మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

46.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - ముఖ్యాంశాలు

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ ఉంటుందని ఆమె తెలిపారు. బడ్జెట్ 46.6 లక్షల కోట్లు ఉండగా ఆదాయం 30.80 కోట్లు గా ఆమె తెలిపారు.

* ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది.

* ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది.

* పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి.

* ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది.

* పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు.

* వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

* 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు.

* రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్‌ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

* అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.

* స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లక్షపతి దీదీ'లుగా మారేందుకు సాధికారత.

* ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు.

* స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్‌లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి.

* పరిశోధన, సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం.

* మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం.

* 40వేల నార్మల్‌ బోగీలను వందేభారత్‌ ప్రమాణాలకు పెంచుతాం.

* యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం.

* 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం.

* లక్ష కోట్లతో ప్రైవేట్‌ సెక్టార్‌కి కార్పస్‌ ఫండ్‌.

* టూరిస్ట్‌ హబ్‌గా లక్షద్వీప్‌.

* 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు.

* 3 మేజర్‌ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం.

* వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం.

* 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

* ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి.

* దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు.

* రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

* 80 కోట్ల మందికి ఫ్రీరేషన్‌తో ఆహార సమస్య తీర్చాం.

* మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం.

* వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం.

* ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.

* GDP అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్‌ఫార్మెన్స్‌.

* మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం.

* 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు.

* 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం.

* స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు.

* 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు.

* 11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం.

* 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం.

* జన్‌ధన్‌ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం.

* స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.

* లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు.

* 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం.

* నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం.

* అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌.

* దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు.


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.