మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు మొత్తం 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్రసెంటెర్ లో - 1

సుగాలి కాలనీ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2కేసులు నమోదు అయ్యాయి 

తూబాడు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట, యడ్లపాడు మండల గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

 చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడు మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

రెడ్ల బజార్ లో - 2

వేలూరు రోడ్డులో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

తుర్లపాలెం గ్రామంలో - 1

యడ్లపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట,నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. 


Share:

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

https://chilakaluripetspeednews.blogspot.com/

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో UNION BANK యొక్క పర్యవేక్షణలో  గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను 21 వ తారీఖు బుధవారం మధ్యాహ్నం  3:30 లకు  RBI రీజనల్ డైరెక్టర్ శ్రీమతి . K.నిఖిల గారు వర్చువల్ గా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో భాగంగా కందిమళ్ల హాస్పిటల్ పక్కన నూతన కార్యాలయం (CFL) (center for financial literacy) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీమతి. పైలా విజయ కుమారిగారు   ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభ సందర్బంగా  కావూరు గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాలకు 
50 లక్షల రూపాయలు ఋణాలు అందించడం జరిగింది. 
 కార్యక్రమంలో బ్యాంకు RDO హనుమంతు, బ్యాంకు ఉద్యోగులు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ కౌన్సిలర్స్ రవిరాజు, భాస్కర్ లు పాల్గొన్నారు.  


                                                                                      CFL OFFICE, చిలకలూరిపేట.  9989209814

https://chilakaluripetspeednews.blogspot.com/







 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు యంగ్ టైగర్ కుమ్మర క్రాంతి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చిలకలూరిపేట పట్టణం స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృధాశ్రమంలో కేకు కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ కట్ట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు విచ్చేసారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు సభ అధ్యక్షత వహించారు, వారు మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకొనుటకు ముఖ్య ఉద్దేశం మీ లాంటి పెద్దల దీవెనలు ఆయనకు వుండాలని, అదే విధంగా కుమ్మర క్రాంతి కుమార్ గారు గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సమస్య వుండి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వేంటనే రెస్పాండ్ అయ్యి 20నిమిషాలలో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని ఆయన పోరాట పటిమ గురించి వివరించారు 

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు మాట్లాడుతూ క్రాంతి కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్ రావు గారికి అను క్షణం అండగా వుంటు బిసిల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్నారని మాకు సమస్య ఉన్నది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యపై రెస్పాండ్ అవుతారని, ఆయన తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలు వృద్దాశ్రమంలో జరగటం ఆనంద దాయకమని ఆయన కోనియాడారు. 

నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రుపేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ అన్న జన్మదినాన్ని ఇంత మంది పెద్దవాళ్ల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మా యంగ్ టైగర్ మా అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఇలాంటి  పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, బిసిల కోసం అన్న చేస్తున్న పోరాటాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అన్నలో వున్న దూకుడుని, పోరాట పట్టిమని నేటి యువత పునికి పుచ్చుకోవాలని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిరావుపూలే చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు గారు,నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తెప్పలి కాసులు గారు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య గారు మరియు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సాంబశివానగర్ లో - 1

గుర్రాలచావిడీ లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయింది. 

నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం గ్రామంలో - 1

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


































Share:

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం.

చిలకలూరిపేట మండలం - పేకాట స్థావరం పైన దాడులు - 35 మంది అరెస్ట్ - 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని గుద్దె వారిపాలెం - అనంతవరం గ్రామ శివారులలో జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు నిర్వహించిన దాడులలో మొత్తం 35 మందిని అరెస్ట్ చెయ్యగా వారి వద్ద నుండి 13 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్న పేకాట రాయుళ్లు పారిపోవటానికి యత్నించారు. అయితే అర్బన్ పోలీసులు చాకచక్యంగా అందరిని అరెస్ట్ చేసారు.గ్రామాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 




















Share:

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి

చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట సిపిఐ ఏరియా కార్యదర్శి, రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యుడు,జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ C R మోహన్(80) గారు మంగళవారం సాయంత్రం సమయంలో అనారోగ్యంతో మరణించారు.అయన మృతి పట్ల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులూ పాల్గొని నివాళి అర్పించారు. చిలకలూరిపేట లోని జాగుపాలెం నందు ఆయన స్వగృహం నుండి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సిపిఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ,ముప్పాళ్ల నాగేశ్వరావు,జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, వై చంచయ్య, మాల్యాద్రి,చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ గారు,చిలకలూరిపేట టీడీపీ నాయకులు,వైస్సార్సీపీ నాయకులు విడదల గోపి అలాగే సిపిఐ పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శిలు పాల్గొన్నారు.   























Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్

చిలకలూరిపేట ముస్లిం సోదరులు గోవధ నిషేధిత చట్టాన్ని పాటించాలి - మునిసిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర గోవధ నిషేధం అని తెలిపారు. యానిమల్ హుస్బెండరీ యాక్ట్ 11-1977 ప్రకారం గోవధ నిషేధం అలాగే హైకోర్టు ఉత్తరువుల మేరకు 26505(23-12-2005) ప్రకారం ఆవులు,దూడలు లాంటి సమాజానికి ఉపయోగపడే జంతువులను వధించటం నేరం కనుక ముస్లిమ్ సోదరులు ప్రభుత్వ చట్టాలను గౌరవించి శాంతిని నెలకొల్పాలి అని కమిషనర్ తెలిపారు. అలాగే కరోనా ఆంక్షల నేపథ్యంలో వీలైనంత వరకు ఎవరి ఇళ్లలో వారు ప్రార్థ‌న‌లు నిర్వహించుకోవాలి అని తెలిపారు . 




