చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--
చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు
చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు
చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి
చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు
చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు :--
చిలకలూరిపేటలోని బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని ఫజిలాతబస్సుమ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలిక రికార్డు నెలకొల్పింది . బాలికకు పిరియాడికల్ టేబుల్ లోని (ఆవర్తన పట్టిక ) మూలకాలని 1.57 నిమిషాలలో అమర్చింది. గతంలో ఈ రికార్డును పాకిస్తాన్ కి చెందిన ఒక అమ్మాయి 2.27 గా ఉన్నా రికార్డను ఇప్పుడు మన ఫజిలా రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియా బుక్ అఫ్ రికార్డు లో చోటు దక్కించుకుంది. త్వరలో గిన్నిస్ బుక్ లో దక్కనుంది.
ఆవర్తన పట్టిక |
ఫజిలా, తండ్రి రహీమ్ స్థానిక వైస్సార్సీపీ కార్యాలయం నందు MLA రజని ని కలిసి మరోసారి తన ప్రతిభని చూపించింది. అయితే ఈసారి 1. 27 నిమిషాలలో అమర్చి తన ప్రతిభ చాటుకున్నది ఈ చిన్నారి. ఈ సందర్భంగా MLA రజని మాట్లాడుతూ బాలిక ప్రతిభను కొనియాడారు. అలాగే విద్యార్థి భవిషత్ కు అన్ని విధాలుగా సహకారం అందచేస్తాం అని అన్నారు.
గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు
గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు
బ్రిటిష్ వారి కాలంలో 1907 లో నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA రజని,డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఇంచార్జి శ్రీ రంగనాథ్ రాజు గారు,సుచరితగారు, మోపి దేవి వెంకటరమణ గారు. కోన రఘుపతిగారు,నందిగం సురేష్ గారు,పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గారు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:--
జిల్లాలో కాళిగా ఉన్న 407 గ్రామ , వార్డు వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి తేదీ. ఆసక్తి కలవారు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు .
https://gswsvolunteer.apcfss.in/
పైన లింక్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోగలరు. 24న దరకాస్తు పరిశీలన. 25&26 తేదీలలో మండల పరిషత్ కార్యాలయాలలో ఇంటర్వూస్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపిక అయిన వారికి సంచారం ఇస్తారు
రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి
చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి చిన్నగా వెళ్తూ ట్రాఫిక్ జాంలో చిక్కుకునేవారు వాహనదారులు. రోడ్లు సరిగాలేక దుమ్ము ధూళితో పుర ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ కొన్ని రోజుల క్రితం మరమ్మతులు చేసిన రోడ్లు (నరసరావుపేట సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వైపు ) వలన పట్టణములో ట్రాఫిక్ కష్ఠాలు తగ్గాయి మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత :--
చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుండి సుమారు 20 kgల గంజాయి ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్షలలో ఉండవచ్చు. ఎక్కడనుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన విచారణ మొదలుపెట్టారు.
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు. షాప్ యజమాని బాల మురళీకృష్ణ స్థానిక పోలీస్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు వారు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు , విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు
సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా యడ్లపాడు గ్రామములో ఎర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ జల శక్తీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు MLA రజని గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల రక్షణ మన అందరి బాధ్యత అని , నీటి నిల్వలు పెంచాలి అని , ఇది అందరి బాధ్యత అని తెలిపారు. నీరు అనేది విశ్వ0 లో ప్రతి జీవికి అవసరం అందువలన నీటి నిల్వలను పెంచి భూగర్భ జలాలను కాపాడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA రజని గారితో పాటు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి,పీడీ శ్రీనివాసరావుగారు,జేసీ ప్రశాంతి గారు మరియు ముఖ్య నాయకులూ పాల్గొన్నారు