మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచం మొత్తం తన గురుంచి మాట్లాడుకునేలా చేసిన ఆనందయ్య మూలికల వైద్యంనకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. సీసీఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య పసరు ముందుకు అనుమతులు లభించాయి. అయితే కంటిలో వేసుకునే మందుకు, కే అనేమందుకు మాత్రం అనుమతులు రాలేదు. వాటి పైనే ఇంకా నివేదికలు రావలసి వున్నది అని తెలిపారు. మందులో ఆరోగ్యానికి హాని కలిగేంచే పదార్ధాలు ఏమి లేవు అని స్పష్టం చేసారు. అయిన మందు వలన కరోనా రోగం తగ్గుతుంది అని కానీ, దాని వల్ల దుష్ప్రబావాలు ఉంటాయి అని కానీ ఎక్కడ నివేదికలో తెలపలేదు అని తెలిపారు. కంట్లో వేసే మందు కు ఇంకా 2&3 వారల వరకు పట్టొచ్చు అని, మాములు ఇంగ్లీష్ మెడిసన్ వాడుతున్న కానీ ఈ మందు వాడొచ్చు అని తెలిపారు. అయితే మందు కోసం కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని. కరోనా బాధితులు మందు కోసం రావొద్దు అని,వారి కుటుంబసభ్యులు కానీ బంధువులు కానీ వచ్చి తీసుకోవచ్చు అని తెలిపారు. 





















Share:

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2

 చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్  సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2


https://chilakaluripetspeednews.blogspot.com/

కౌన్సిల్ సమావేశం లోని ముఖ్యంశాలు 2 వ పార్ట్ 

* చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు అంశం మళ్లీ ఒకసారి పరిశీలించాలి అని కొత్త కుమారి,శివ కుమారి గారు కోరారు. రఫాని గారు ఈ అంశం పైనా మళ్లీ చర్చించుకుందాం అని తెలిపారు. 

* 37వ వార్డ్ కౌన్సిలర్ శివ కుమారి గారు మాట్లాడుతూ మంచినీటి చెరువుకు ఫెన్సింగ్ వేపించాలి అని తెలిపారు. చెరువులో చేపలు పట్టటం, స్నానం చెయ్యటం చేస్తున్నారు, అలాగే జంతువులు గేదెలు అందులో దిగితున్నట్లు తెలిపారు. 

* 100% వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలి అని చర్చించారు

* రాబోయే కాలంలో పట్టణ శివార్లు అయిన జాలయ్య కాలనీ, AMG వెనుక, భావనారుషి నగర్, పసుమర్రు నందు గార్బజి కలక్టర్ ( చేత పోగు చేసే పాయింట్స్ ) ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అక్కడి నుండి జిందాల్ కంపెనీ కి పంపుతున్నట్లు తెలిపారు. 

* పండరీపురం కందిమళ్ల రెండవ గేట్ నందు పైప్ లీకేజీ, వాటర్ రంగు మార్పుల పైనా చర్చించారు. 

* రోడ్లు, డ్రైనేజీలు, శానిటైజేషన్, కొన్ని ప్రాంతాలలో పందుల వలన సమస్యలు, త్రాగునీరు, పారిశుద్యం [పైన చర్చించారు. 

* అమృత్ స్కీమ్ పధకం కోసం 30 కోట్ల రూపాయల బ్యాంకు లోన్ కి వెళ్ళాం అని. వాటి వలన త్రాగు నీరు సమస్య ఉండదు అని తెలిపారు. 

* త్రాగు నీరు, శానిటైజేషన్ , పారిశుద్యం కొరకు బడ్జెట్ నందు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 

* పట్టణంలోని అన్ని బోరుబావుల మరమ్మతులు, ప్రధాన కాల్వలలోని పూడిక తదితర అంశాలపైనా చర్చించారు.   























