మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--


https://chilakaluripetspeednews.blogspot.com/

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ  మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షడు అయిన శ్రీ కొనకళ్ల విద్యాధరావు లేఖ విడుదల చేసారు. కనుక దుకాణాలు&వ్యాపార సంస్థలు మూసివేసి భారత్ బంద్ కి సహకరించవల్సినదిగా కోరుతున్నారు.  ఇప్పటికే టీడీపీ , వైస్సార్సీపీ,కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. 








Share:

దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 దేశంలో రెండవరోజు కూడా  స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో వరుసగా రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు. ఈ రోజు పెట్రోల్ పైన 21పైసలు , డిజిల్ పైన 20 పైసలు తగ్గినది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అక్కడ అక్కడ  లాక్ డౌన్  , బ్రెజిల్ లో కరోనా బీభత్సము, ప్రపంచంలో కరోనా, స్ట్రైన్, తాకిడి వలన వాహనం వినియోగం తగ్గటం  మరియు  దేశంలో 5 రాష్ట్రాలలో  ఎలక్షన్ వంటి ప్రభావాలు పెట్రోల్ రెట్లపైన పడ్డాయి అనే చెప్పొచ్చు. గత 4 వారాల నుండి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. 







Share:

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో  రహదారి పక్కనే ఉన్న  సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 




 

Share:

చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు

 చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--

https://chilakaluripetspeednews.blogspot.com/
 
నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI  సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రురల్ SI రాంబాబు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాని గారు, కళాశాల ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున విధ్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలూ కావద్దు అని , వాటివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియచేసారు. అయితే నిన్న పట్టుబడ్డ గంజాయి అమ్మే వ్యక్తి నుండి రాబట్టిన సమాచారం మేరకు విద్యార్థులు ఈ మత్తు పధార్ధాలకి దూరంగా ఉంచటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం పట్ల CHILAKALURIPET SPEED NEWS తరుపున పోలీస్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 





Share:

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు  

https://chilakaluripetspeednews.blogspot.com/


గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చిలకలూరిపేటలో నూతనముగా ఎన్నుకోబడిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవుల అనంతరం బుధవారం ఉదయం ఆయా సేఖలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఛైర్మెన్ గా షేక్ రఫాని గారు మరియు వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యకరంలో MLA  రజని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బోలేదు చిన్నగారు , పట్టణ వైస్సార్సీపీ బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, ముస్లిం నాయకులూ, మతపెద్దలు, వైస్సార్సీపీ నాయకులూ పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 




Share:

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ఓగేరు వాగు సమీపంలో జాతీయ రహదారి పైనా ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న టాటా ఏసీ వాహనం వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరావు అనే వ్యక్తి ఓగేరు వాగు సమీపంలోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్లి ఇంటికి  వచ్చేటప్పుడు డివైడర్ దాటుతూ రోడ్ అవతలవైపుకి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న టాటా మినీ ఏసీ  వాహనం ఢీ కొన్నది. స్థానికుల సంచారంతో అక్కడికి వచ్చిన 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  అనంతరం ఆయనని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో కనుమూశాడు. 






Share:

చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు

 చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలోని బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని ఫజిలాతబస్సుమ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలిక  రికార్డు నెలకొల్పింది . బాలికకు పిరియాడికల్ టేబుల్ లోని   (ఆవర్తన పట్టిక ) మూలకాలని  1.57 నిమిషాలలో అమర్చింది. గతంలో ఈ రికార్డును పాకిస్తాన్ కి చెందిన ఒక అమ్మాయి 2.27 గా  ఉన్నా రికార్డను ఇప్పుడు మన ఫజిలా రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియా బుక్ అఫ్ రికార్డు లో చోటు దక్కించుకుంది. త్వరలో గిన్నిస్ బుక్ లో దక్కనుంది. 


https://chilakaluripetspeednews.blogspot.com/
ఆవర్తన పట్టిక 

ఫజిలా, తండ్రి రహీమ్ స్థానిక వైస్సార్సీపీ కార్యాలయం నందు MLA రజని ని కలిసి మరోసారి తన ప్రతిభని చూపించింది. అయితే ఈసారి 1. 27 నిమిషాలలో అమర్చి తన ప్రతిభ చాటుకున్నది ఈ చిన్నారి. ఈ సందర్భంగా MLA  రజని మాట్లాడుతూ బాలిక ప్రతిభను కొనియాడారు. అలాగే విద్యార్థి భవిషత్ కు  అన్ని విధాలుగా సహకారం అందచేస్తాం అని అన్నారు.  





