మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 10-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 10-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 10-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో

 పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. పట్టణంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అలాగే ఈ రోజు అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు  

చిలకలూరిపేట మండల గ్రామంలో ఈ రోజు 7 కేసులు నమోదు అయ్యాయి. 

కావూరు గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

తాతపూడి గ్రామంలో - 2

పసుమర్రు గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట - మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు - జులై 8 నుండి యూజర్ చార్జీల వసూళ్లు

చిలకలూరిపేట - మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు - జులై 8 నుండి యూజర్ చార్జీల వసూళ్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

CLAP ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా తీసుకోనున్నారు, వాటికీ సంబంధించి ప్రతి ఇంటికి 3 చెత్తబుట్టలను ఇవ్వనున్నారు, ఈ కార్య కార్య క్రమాన్ని  అంతటిని సీఎం జగన్ చేతుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జులై 8 నుండి మొదలు కానున్నది. ప్రతి ఇంటి నుండి చెత్తను ఆంధ్ర కార్పొరేషన్ వారు అందజేసే ఆటోల ద్వారా చేతను సేకరించి అక్కడి నుండి గార్బేజీ స్టేషన్ కి తరలించనునట్లు తెలిపారు. దీని పైన ప్రజలకు అవగాహనా కలిపించాలి అని శానిటరీ అధికారులు, సిబ్బందిని పిలిపించి ఈ రోజు అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. అలాగే ప్రతి ఇంటి నుండి యూజర్ చార్జీలు వాసులు చెయ్యాలి అని వాటిపైన ప్రజలకు అవగాహనా కలిపించాలి అని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది ముందస్తుగా వాహనాల రూట్ మ్యాప్, ఇంకా ఏమైనా మౌళిక అంశాలను తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు.

Share:

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో సినీ నటుడు,హిందుపూర్ MLA  బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవతారకరామ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ కేకును మాజీ మునిసిపల్ ఛైర్మెన్ అయిన గంజి చంచు కుమారి గారితో కట్ చేసి నిరుపేదలకు 100 మందికి ఆహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పండు శ్రీను, కంచర్ల వెంకటేష్, గంజి మోహన్, గాలం కోటి, మద్దిబోయిన శివ, పేరయ్య, గోపిదేశి వెంకటేష్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

అలాగే పట్టాన టీడీపీ ఆఫీస్ నందు కూడా తెలుగు యువత నాయకులూ ఏలూరి నాగేశ్వరరావు గారు భారీ కేక్ ఎర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా RK హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసారు. 
 ఈ రోజే జిల్లా SC  నాయకులు ఇనగంటి జగదీష్ గారి పుట్టిన రోజు కూడా కలిసి రావటంతో అయన కూడా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు గారు, మల్లి బాబు గారు, పిల్లి కోటి గారు, అజారుద్దీన్ గారు, రవి గారు, అబ్దుల్ బాషా, శ్రీన, హరి బాబు, వేణు తదితరులు టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత,  పాల్గొన్నారు. 

Share:

10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

10-06-2021, గురువారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి అయిన యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 12 కేసులు నమోదు కరోనా అయ్యాయి 

యడ్లపాడు మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కొత్తపాలెం గ్రామంలో - 1

యడ్లపాడు గ్రామంలో - 1

సొలస గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి 

నాదెండ్ల గ్రామంలో - 5

గణపవరం గ్రామంలో - 2

కనపర్రు గ్రామంలో - 1

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్ 

https://chilakaluripetspeednews.blogspot.com/2021/06/27.html

చిలకలూరిపేట పట్టణంలోని 27 వార్డు కి చెందిన లేడీ వాలంటరీ నిర్వాకం బయట పడింది. ప్రభుత్వ పధకాలు నేరుగా ప్రజలకు చేరువ చెయ్యవలసిన వాలంటరీ పధకాలు రావాలి అంటే ముందు గా తమకు  డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ లంచగొండ్లు నుండి ప్రజలను కాపాడటానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నది. అలాంటిది ఫై వీడియో చూస్తే వాలంటరీ తీరు పైన అక్కడ ఉన్న లబ్దిదారుల కుటుంబం బిత్తర పోయింది. 