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 20-07-2021 మంగళవారం నాడు మొత్తం 21 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

సుధావారిపాలెం లో - 1

పురుషోత్తమపట్నం లో - 2

గుండయ్యతోట లో - 1

బ్యాంకు కాలనీ లో - 1

పండరీపురం 7వ లైన్ లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 7 కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం  గ్రామంలో - 5

యడ్లపాడు గ్రామంలో - 1

కోట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి. 

రాజుగారిపాలెం గ్రామంలో - 5

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.  
















Share:

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డు నందు పాములు హడావిడి ఎక్కువ అయింది.వర్షాకాలం కావటంతో యార్డు చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి పాములు యార్డులోకి ప్రవేశిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కరోనా కారణంగా కూరగాయల మార్కెట్ వర్తకులను యార్డులోకి తరలించారు. అయితే తెల్లవారు జామున 3 గంటలకల్లా వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి సర్దుకొనే సమయంలో పాములు ఎక్కడ ఎక్కడ ఉంటాయో అని బయాందోనళకు గురి అవుతున్నారు వ్యాపారులు. తాజాగా 5 గంటలకు వర్తకులు షాపులు మూసివేస్తుండగా ఇంతలో సుమారు 5 అడుగుల పాము ఒక వ్యక్తిపై దాడి చెయ్యబోయింది వెంటనే స్పందించిన సదరు వ్యక్తి అందరిని పిలువగా పాముని చంపివేశారు. ఇది ఎలా జరగటం మూడవసారి. అయితే సదరు వ్యాపారులు కరోనా పేరు చెప్పి మమ్మల్ని ఊరికి దూరంగా ఉన్న ఈ యార్డులో ఉంచారు. అసలే వ్యాపారాలు లేక బ్రతుకు బండి మోయలేకపోతుంటే ఇప్పుడు ఈ పాముల వలన ప్రాణభయం ఏర్పడుతుంది అని వాపోయారు. ఇప్పటికి అయిన శాసనసభ్యురాలు మా యందు దయ ఉంచి మార్కెట్ నందు యధావిధిగా వ్యాపారాలు కొనసాగించటానికి అనుమతులు ఇవ్వండి, కొట్టు మార్చి కొట్టు లేదా రోజుకి ఒక వరుసగా కోట్లు పెట్టుకొని జనల రద్దీ లేకుండా కరోనా నియమాలు పాటిస్తూ, మార్కెట్ మొత్తానికి కరోనా గుంపులు గుంపులుగా లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటాము అని తెలిపారు. 
Share:

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్ర సెంటర్ నందు - 4 కేసులు నమోదు అయ్యాయి. 

 ఈ రోజు నుండి కరోనా ఆంక్షలు సడలింపు ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తమై కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ కరోనా తీవ్రతకు అడ్డుకట్ట వేదాం . 
























Share:

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని,ఆరు నెలలకు ఒక పోలీసు అధికారి ఎందుకు మారుతున్నారు ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల్లో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ మారారని,తాసిల్దారు కూడా ఇద్దరు మారారని ఈ విధమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ కూడా చిలకలూరిపేట ప్రజలు చూడలేదని దీనిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎమ్మార్వో సెలవ మీద వెళ్లగా నాదెండ్ల మండల తాసిల్దార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు కావలసిన ఇన్కమ్ సర్టిఫికెట్,కాస్ట్ సర్టిఫికెట్ విషయాల మీద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు.కేవలం ఎడవల్లి భూముల సమస్య పరిష్కరించడం కొరకు ఆయన తాసిల్దార్ గా వ్యవహరిస్తున్నారని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. అంతేగాని పూర్తిస్థాయి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదని ప్రజలకు అందుబాటులో లేరని ఈ విధంగా చేయటంవల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నింటిపై స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారులను మార్చిన సందర్భాలు లేవని ఆయన గుర్తు చేశారు. సమస్యలను గాలికొదిలేసి కేవలం ఆర్భాటాలు శిలాఫలకాలు ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, ఓబీసీ మోర్చా నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్, యువ నాయకులు వి వంశీ, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Share:

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


సోమవారం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మాట్లాడుతూ కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. అలాగే RTC బస్సు పని వేళలను మార్చాలని అని RTC అధికారులకు సూచించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటలకల్లా బస్సులన్నీ డిపోకు చేరేలా ప్రణాళిక చెయ్యాలి అని తెలిపారు.అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆటోలలో,ఇతర ప్రయాణాలు చేసే వాహనాలలో రద్దీ లేకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి అని తెలిపారు. 

త్వరలో ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ రానుండటంతో మసీదు ప్రదేశాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవు అని కనుక ఎవరి ఇళ్లలో వారి పండుగ జరుపుకోవాలి అని. అలాగే మసీదు సమీపంలో హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేపించాలి అని తెలిపారు. 

వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకి తీసుకువెళ్లాలి అని. వార్డులలో వాలంటీర్లు,AMNలు,ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది కరోనా చైన్ బ్రేక్ చేసే విధంగా చర్యలు చెప్పటాలి అని తెలిపారు. 



























Share:

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల సమయాలలో మార్పు చేస్తున్నట్లు ఈ రోజు సోమవారం నాడు జరిగిన టాస్క్ ఫోర్స్  కమిటీ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి అని. సాయంత్రం 5 తర్వాత నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానున్నట్లు అయన తెలిపారు. అన్ని వ్యాపార,వాణిజ్య దుకాణాలలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి అని కరోనా ప్రోటోకాల్ పాటించని వారి పైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు.యువకులు క్రీడాకారులు ఆటలు ఆడరాదు అని ఆలా ఆడేవారి పైనా కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.  





























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.