మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తున్న చక్క దుంగల లోడుతో వెళ్తున్న లారీ కారుని NRT సెంటర్లో ఢీ కొన్నది. ఈ సమయంలో కారులో వారికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చెయ్యటం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు నరసరావుపేట వైపు నుండి రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/



















































Share:

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే  MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు. 

మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  



































Share:

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంల,మండల గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 06-07-2021 మంగళవారం నుండి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి అని కరోనా నియమాలు పాటించనివారి పైనా కఠిన చర్యలు తప్పవు అని ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు తెలిపారు.సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా తీవ్రత తగ్గించటానికి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నియమాలు కఠినంగా అమలు చేయాలి అని కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్ర,నోడల్ డాక్టర్ గోపీనాయక్, SI నరసాదాసు,ఎంపీడీఓ హేమలతా దేవి, శివ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.  
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట లో - 1

బొందిలిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 4

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట మండల గ్రామాలలో గాని, యడ్లపాడు మండలంలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

మన్యం దొర అల్లూరి సీతారామరాజు & వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సెంటర్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు పట్టణ నాయకులు.బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన అల్లూరి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పారు. ఆనాడు అల్లూరి లాంటి వారి చేసిన ప్రాణ త్యాగాలకు ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని తెలిపారు.అలాగే వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అయన చేసిన చర్యలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

శ్రీ అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య గారు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం గారు అల్లూరికి కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి తన్నీరు రామారావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ వంకాయలపాటి వంశీ మరియు ఇతర పార్టీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహ వ్యవస్థాపకులు వేగేశ్న అంజి రాజు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొని నివాళులర్పించారు. 






































Share:

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆదివారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైస్సార్సీపీ పట్టణంలో చేస్తున్న చర్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటీ ఆస్తులను బ్యాంకులకు తాకట్టుపెట్టాన్ని వైస్సార్సీపీ చేతకాని తనంగా అభివర్ణించారు. అలాగే గాంధీ పార్కు మరియు పార్కు బయటఉన్న మునిసిపల్ కాంప్లెక్స్ లను తాకట్టు పెట్టటం సిగ్గు చేటు అని తెలిపారు. పార్క్ మరియు కంప్లెక్సలను బ్యాంకులో 50 కోట్లకి తాకట్టు పెడదాం అని అడిగితే దానికి సదరు బ్యాంకు అధికారులు వ్యాల్యూవేషన్ వేసి 30 కోట్లు మాత్రమే ఇస్తాము అని తెలపగా 30 కోట్ల రూపాయలకి తాకట్టు మాకు సమ్మతమే అని తెలిపారు అని విశ్వసనీయత సమాచారం అని తెలిపారు.పట్టణంలో ఎంత మంది MLA , మినిస్టర్ అయిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించారు కానీ ఇలా  ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు.మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాని చెట్టు క్రింద నిర్వహించామని అన్నారు. అలా మునిస్పల్ ఆస్తులన్నీ అమ్మిన తరువాత మనుషులను కూడా తాకట్టు పెట్టండి అని అన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తూ ఇలా మునిసిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎలాంటి కార్యకలాపాలన్నీ విరమించుకోవాలి. లేదు అంటే ఉద్యమం చేసి ఆస్తులను కాపాడుకుంటాం అని తెలిపారు.ఈ సమావేశంలో 8 మంది టీడీపీ కౌన్సిలర్లు,టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.    



























Share:

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

సుబ్భయతోట లో - 1

జాకిర్ హుస్సేన్ వీధి లో - 3

గుర్రాల చావిడి లో - 3 గా నమోదు అయ్యాయి. 




























Share:

చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ

చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగింది.వివరాలలోకి వెళ్తే పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు మణికంఠ ట్రేడర్స్ అనే బియ్యం మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావు అనే వ్యక్తి తన మిల్లు ఎదురుగా ఉండే బియ్యం స్టోర్ చేసుకునే గౌడాన్ నందు రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు 11లక్షల 50 వేల రూపాయలను బీరువాలో దాచాడు.అయితే రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు డబ్బులు కోసం అని ఆదివారం నాడు గౌడాన్ తెరవగా అందులో బీరువా పగలగొట్టి అందులోని కొంత డబ్బులు క్రింద ఉండటాన్ని గమనించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన CI,SI లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌడాన్ వెనుక వెంటిలేషన్ తొలగించి అందులోకి ప్రవేశించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు పరిశీలిస్తునట్లు తెలిపారు. పోలీస్ అధికారులు. 
























