మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే 

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ  ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ 

అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో  వైరస్ వ్యాప్తి చెందకుండా  ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP -  మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ -  కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




























 
Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!

చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు 











































Share:

తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.

తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని  AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన  దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు.  విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 


















Share:

ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు

ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు 20 కొవిడ్ బెడ్లు మాత్రమే ఉండేవి. 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం  ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆకస్మిక పర్యటన చేసి హాస్పిటల్ వసతుల పైన దృష్టి పెట్టాలి అని తెలియజేశారు. అయితే ఎంపీ గారి చొరవతో 20 బెడ్లను 30 కి పెంచాలి అని అధికారులకు లేఖ రాయటం జరిగింది. అయితే ఆయా లేఖ పైన స్పందిస్తూ జిల్లా అధికారులు 10 బెడ్లు అదనంగా ఎర్పాటు చేసారు. దీనితో పట్టణములోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం 30 బెడ్లు ఉన్నవి. ఇక పైన 30 మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం నిర్వహిస్తారు 






Share:

నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు

నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు  

https://chilakaluripetspeednews.blogspot.com/

రెమిడీసివిర్ ఈ పేరు ఈ మధ్య కాలంగా బాగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఇక కరోనా వలన  హాస్పిటల్ కి వెళ్లి  అక్కడి నుండి  నుండి కోలుకున్న వాళ్లకు అయితే ఇది ఒక అమృతం లాగా  ఫీల్  అవుతారు. ఎందుకు అంటే కరోనా వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికీ కూడా ఈ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత త్వరగా కోలుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందువలన దీని రేటు కూడా 2500 అమ్మవలసిన ఒక్క ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్లో 40,000 కొనుకున్న వారు కూడా ఉన్నారు. 
అయితే నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు  MP శ్రీ కృష్ణ దేవరాయలు గారు.  నరసరావుపేటలో గుంటూరు రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే  మందులు తయారీ కంపెనీకు రెమిడీసీవర్ తయారు చేయటానికి కావలిసిన సదుపాయాలు ఉన్నవి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి అత్యవసర అనుమతులు కోరుతూ లేఖ రాసారు. రెమిడీసీవర్ అనుమతులు ఇస్తే ప్రతి రోజు 60,000 ఇంజక్షన్ తాయారు చేయగలమని. దాని వలన కొంచం అయినా కొరత తగ్గించవచ్చు అని లేఖ లో పేర్కొన్నారు నరసరావుపేట MP లావు శ్రీ కృష్ణ దేవరాయలు . 


https://chilakaluripetspeednews.blogspot.com/





https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట - మా పరిస్థితి ఏంటి !!!

చిలకలూరిపేట -  మా పరిస్థితి ఏంటి !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో 1858 మందికి వ్యాక్సిన్ రెండవ డోసు వెయ్యాలి, ఈ రెండు రోజులు వారికీ మాత్రమే వ్యాక్సినేషన్ అన్నారు. రెండవ డోసు సమయానికి వెయ్యకపోతే వృధా అవుతుంది కాబట్టి వారికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా బాగుంది. కానీ ఇప్పటి వరకు గవెర్నమెంట్ ప్రజా వైద్యశాలలలో 1858 మంది మొదటి డోసు వేపించుకున్నారు. వారి వివరాలు సిద్ధం చేసి రెండవ డోసు రెడీ అవుతున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటలలో మొదటి డోసు వ్యాక్సిన్ వేపించుకున్న వారి పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇప్పటికే పట్టంలో కోవిడ్ ఆసుపత్రులకు అనుమతి పొందిన వాటిలలో చాలా మంది మొదటి డోసు తీసుకున్నారు. అయితే ప్రజా వైద్యశాలలో మాత్రమే మొదటి డోసు తీసుకున్న వారికీ మాత్రమే రెండవ డోసు వేస్తున్నారు. మేము కూడా వ్యాక్సిన్ తీసుకొని 4 వారలు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ దగిరకు వెళ్లి సెకండ్ డోసు అని అడిగేతే ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ ఇవ్వటం లేదు అని సమాధానం వస్తుంది.  సెకండ్ డోసు లేట్ అయితే మళ్లీ మొదటి డోసు తీసుకోవలసి వస్తుంది అని మా పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
అధికారులు వీరి పైన కూడా ద్రుష్టి పెట్టి రెండవ డోసు కి అవకాశం కలిపించాలి అని కోరుకుంటున్నారు. 













































Share:

చిలకలూరిపేట ఈ రోజు రేపు వ్యాక్సిన్ - రెండో డోసు వారికే అనుమతి - ఈ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది

