని చివరకు క్రీడలు ఆడుకోవడానికి కూడా సుముఖంగా లేని ఆ దాయాది దేశాలు నేడు మహా సంగ్రామంలో  పాల్గొన్న పోతున్నాయి. ఇంతకీ ఆ రెండు దేశాలు ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దాయాది దేశాలు అయినా ఇండియా పాకిస్తాన్ మధ్య నేడు 2021 టి20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి. దీంతో ఆ రెండు దేశాలు కాకా యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయిదు సార్లు ప్రపంచకప్లో పాల్గొనగా ఐదుసార్లు భారత్ విజయం సాధించింది. అయితే నేడు జరిగే మ్యాచ్ భారత్ జట్టు తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఫామ్ లో ఉన్నారు. నేడు సాయంత్రం 7:30 నిమిషాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నందు ఈ మ్యాచ్ జరగనుంది.



Share:

చిలకలూరిపేట - బియ్యం దొంగలు - తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

చిలకలూరిపేట - బియ్యం దొంగలు - తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - చిలకలూరిపేట నుండి  గణపవరం డొంక రోడ్డు నందు ఉన్న గోడౌన్ నందు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం వివరాల్లోకి వెళ్తే

సివిల్ సప్లైస్ డిటి నాగమల్లేశ్వరరావు, గుంటూరు సివిల్ సప్లైస్ డిటి  హూక్, విఆర్వో సాంబశివరావులకు అందిన సమాచారం మేరకు గణపవరం డొంక రోడ్డు నందు ఒక గోడౌన్ నందు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 308 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని 25 కేజీల బస్తాల చొప్పున మొత్తం సుమారు 1200 బస్తాలను సిద్ధం చేసినట్లుగా గుర్తించారు. వెంకటేశ్వర్ రెడ్డి, చిన్నబ్బాయి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని అని వారిపై కేసు నమోదు చేశారు.




Share:

చిలకలూరిపేట:- మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ సభ్యులు వీరే

చిలకలూరిపేట:- మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ సభ్యులు వీరే

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం సభ్యులను జీవో నెంబర్ 661 ప్రకారం అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ యార్డ్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్యే విడుదల రజినిగా మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మద్దిరాల విశ్వనాథం, వైస్ చైర్మన్గా చిలకలూరిపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడైన కోణాల వెంకట సుబ్రహ్మణ్యం నియమించింది. అలాగే పావులూరి శరత్ ప్రసాద్, యలగాల ఉమా సుందరి, కుంభ అనూష, షేక్ జాన్ బి, పటాన్ గౌస్, తిరుమలదేవి, ఆర్. వెంకటరత్నం, సాతులూరు ప్రసన్న, ఎ. శ్రీరామ్ మూర్తి, తోట గీతా రాణి, షేక్ ఖయ్యుం లతో పాటుగా అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరక్టర్, చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్, సొలస పిఎసిఎస్ అధ్యక్షులను, డైరెక్టర్ల గా నియమించింది.

Share:

మావోయిస్టు కాల్పుల్లో అమరులైన పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం - అమరవీరుల వారోత్సవాల్లో - CI రాజేశ్వరరావు

మావోయిస్టు కాల్పుల్లో అమరులైన పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం - అమరవీరుల వారోత్సవాల్లో - CI రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో గురువారం అర్బన్ సిఐ రాజేశ్వరరావు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. మావోయిస్టుల కాల్పుల్లో విధినిర్వహణలో అమరులైన పోలీసులు సి.ఐ ఆర్. ప్రసాదు,హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ఉమర్,హోం గార్డ్ వెంకటేశ్వర రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు, కానిస్టేబుల్స్, హోంగార్డులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే సంవత్సరం లో  అమరులైన నలుగురు పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ను నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని వైసీపీ నేతలు అన్నారు. దీనికి నిరసనగా... బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నేడు(గురువారం, రేపు(శుక్రవారం) రెండురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు నిర్వహించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ పిలుపు మేరకు,గురువారం ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే  విడదల రజిని గారి ఆధ్వర్యంలో ముప్పాళ్ల హనుమంతరావు హాస్పిటల్  ఎదురు దీక్షాస్థలి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు,కౌన్సిలర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం తలపెట్టిన 36 గంటల నిరవధిక నిరసన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు  చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున  తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరలిరావాలని పార్టీ నాయకులు కోరారు. ఉదయం 11 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. చిలకలూరిపేట నియోజకవర్గానికి నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  చంద్రబాబుతో వేదికను పంచుకునే అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. కావున నియోజకవర్గంలో పార్టీ  ముఖ్యనాయకులు, రైతు సోదరులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు రేపటి కార్యక్రమంలో పాల్గొని  చంద్రబాబు దీక్షను విజయవంతం చేయాలన్నారు.