ఛైర్మెన్ రఫాని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఆయా వాలంటరీ ని విధుల నుండి తప్పిస్తునట్లు తెలిపారు. అయితే ప్రజలు మాత్రం ఆ వీడియో లో  చెప్పునట్లు గా ఆ ఫై అధికారులు ఎవరో వారిని కూడా విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.  

Share:

చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు ద్వారా వచ్చే డబ్బులతో కొంత కమిషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది అని రఫాని తెలిపారు అలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కమిష్నర్ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలి అని రఫాని గారు తెలిపారు.  అలాగే అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సీఎం జగన్ గారు ప్రవేశపెడుతున్న పధకాలు ఏవి అయినా ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెలించాలిసిన అవసరం లేదు అని తెలిపారు. ఈ సమయంలో రఫాని గారితో పటు పట్టణ అధ్యక్షుడు తలహ ఖాన్ , మరియు దేవినేని శంకర్, కాట్రగడ్డ మస్తాన్ రావు గారు, గొంటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 09-06-2021, బుధవారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 09-06-2021, బుధవారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 

యడ్లపాడు మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

సొలస గ్రామంలో - 1

కొత్తపాలెం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

ఎండుగుంపాలెం గ్రామంలో - 3

అప్పాపురం గ్రామంలో - 3

నాదెండ్ల గ్రామంలో - 6

తూబాడు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

భావనారుషి నగర్ లో - 1

ఆర్టీసీ కాలనీ లో - 1

పద్మసాలిపేట లో - 1 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

మిట్టపల్లి గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో  - 2

బొప్పూడి గ్రామంలో  - 2

యడవల్లి గ్రామంలో  - 4

వేలూరు గ్రామంలో  - 5

పోతవరం గ్రామంలో  - 1 గా నమోదు అయ్యాయి 

Share:

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో వైయస్ జగన్ వైయస్సార్ బీమా పధకంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుంటుంబంలోని వ్యక్తి ( 18 నుండి 50 వయసు లోపు ) సహజంగా మరణిస్తే 1 లక్ష రూపాయలు, అలాగే 18 నుండి 70 వయసు లోపు వారు ప్రమాదం వలన చనిపోతే 5 లక్షలు అందించాలి అని తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న కుంటుంబానికి  నెలలోగా పరిహారం అందించాలి అని తెలిపారు. జులై 1 వ తరుకు నుండి ఈ వైయస్సార్ బీమా పధకానికి మార్పు చేసి అమలు చెయ్యాలి అని సూచించారు. 

Share:

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

జగనన్న తోడు అనే పధకం క్రింద ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు,చేతి వృత్తి కళాకారులకు 10 వేలరూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు వారి ఖాతా లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకానికి అర్హులు అయి ఉండి పేర్లు నమోదు చేసుకొని వారు గ్రామ,వార్డు వాలంటీర్లను సంప్రదించండి. వారి ద్వారా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోండి. 3 నెలలో పరిశీలించి రుణాలు అందిస్తారు. మరిన్ని వివరాలకు 08912890525, 1902 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. 

జగనన్న తోడు పధకానికి వీరు మాత్రమే అర్హులు 

* చేనేత, ఇత్తడి పని చేసేవారు. 