చిలకలూరిపేట ఈ రోజు రేపు వ్యాక్సిన్ - రెండో డోసు వారికే అనుమతి - ఈ ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మొదటిలో వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని రూమర్స్ నమ్మిన ప్రజలు ఇప్పుడు ప్రాణ భయంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టి హాస్పిటల్స్ బాట పట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్నపటికీ. మొదటి డోసు వేపించుకున్న వారికీ రెండో డోసు వేపించుకునే సమయం దగిర పడిన సందర్భంలో చిలకలూరిపేట నోడల్ డాక్టర్ గోపి నాయక్ గారు పట్టంలో రెండవ డోసు అర్హుల జాబితా రెడీ చేసారు. 1858 మందికి రెండవ డోసు వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఈ రోజు రేపు అనగా మంగళవారం & బుధవారం నాడు రెండవ డోసు వారికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలి అని తరువాత నుండి మొదటి డోసులు ప్రక్రియ మొదలిపెట్టాలి అని సూచించారు. 
అయితే చిలకలూరిపేట B R I G ( భారత రత్న ఇందిరా గాంధీ ) మున్సిపల్ హైస్కూల్ నందు శాశ్వత వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. చిలకలూరిపేట రురల్ ప్రజలకు కావూరు, యడ్లపాడు మండలాలలో లూధరన్ హైస్కూల్ నందు, నాదెండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శాశ్వత వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుకానున్నది. 
వ్యాక్సిన్కి గాను ప్రభుత్వం టోకెన్ విధానాన్ని అనుసరించనున్నది. గ్రీన్ కలర్ టోకెన్ 60 సంవత్సరాల వారికీ. రెడ్ కలర్ టోకెన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, బ్లూ కలర్ టోకెన్ 45 సంవత్సరాల వారికీ అందజేస్తాం అని తెలిపారు. 
వ్యాక్సిన్లు మంగళవారం మధ్యానానికి రావచ్చు అంచనా. సచివాలయ సిబ్బంది వ్యాక్సిన్ టోకెన్లను అందజేసి ఆయా టైం లో వ్యాక్సిన్ ఉంటుంది అని తెలియజేస్తారు. వార్డు వాలంటరీల ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు 
































Share:

చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు

చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలోని RK మల్టి స్పెషాలిటీ హాస్పిటల్కు  సోమవారం నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా రోగులకు వైద్య సేవలు నిలిపివేశారు. కానీ అక్కడ ఉన్న కరోనా రోగులకు ఒక వింత అనుభవం ఎదురైనది. కలెక్టర్ ఆదేశాలతో కరోనా వైద్య సేవలు నిలిచిపోయిన స్థానిక తసీల్ధార్ ఇన్సిడెంట్ కమాండర్ సుజాతగారు కొత్త రోగులను చేర్చుకోకుండా ఇప్పుడు ఉన్న రోగుల వరకు  చికిత్స్ అందించాలి అని తెలిపారు. అయితే సేవలు నిలిచిపోయిన సంధర్భంగా మా హాస్పిటల్కు ఆక్సిజెన్ సీలిండర్లు రావు అని మిరే సీలిండర్లు తెచ్చుకోవాలి అని అక్కడ సిబ్బంది తెలపటంతో కరోనా రోగులు ఒక్కసారిగా  ఖంగు తిన్నారు.  
పట్టంలో ఆక్సిజన్ సిలిండర్  ఇచ్చే సదరు ఏజెన్సీ దగిర ఆక్సిజన్ నిల్వలు ఐపోయ్యాయి అని. ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ సీలిండర్లు అయిపోతే పరిస్థితి ఏంటి అని రోగుల కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. 



































Share:

చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు

 చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

మన చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మైలవరపు కృష్ణ తేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించినది. గతంలో కేరళ వరదల సమయంలో వరద ముంపు ప్రాంతాల నుండి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కాపాడి సమర్ధవంతంగా తన కార్యనిర్వహణను నిర్వహించారు అదే అనుభవంతో కరోనా నుండి ప్రజలను కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ప్రభుత్వం ఒక కమిటీ ఎర్పాటు చేసింది. ఆయా కమిటీ బాధ్యతలను మన IAS కి అప్పగించారు.  
























Share:

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివిగా నిర్ధారణ అయినది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి అన్ని షూటింగ్స్ పోస్టుపోన్ చేసారు. "నేను బాగానే ఉన్నాను, నాతో పాటు కుటుంబము అంతా హోమ్ ఐసొలేషన్లో ఉన్నాము . డాక్టర్ పర్యవేక్షణలో అందరం జాగ్రత్తగా ఉన్నాము, కొన్ని రోజులుగా తనతో కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేపించుకొని జాగ్రత్తలు తీసుకోండి "అని తెలియజేసారు.



https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్

 చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవలు నిలిపివెయ్యాలి అని కలెకర్ట్ నోటీసు రిలీజ్ చేసారు . చాలా రోజుల నుండి ఈ హాస్పిటల్  నందు కరోనా రోగుల & బంధువుల నుండి  అనేక ఆరోపణలు ఎదురుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తెలుసుకున్నారు. రెమిడీరెసీవర్ , కరోనా రోగుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చెయ్యటం వంటి ఆరోపణలు ఎదురుకుంటున్నారు. హాస్పిటల్లోని కరోనా రోగులను వేరే హాస్పిటల్లోకి మార్చాలి అని కలెక్టర్ వివేక్ యాదవ్  పేర్కొన్నారు. 






















Share:

ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు

ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా సెకండ్ వేవ్ ఎవరిని వదలటం లేదు. తాజాగా తెలుగు సినిమా జర్నలిస్ట, నటుడు TNR ( తుమ్మల నరసింహ రెడ్డి ) ఈ రోజు కరొనతో మృతి చెందారు. ఫ్రాంక్లి స్పీక్ విత్ TNR  అనే పేరుతో చాలా మంది తెలుగు సినీ,రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూ చేసి మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఎర్పాటు చేసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కరోనా సోకింది అని కానీ దానికి భయపడవలసిన అవసరం లేదు అని దైర్యంగా ఎదురుకోవాలి అని ఒక వీడియో పోస్ట్ చేసారు. కానీ ఇంతలో కరోనా అతనిని కబళించివేసింది. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దీక్బ్రాంతి వ్యక్తం చేసారు. హీరో నాని, డైరెక్టర్ మారుతీ ,బాబీ సంతాపం తెలియచేసారు. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చి జర్నలిస్ట్ గా , నటుడిగా స్థానం సంపాదించుకున్నారు. త్వరలో డైరెక్టర్ ఆఫర్ వచ్చింది అని తెలిపారు. ఇంతలోనే అయన మరణ వార్త అభిమానులను కలచివేసింది.  

























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.