చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల జననం..
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి లోని నాదెండ్ల మండలం గురజవోలు గ్రామంలోని రాగివరపు సుప్రియ (20) ప్రసవ నొప్పులతో బాధపడుతూ యడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే యడ్లపాడు 108 అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకొని సుప్రియ అనే మహిళలను పరీక్షించి నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో సాతులూరు సమీపములో ఉదయము ఆరు గంటల సమయంలో సుప్రియ ప్రసవించడం జరిగింది.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. సుప్రియ కు ఇది రెండో కాన్పు,వీరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అంబులెన్స్ లో నే సుఖప్రసవం చేసినందుకు EMT: J.దుర్గారావు పైలెట్ జి రాము లకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయము తెలుసుకున్న ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ బి కోటేశ్వరరావు, జిల్లా మేనేజర్ సత్యనారాయణ యడ్లపాడు 108సిబ్బంది EMT:J.దుర్గా రావు, పైలెట్ జి. రాములను అభినందించడం జరిగింది.