* కొండపల్లి బొమ్మలు తయారు చేసే వారు, కలంకారీ , తోలుబొమ్మలు, కుమ్మరి , బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక , ఇతర చేతి వృత్తుల వారు 

* తోపుడు బండ్ల పైన కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్ధాలు అమ్మేవారు 

* గంపలలో, బుట్టలలో వస్తువులు అమ్మే వారు, 

* సైకిళ్ళు, ఆటోలలో , బైకుల పై వ్యాపారం చేసుకునే వారు

* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కలిక షాపులు ఉండేవారు 
అర్హులు 
   
Share:

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కబళిస్తున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఓకేంత ఊరటనిచ్చినా , సామాన్యుల నడ్డి మాత్రం  విరక్కొట్టటం తప్పేలా లేదు. లీటర్ 75 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు 102 రూపాయలు అంటే సుమారు 27 రూపాయల బాదుడు. అంటే వారానికి సుమారు 4 సార్లు పెట్రోల్ కొట్టించినా సుమారు 100 రూపాయలు ప్రతి సామాన్యుడి నుండి వసూళ్లు చేస్తున్నట్లు. ఈ బాదుడు కన్నా వ్యాక్సిన్ ధర డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలినా 1000 రూపాయలు  అనుకుందాం. ఆ లెక్కన సామాన్యుడి జేబు చిల్లు పడుతున్న విషయం అర్ధం కావటం లేదు. ఫ్రీ సోర్స్ కి అలవాటుపడ్డ ప్రజలు వెనక జరుగుతున్నా పరిణామాల గురించి ఆలోచించటం లేదు. 

ప్రైవేట్ హాస్పిటళ్ళకు 25% వ్యాక్సిన్ ఇవ్వాలి అని మోడీ గారి నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఉంది అసలు కధ చచ్చిన వారిపైన డబ్బులు ఏరుకునే ప్రైవేట్ వైద్యశాలల చేతిలో వ్యాక్సిన్ పెడితే బ్లాక్ మార్కెట్ దందా మాములుగా కొనసాగదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రెమిడీసీవర్ అనే ఇంజక్షన్ 2000 ఉంటే వాటి అన్నిటిని హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో 40000( నలబై వేలు ) కు అమ్ముకున్న దాఖలాలు కోకొల్లలు.  అలాగే మంచి బ్రాండెడ్ వ్యాక్సీలకు రెక్కలొచ్చే టైం త్వరలోనే ఉంది. 
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కేవలం ఆయిల్ రేట్లు పెరిగినట్లు కాదు. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి , నిత్యావసరాల సరుకుల రవాణా పెరిగిపోయాయి, నిత్యావసరాల సరుకులకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతాయి. అప్పుడు సామాన్యుడు ఆకులూ అలమలు తిని బ్రతకాలి. 

Share:

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో భారీగా దొరికిన గుట్కా నిల్వలు- వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం గ్రామము నందు నిషేదిత గుట్కా అమ్మే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిలకలూరిపేట నుండి ఈ గుట్కా, పాన్ పరాగ్ సప్లై వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిఘా వేసి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం దగ్గిరలోని 3 గోడోన్లలలో  గుట్కా నిల్వల పైన ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అక్కడ దొరికిన గుట్కా నిల్వలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీగా నిల్వ ఉంచిన 3 గోడోన్లను తనిఖీ చేసి అందులోని గుట్కా నిల్వలను రెండు లారీలలో వేటపాలెం తరలించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. వేటపాలెం CI రోశయ్య, SI కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టాన వాసులకు 2021-2022 సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించి ఆస్థి పన్ను చెలింపు పైన ఈ నెల చివరి వరకు వడ్డీ లేకుండా రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. పన్ను కట్టవలసినవారు ఆన్లైన్ ద్వారా కానీ మునిసిపాలిటీ కార్యాలయంలో, వార్డు సచివాలయాలలో ద్వారా కానీ చెల్లించవచ్చు. ఈ నెల చివరికల్లా కట్టకపోయిన జులై నెల నుండి 2% వడ్డీ తో కట్టవలసి వస్తుంది అని తెలిపారు.  

Share:

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 17  కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

తూర్పుమాలపల్లి లో - 1

గాంధీపేట లో - 1

 పండరీపురంలో - 1

సాంబశివనాగర్ లో -1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

మిట్టపాలెం గ్రామంలో  -  1

బొప్పూడి గ్రామంలో  - 1

యడవల్లి గ్రామంలో - 1

కావూరు గ్రామంలో - 5

మద్దిరాల గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.