మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

 చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  పిఎస్ ఫైవ్ ఆపోజిట్లో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినది. రామచంద్రపురం గ్రామానికి చెందిన తాళ్లూరు ఇజ్రాయేలు (40) మార్తమ్మ (32) కీర్తన (15) చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ చర్చ నుండి ప్రార్థనకు వెళ్లి తిరిగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది.టు వీలర్ మీద ముగ్గురు చిలకలూరిపేట పేట నుంచి రామచంద్రపురం వెళుతున్నారు. అప్పుడే అక్కడ అనంతారం క్రాస్ రోడ్డు వద్ద హైవే క్రాస్ చేస్తూ ఎక్సెల్ మీద మద్దిరాల ప్రేమానందమ్మ వచ్చింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ప్రేమానందమ్మ  కుడి చెయ్యి మణికట్టు విరిగింది. ఇజ్రాయేలు, మార్తమ్మ, కీర్తనలకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 చిలకలూరిపేట అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




Share:

చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

 చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: ఏఎంజి, ఫార్ కార్నర్స్, వేద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ గారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట లోని జాతీయ రహదారి పక్కన ఉన్న జాన్ డేవిడ్ గారి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, AMG ఫార్ కార్నర్స్, వేద సంస్థల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాన్ డేవిడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెస్సి యస్ బర్నబాస్ మాట్లాడుతూ... డాక్టర్ జాన్ డేవిడ్ ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కష్టాల్లో ఉన్న  ఉన్న లక్షలాది మంది ప్రజానీకం సేవలు అందుకుంటున్నారని అన్నారు. గొప్ప మానవతావాది జాన్ డేవిడ్ అని అన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేసిన అపర భగీరథుడు జాన్ డేవిడ్ అని కొనియాడారు. జాన్ డేవిడ్ ఆశయ సాధనకు తమ వంతు కృషి కొనసాగిస్తామని అన్నారు.

జాన్ డేవిడ్ గారు ఒక పార్టీకి ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తిగా కాకుండా పట్టణంలోని ప్రతి ఒక్క ఒక ఇంటికి మంచి నీటి కష్టం లేకుండా చేసినటువంటి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పట్టణంలోని అన్ని ఏరియాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉంది అంటే దానికి కారణం జాన్ డేవిడ్ గారు.



Share:

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం పట్టణంలోని భావనారుషి నగర్ వద్ద ఉన్న ఒక ప్రార్థనమందిరానికి వెళ్ళి తిరిగి వెళ్లే ఈ క్రమంలో గుంటూరు వెళ్లే రోడ్డు వైపు నుంచి హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా రజక  కాలనీ వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు వేగంగా ఆటోను ఢీ కొట్టింది... ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గొల్ల శేవీరియేలు 60 సంవత్సరాలు  తలకు తీవ్ర గాయమైంది. ఎం.అక్షయ (14)కు కుడికాలు యాంకిల్ లో ఓపెన్ ఫ్రాక్చర్ అయింది. బొందు ప్రసన్న (25) తలకు గాయమైంది, బంధు విజయ్ (29) లెఫ్ట్ షోల్డర్ కి దెబ్బ తగిలింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్


చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9 గంటల సమయంలో పట్టణంలో సుభాని నగర్కు చెందిన ఖాజావలి అనే వ్యక్తి విజయ బ్యాంక్ సెంటర్ నుండి పండరీపురం వైపు వెళ్లే సమయంలో చెన్నై నుండి గుంటూరు వైపుకు వెళుతున్న కారు ఢీకొన్నది. ఈ సమయంలో ఖాజావలి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు కారు సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకే రోజు విజయ బ్యాంక్ సెంటర్లో రెండు ఘటనలు జరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గత 12 సంవత్సరాలుగా వీరు అప్పాపురం లోనే ఉంటూ వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుండో కిరణ్కు భార్య పైన వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకు పెరిగి శనివారం ఉదయం భార్యతో పాటు పొలానికి మందు చల్లడానికి వెళ్లారు. 11 గంటల సమయంలో కిరణ్ బంధువులకు ఫోన్చేసి ఉన్నట్టుండి తన భార్యకు ముక్కులో నుండి రక్తస్రావంతో పడిపోయిందని తెలిపాడు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆమె తలపై ఉన్న గాయంతో పాటుగా మేడపైన ఉన్న గొర్ల గుర్తుల ఆధారంగా ఆమెను హత్య చేసి ఉంటారని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించగా విచారణలో కిరణ్ తన భార్యను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు.





Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు కరెంటు కోతలు ఉంటాయి అనే వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఈ వార్తపై స్పందిస్తూ కరెంటు కోతలు వాస్తవమే కానీ రోజుకి 4 గంటల కరెంటు కోత ఉంటుందని, అది కూడా ఆదివారం నుండి అమలులోకి వస్తుంది అనే వార్త అవాస్తవమని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని వారు తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏమీ ఉండదని. సీఎం జగన్ ప్రజలెవరూ ఇబ్బందులకు గురి అవకుండా చూడాలని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామాలలో సాయంత్రం 6 నుండి 10 వరకు పట్టణాలలో రాత్రి 9 నుండి 12 వరకు నగరాలలో రాత్రి 11 నుండి మూడు గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయని అవాస్తవమైన వార్త చెక్కర్లు కొడుతుంది.దయచేసి ఎవరు నమ్మవద్దు అని వారు తెలిపారు.







Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది. ఆ సమయంలో ఆటో ఉన్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఇస్మాయిల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.



Share:

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ సమీపంలో పండగ సందర్భంగా పిండివంటలు చేస్తున్న ఒక ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శారదా హైస్కూల్ సమీపంలోని కావమ్మ గుడి బజార్లోని నాయుడు భవాని అనే మహిళ పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవడంతో గ్యాస్ బయటికి వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలో సదరు మహిళ ప్రమాదాన్ని గమనించి ఇంట్లో నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేసి అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు. మహిళకు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆ ఈ ప్రాంతంలోని ప్రజలు ఊపిరి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

 చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు వచ్చిన వ్యక్తి దానిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెహికల్ సీటు వేడిగా ఉండటంతో ఆ వ్యక్తి వెహికల్కు స్టాండ్ వేసి పక్కకు వచ్చారు. ఇదే సమయంలో వెహికల్లో నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఎలక్ట్రికల్ వెహికల్ విలువ సుమారు 60 వేల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా.





Share:

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జాతీయ పార్టీ అయిన నవతరం పార్టీకి కేటాయించింది. మళ్లీ ఈ నాడు బద్వేల్ ఉప ఎన్నికలకు కూడా గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే ఎన్నికల సంఘం కేటాయించారు. ఈ విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరఫున డాక్టర్ గోదా రమేష్ బాబు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Share:

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.

అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా  మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్ లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా మంచినీరు చెరువు వెళ్లి దారులు భయంకరంగా మారాయి. వాహనదారులు మరియు వాకింగ్ కి వెళ్లే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోటప్ప కొండ వైపు నుండి చెరువు రోడ్డు మీదుగా వైయస్సార్ కాలనీ రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డులోకి ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం సమయాలలో సుమారు 20 నుండి 30 టిప్పర్ వాహనాలు గ్రానైట్ లోడుతో వెళుతుంటాయి. దీంతో చెరువు రోడ్డు మొత్తం దెబ్బ తిన్నది. స్థానికుల సమాచారం మేరకు ఆయా గ్రానైట్ సంబంధించిన వారు రోడ్డుపై కంకరతో చదును చేపించారు.  అయినప్పటికీ వాహనాల టైర్లు కంకరలో ఇరుక్కు పోవటంతో సదరు గ్రానైట్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన డస్ట్ ని తీసుకువచ్చి రోడ్లపై పోశారు. దీంతో రోడ్డంతా దుమ్ముతో మరియు గుంతలతో వాహనదారులు & వాకింగ్ కి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మున్సిపల్ శాఖ దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించే వలసిందిగా వాకింగ్ కు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఏరియాలో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న  సమయంలో ఇలాంటి  పరిస్థితులు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయని. అలాగే పట్టణంలోనే ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు రోడ్ లోనే ఉంటుందని దానిని ఇలా నాశనం చేయవద్దని వారు కోరారు.






Share:

చిలకలూరిపేట మండలం :- ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

 చిలకలూరిపేట మండలం :-  ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న లారీ టైర్ పడటంతో డ్రైవర్ దానిని తాతపూడి జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద ఆపారు. ఆయా లారీ కి సంబంధించిన క్లీనర్ పగిలిన టైర్లను మార్చి వేరే టైర్ మార్చే క్రమంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న మరో లారీ వెనక నుండి వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ది. ఈ సమయంలో క్లీనర్ లారీ కింద టైర్ మారుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ ఘటన జరగడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ ఇబ్బంది క్లీనర్ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్ ని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ఆ సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు.



Share:

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- కరోనా సమయంలో కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సేవలు అందించిన వైద్యులకు 13వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే  దసరా పండుగ సందర్భంగా కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేరని తెలియటం వల్ల  ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు.  వైద్యులకు సన్మానం చేసే విషయంలో తర్వాత తేదీని ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.