Share:

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 1

చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్  సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 1

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం నందు 31-05-2021 సోమవారం నాడు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాల పైనా చర్చించారు. అయితే సమావేశం మొదలు అవ్వగానే ముందుగా కరోనా వలన మృతి చెందిన పట్టణ ప్రజలకు సంతాపం తెలిపారు. వారి కోసం కొంచంసేపు మౌనం పాటించారు. 
మునిసిపల్ ఛైర్మెన్ రఫాని అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యంశాలు 

* తడి పొడి చెత్త సేకరణ, వినియోగదారుల పైనా యూజర్ చార్జీల అమలు విధానం , రాష్ట్ర మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. దేని పైనా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర పూర్తి అవగాహనా కల్పించేలా చర్చలు
* కరోనా మృతుదేహాల తరలింపుకు ఎర్పాటు చేసిన రెండు వాహనాల కేటాయింపు అయిన రెండు 2 లక్షల ఖర్చు పైన కౌన్సిల్ ఆమోదం 
* గణపవరంలో శానిటైజేషన్ ప్రక్రియ చెయ్యాలి అని తెలిపారు. కమిష్నర్ రవీద్రగారు దీని పైనా ఇప్పటి వరకు 25 లక్షలతో త్రాగు నీరు ఇబ్బందులు లేకుండా చేసాం అని. విలీన గ్రామాల విషయం కోర్టులో ఉండటం వలన కోర్టు పెర్మిషన్ తో ఇతర అభివృద్ధి పనులు చేస్తాం అని తెలిపారు .  
*  అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక భవనానికి 12.43 లక్షల తో నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి . 
* 8వ వార్డు నందు చేతి పంపు మరమ్మతులు జరగాలి అని ఆ వార్డు కౌన్సిల్ తెలిపారు. 
మిగిలిన ముఖ్య సమాచారం తరువాత పార్ట్ నందు 



























Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీబీఎన్ ఆర్మీ, పట్టాన టీడీపీ యూత్, సీనియర్ నాయకులూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ ఉపాధ్యక్షులు కరీముల్లా గారు కట్ చేసారు. 4000 కోట్ల రూపాయలతో చిలకలూరిపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చి వేసిన పుల్లారావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిలాలి అని తెలిపారు. పట్టణంలోని నిరాశ్రయులకు బిర్యానీ పంచిపెట్టారు. అలాగే బాపూజీ వృధాశ్రమం నందు బిర్యానీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, పార్టీ నాయకులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
























Share:

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు  - రావు సుబ్రహ్మణ్యం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు శనివారం మధ్యాన్నం 3 గంటల సమయం లో రజక కాలనీ నందు ఉన్న ఆరోగ్య కేంద్రం నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడారు. 240 వ్యాక్సిన్లు కేటాయిస్తే 50 మందికి మాత్రమే వేశారు. 190 వ్యాక్సిన్లు మిగిలాయి వాటిని కూడా అర్హులకు  ఉపయోగించాలి అని . వాలటరీలు స్లిప్స్ ఇచ్చిన తరువాత వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి వస్తే 84 రోజులు గడిచాకే సెకండ్ డోస్ వేస్తాం అని చెప్పటంతో వాళ్ళు వెనుతిగారు అని ఇలా ప్రజలను అనవసరంగా వ్యాక్సిన్ సెంటలకు తిప్పటం పట్ల  జిల్లా వైద్య అధికారుల పని తీరు పైనా ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు అని తెలిపారు. అలాగే కొన్ని వ్యాక్సిన్ సెంటర్లలో 2000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అని వాటిపైన ద్రుష్టి పెట్టాలి అని తెలియజేసారు . 



























Share:

చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ

 చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో నిన్న జరిగిన చోరి కేసును ఛేదించటానికి నేరుగా డిఎస్పీ విజయ భాస్కర్ గారు నేరుగా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితురాలు పుచ్చకాయల సీతారావమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీతారావమ్మ చెప్పిన దాని ప్రకారం అప్పుడప్పుడు ఆమె బీపీ, షుగర్ పరీక్షల కోసం అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అయితే వచ్చిన దొంగలు ఆరోగ్య పరీక్షలు ఏంటి వద్ద నిర్వహిస్తాము అని చెప్పి ఆమెను కట్టేసి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదుతో పారిపోయారు. అని తెలిపారు. డీఎస్పీ చుట్టుపక్కల స్థానికులతో మాట్లాడి అనంతరం త్వరలోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ తోపాటు పట్టణ, రూరల్ CI లు పాల్గొన్నారు.    







































Share:

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి  

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి పురుషుడు విలియం షేక్స్పియర్ (80) మంగళవారం నాడు కన్నుమూశారు. బ్రిటన్ దేశంలో డిసెంబర్ 8 న ఫైజర్ అనే బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అయిన చనిపోవడానికి కరోనా కాదు అని తెలుస్తుంది. కరోనా కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు అని వైద్యులు నిర్ధారించారు. 