Share:

పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య

పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో పలు చేపల విక్రయ వ్యాపారుల పైనా దాడులు నిర్వహించారు అధికారులు.తూనికల,కొలమానాల అధికారులు పట్టణంలో చేపల అమ్మకాల కొలతలతో తేడాలు జరుగుతున్నట్లు చాల ఫిర్యాదులు అందాయి అని అందుకే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.కొలతలతో అవినీతి పాల్పడేవారి పైనా కేసులు నమోదు చేసారు. 5గురి పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తాం అని ముద్రలు లేని ఎలక్ట్రిక్ కటాలను వినియోగిస్తే వారిపైన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ దాడులలో కొలతలు, తూనికల శాకాధికారి అల్లూరయ్య ఇతర సిబ్బంది పాల్గిన్నారు . 



























Share:

చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది.మండల పరిధిలోని కావూరు గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావూరు గ్రామానికి చెందిన బైక్,కారు ఢీ కొట్టటం వలన బైక్ పైన వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు స్వల్పంగా దెబ్బతినగా. ద్విచక్ర వాహనదారులు మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న 108 సిబంది అక్కడికి చేసుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 
























Share:

చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు

చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా తీవ్రతను తగ్గించాలి అని సూచించారు. ఇప్పటికే యడ్లపాడు మండలంలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉండగా కరోనా విస్తృతి పెరుగుతున్న రీత్యా మరో 4 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామం, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు గా ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ జ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరంగా బయటకు రావాలి అని తెలిపారు. ప్రజలందరు సహకరించాలి అని కోరారు. అలాగే కరోనా నియమాలు పాటించని వారిపైన ఖఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు. 
























Share:

చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

చంద్రవరం గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 1

చిరుమామిళ్ల గ్రామంలో - 2

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

సాతులూరు గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

తిమ్మాపురం గ్రామంలో - 1 గా నమోదు అయింది. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 





























Share:

చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. 
 
తూర్పుమలపల్లి లో - 1

విశ్వబ్రాహ్మణ కాలనీ లో - 1

శివాలయం వీధి లో - 1 గా నమోదు అయ్యాయి. 

Use MASK & Sanitizers and keep Social-Distance 





























Share:

చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణానికి శుక్రవారం రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పట్టణానికి విచ్చేసారు. ముందుగా పొట్టిశ్రీరాములు కాంప్లెక్స్ వద్ద బీసీ సంఘ నాయకులూ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంఘాలు మొత్తం ఏకమై మన హక్కులను మనం కాపాడుకోవాలి అని తెలిపారు. అలాగే చిలకలూరిపేటలో అనుకోకుండా రావలసి వచ్చిన అప్పటికి అప్పుడు ఎంత మంది రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. అలాగే ఎప్పుడు అయిన ఉద్యమానికి పిలుపునిస్తే పట్టణాన్ని స్థంబింప చేసేంతగా ఆక్టివ్ గా ఉన్నారు మీరు అందరూ అని అన్నారు.బీసీ సంఘ నాయకులు,కూరగాయల మార్కెట్ కమిటీ ఆయనకు సన్మానం చేసారు. 

అనంతరం వైస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి బీసీ లకు పూర్తి న్యాయం చేస్తున్నారు అని.దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వం సొంతం అని తెలియజేసారు.రేపు జగన్ క్యాబినెట్ విస్తరణలో MLA రజిని గారికి మినిస్టర్ ఇస్తే రాష్ట్రం లోనే కాదు దేశంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తారు అని తెలిపారు.రజిని మేడంకు ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా చాల ఫాలోయింగ్ ఉంది, చాల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అని కొనియాడారు. 

వీడియో :- 




































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.