Share:

గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు

 గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు 


https://chilakaluripetspeednews.blogspot.com/

బ్రిటిష్ వారి కాలంలో 1907 లో  నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP  కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు  పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA రజని,డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఇంచార్జి శ్రీ రంగనాథ్ రాజు గారు,సుచరితగారు, మోపి దేవి వెంకటరమణ గారు. కోన రఘుపతిగారు,నందిగం సురేష్ గారు,పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గారు పాల్గొన్నారు. 




Share:

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:--

https://chilakaluripetspeednews.blogspot.com/

జిల్లాలో కాళిగా ఉన్న 407 గ్రామ , వార్డు వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి తేదీ. ఆసక్తి కలవారు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు . 

https://gswsvolunteer.apcfss.in/

పైన లింక్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోగలరు. 24న దరకాస్తు పరిశీలన. 25&26 తేదీలలో మండల పరిషత్ కార్యాలయాలలో ఇంటర్వూస్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపిక అయిన వారికి సంచారం ఇస్తారు


Share:

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి :--


https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ విద్యాశాఖ మంత్రి అయినా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీలు తప్ప మిగతా అన్నింటిని తాత్కాలికంగా మూసివేస్తునట్లు తెలిపారు. ఆన్లైన్ క్లాసులు యధావిధిగా జరుగుతాయి అని చెప్పారు 


Share:

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ఎక్క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా  గంజాయి అమ్మేవారిని ప్రీ ప్లాన్డ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామములో కోటేశ్వరరావు అనే వ్యక్తిని ఎక్క్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తికి సప్లై ఎక్కడనుండి వస్తుందో ఆరాతీసారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెకు చెందిన మస్తాన్ రావు అనే వ్యక్తి దగ్గిర నుండి గంజాయి వస్తుంది అని తెలుసుకొని కోటేశ్వరరావు నుండి మస్తాన్ రావు కి ఫోన్ చేపించి గంజాయి అయిపోయింది తీసుకురమ్మని చూపించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి 25kgల గంజాయి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో బొప్పూడి గుడి వద్ద అతనిని పట్టుకున్నారు. 
 ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అని ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడేవాళ్ళ పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. అలాగే ఎక్సైజ్ బ్యూరో CI కర్ణ , SI ప్రసాద్ గారిని మరియు సిబ్బందిని అభినందించారు.   




Share:

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--

 చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో  పుర ప్రజలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు  - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి చిన్నగా వెళ్తూ ట్రాఫిక్ జాంలో చిక్కుకునేవారు వాహనదారులు. రోడ్లు సరిగాలేక దుమ్ము ధూళితో పుర ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ కొన్ని రోజుల క్రితం మరమ్మతులు  చేసిన రోడ్లు (నరసరావుపేట సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వైపు ) వలన పట్టణములో ట్రాఫిక్ కష్ఠాలు తగ్గాయి మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



Share:

చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత

 చిలకలూరిపేట నేషనల్ హైవే పైన  గంజాయి పట్టివేత :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుండి  సుమారు 20 kgల గంజాయి ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్షలలో ఉండవచ్చు. ఎక్కడనుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన విచారణ మొదలుపెట్టారు. 




Share:

చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--

 చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ  :--

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో  ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు. షాప్ యజమాని బాల మురళీకృష్ణ స్థానిక పోలీస్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు వారు ఘటన స్థలానికి చేరుకొని  కేసు నమోదుచేసి  విచారణ చేపట్టారు. 

 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.