Share:

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా 

https://chilakaluripetspeednews.blogspot.com/

మంగళవారం ఉదయం పట్టణంలోని  రాగన్నపాలెం కి చెందిన ఒక మహిళా (50) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు GGH లో జాయిన్ అయినది. సదరు మహిళా మంగళవారం సాయంత్రం నాడు మృతి చెందారు. అయితే కరోనా తగిన తర్వాత మళ్లీ ఈ కొత్త బ్లాక్ ఫంగస్ వలన కరోనా తగ్గిన వ్యక్తులలో ఆందోళన మొదలైనది. 






















































Share:

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నాలుగో లైన్ నందు కొంతమంది వ్యక్తులు ఆరోగ్య పరీక్షలకు వచ్చాము అని నమ్మబలికి తీరా ఇంటిలోకి ప్రవేశించాక ఆమెను కుర్చీలో తాళ్లతో కట్టివేసి గుడ్డలు నోటిలో కుక్కి ఆమె మేడలో ఉన్న 17 సవర్ల బంగారాన్ని, 4000 రూపాయల నగదుతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టాన CI బిలాలుద్దీన్ గారు సంఘటన స్థలానికి చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CI బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు వస్తే పట్టాన పోలీసుస్టేషన్ నందు సమాచారం అందించాలి అని తెలిపారు. 







































Share:

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో గుట్కా విక్రయించే వారి పైనా పోలీసులు పంజా విసిరారు. అర్బన్ CI బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో SI సుబ్బారావు, నరసాదాసు మరియు పోలీస్ సిబ్బంది తో పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. అయితే చలివేంద్రం బజార్ నందు ఒక షాపునందు అనుమానంతో వెతకగా వందల సంఖ్యలో నిషేధిత గుట్కా, విమల్ ప్యాకెట్స్ బయటపడ్డాయి. అయితే సదరు వ్యక్తిని విచారించగా కొంతమంది వ్యక్తులు టూ వీలర్ లో వచ్చి తమకు వీటిని MRP ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి 5,10 రూపాయల లాభంతో వీటిని అమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తిపైన కేసు నమోదు చేసి, పాకెట్స్ సీజ్ చేసి, అరెస్ట్ చేసారు.  5,10 రూపాయల లాభంకోసం ఇతరుల ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారని, పట్టణంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు

చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట గత కొన్ని రోజలుగా పట్టణంలోని చల్లగాలులకు అలవాటుపడ్డ పురప్రజలు ఈ రోజు మాత్రం ఎండ లేకపోయినా కానీ వడగాలులు మాత్రం బాగా వీచాయి. కొన్ని రోజులుగా తుపానులు, అల్పపీడనం వలన పట్టణములో మధ్యాన్నం సమయానికి చల్లటి వాతావరం, చిరుజల్లులతో  సాయంత్రానికి సేద తీరేవాళ్ళు, రాత్రి సమయాలలో హాయిగా నిద్రపోయేవారు. కానీ ఈ రోజు 41డిగ్రీల టెంపరేచర్ నమోదు అయినది. గత 20 రోజులుగా ఇంత ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. రాబోవు రెండు & మూడు రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి అని అంచనా.  


























































Share:

చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !

చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ ఎక్కడ చేస్తారో చాల మందికి తెలియక తెలిసిన 1,2 ప్రదేశాలలో క్యూ లైన్ లో నుంచొని 12 గంటలకి లాక్ డౌన్ మొదలవుతుంది కావున ఇంటికివెళ్ళి తరువాతి రోజు అదేవిధంగా జరుగుతుంది. 