Share:

ఈర్షతో ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు - నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి - MLA రజిని

ఈర్షతో ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు - నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి - MLA రజిని

https://chilakaluripetspeednews.blogspot.com/2021/10/ysrcp-ysrcp.html?m=1

చిలకలూరిపేట పట్టణంలో  YSRCP ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ CM జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఓర్వలేక ఈర్ష్యతో పట్టాభి లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు స్క్రిప్టుని అందించి CM జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాగే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆమె తెలిపారు. టిడిపి పార్టీ రాష్ట్రంలో తమ ఉనికిని కోల్పోతున్న భయంతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని YSRCP నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు YSRCP యూత్ భారీగా పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట:-YSRCP భారీ ర్యాలీ - పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టిన చిలకలూరిపేట YSRCP శ్రేణులు

చిలకలూరిపేట:-YSRCP భారీ ర్యాలీ - పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టిన చిలకలూరిపేట YSRCP శ్రేణులు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని MLA రజిని & YSRCP నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నాయకుడు పట్టాభి బహిరంగంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని YSRCP కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

రాష్ట్రంలో దుర్మార్గాలు, అరాచకాలు అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రపతి పాలన విధించాలి - ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో దుర్మార్గాలు, అరాచకాలు అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రపతి పాలన విధించాలి - ప్రత్తిపాటి పుల్లారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడులకు నిరసన తెలుపుతూ ఈరోజు టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించింది. అయితే ఉదయం నుండి రాష్ట్రంలోని టిడిపి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ మరియు టిడిపి కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలు అరాచకాలు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.



Share:

చిలకలూరిపేట - గృహనిర్బంధం - టిడిపి కార్యకర్తల అరెస్ట్

చిలకలూరిపేట - గృహనిర్బంధం - టిడిపి కార్యకర్తల అరెస్ట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నిన్న జరిగిన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడులకు నిరసనగా పట్టణంలోని టిడిపి నాయకులు బందుకు పిలుపునిచ్చారు. అయితే పోలీస్ శాఖ అప్రమత్తమై టిడిపి ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు. అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీస్ వారు టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.



Share:

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్న కారణంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుట సహేతుకంగా లేనందున మేము  బంద్ కు మద్దతు తెలియపర్చుటలేదు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక వ్యాపార మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నందువలన, ఈ బంద్ వలన సమాజానికి సరైన ఉపయోగం లేనందున చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట వారు ఈ బంద్ కు సహకరించుట లేదు అని చిలకలూరిపేట చాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు.





Share:

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం పై జరిగిన దాడుల కారణంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండల టిడిపి అధ్యక్షుడు బండారు సత్యనారాయణ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పట్టణంలో టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయాలని తెలిపారు.



Share:

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా బుధవారం తలపెట్టిన చిలకలూరిపేట బందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ముద్దన నాగేశ్వర రావు  మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అదే విధంగా విశాఖ, కడప, హిందూపురం, విజయవాడ తదితర కార్యాలయాలు, నాయకుల ఇళ్ల పై భౌతిక దాడులు చేయడమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరు,ఊరు తిరుగుతూ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా ప్రజల పై అనేక రకాలుగా మోపుతున్న పన్నుల భారాన్ని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని అధికారపక్షం భౌతిక దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రశ్నించిన వారి పై భౌతిక దాడులు చేయడం అదే విధంగా కార్యాలయాలు ధ్వంసం చేయడం అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని, ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై దాడి చేయడం,తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పై చేసిన దాడి అని అన్నారు. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ లక్ష్యమని,ఇది ఒక ప్లాన్ ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.



Share:

రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

 రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ :-  మంగళవారం నాడు ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం సాయంత్రం సమయంలో మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయాన్ని YSRCP కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా రేపు అనగా బుధవారం నాడు ఏపీ రాష్ట్ర బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. మంగళగిరి తో పాటు  రాష్ట్రంలోని పలు జిల్లాల టిడిపి ప్రధాన కార్యాలయాలపై దాడికి యత్నించడంతో పాటు  టిడిపి నేత పట్టాభి ఇంటిని ధ్వంసం చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం విఫలం అయిందని మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంగళగిరి జాతీయ రహదారిపై టిడిపి కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.