అయితే మన చిలకలూరిపేట నందు 5 ఆధార్ ఎన్రొల్మెంట్ సెంటర్లు ఉన్నాయి. వాటి వివరాలు 
 1) మంజు నర్సింగ్ హోమ్, గాంధీపేట ,ఆపోజిట్  RVSCVS హైస్కూల్
 2) స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , రామకోటి బిల్డింగ్స్ , ఆపోజిట్ గ్రాండ్ వెంకటేశా 
 3) ఆంధ్ర బ్యాంకు , సుబ్బయ్యతోట ఆంజనేయ స్వామి గుడి రోడ్  
 4) BSNL ఆఫీస్ , RVSCVS హైస్కూల్ రోడ్ 
 5) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ , ఆధార్ సేవ కేంద్రం, గ్రామా సచివాలయం-1, పసుమర్రు

పైన తెలియచేయబడిన ఆధార్ కేంద్రాలలో మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవచ్చు 
























Share:

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా బాధితులకు అత్యవసర ఇంజక్షన్ గా పేరు పొందిన రెమిడీసీవర్ ఇంజక్షన్ తయారీకి మన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొల్లపూడి గ్రామము నందు ఉన్నసేఫ్ పేరేంటరల్స్ లిమిటెడ్ నందు MP శ్రీకృష్ణదేవరాయల లేఖ మేరకు అనుమతులు లభించాయి. అయితే 5లక్షల ఇంజక్షన్ తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే అంబట్టి రాంబాబుగారు, MP శ్రీకృష్ణదేవరాయలుగారు ఆయా ప్రాంతాన్ని సందర్శించి ఇంజక్షన్ తయారీ, ఇతర అంశాలపైనా చర్చించారు. 





















Share:

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా హాస్పిటల్ సదుపాయాలకు అందరూ సహకరించటం చాలా ఆనందకరమైన విషయం అని, ప్రైవేట్ వైద్య శాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ప్రభుత్వ  వైద్యం అందుతుంది అని, MP, MLA పిలుపు మేరకు ధాతల అందించిన సహకారం శుభపరిణామం అని తెలిపారు. అలాగే మౌళిక సదుపాయాలు, 4 లక్షల విలువైన మందులను అందించిన నాయుడు రమేష్ గారికి, ఆక్సిజన్ సిలిండర్ అందించిన బైరా కుటుంబ సభ్యులకు, 4 లక్షల విలువైన మాస్కలు, శానిటైజెర్లు ఇతర  వైద్య సదుపాయాలకు అవసరం అయిన వాటిని అందించిన అసిస్ట్ సంస్థకు ప్రత్యేకమైన  ధన్యవాదాలు తెలిపారు. అలాగే MLA గారి పర్యటించి ఇక్కడ రోగులకు ఉచిత భోజన సదుపాయాన్నిఎర్పాటు చేస్తాం అని చెప్పటం చాల ఆనందంగా ఉంది అని,  అలాగే డాక్టర్ భవాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ పని చేసే స్టాఫ్ డాక్టర్స్, నర్సులు, సిబ్బందికి  అభినందించారు. 
 
హాస్పిటల్ నందు శానిటైజ్ సిబ్బందిని ఎర్పాటు చెయ్యాలి అని, అలాగే RK హాస్పిటల్ నందు ఆక్సిజన్ వార్డులో పని చేసే సిబ్బందిని అక్కడ కరోనా ట్రీట్మెంట్ అనుమతులు నిలిచిపోవటం వలన వారిని ఎక్కడికి తీసుకువచ్చి ఆక్సిజన్ సప్లై ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని, పట్టణం నుండి NH 16 జాతీయ రహదారి కారణంగా ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తుంటాయి కావున ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో  శవాగారం ఎర్పాటు చేస్తున్నారు. కానీ అత్యవసరం కొరకు కొన్ని ఐస్ బాక్ససులు ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ నాయకులూ పాల్గొన్నారు 

డాక్టర్ భావాని గారు మాట్లాడుతూ మేము డాక్టర్ వృత్తిని ఎన్నికొని ఇక్కడ పని చెయ్యటం అందరికి సేవ చెయ్యటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం అని, సిబ్బంది కరోనా లెక్క చెయ్యకుండా వారికీ సేవలు అందిస్తున్నరు అని తెలిపారు 


























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.