మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట టౌన్ మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన సంగుల శివ బాల(26), తాటికొండ వంశీ(26) అనే యువకులు కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. గతంలో వంశీ సోదరుడిని పై శివ బాల దాడి చేసిన ఘటనను గుర్తుతెచ్చుకొని పాత కక్షల నేపథ్యంలో వంశీ మద్యం మత్తులో విచక్షణను కోల్పోయి దగ్గరలో ఉండే చికెన్ సెంటర్ దగ్గర నుండి కత్తిని తీసుకొని శివబాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మద్యం మత్తులో ఉన్న శివబాల పై మెడపై, తలపై, చేతివేళ్లపై తీవ్రమైన గాయాలై రక్తస్రావంతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఘటనను అడ్డుకొని శివబాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్య సిబ్బంది బాధితుడిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించమని తెలిపారు. అపస్మార్క స్థితిలో ఉన్న శివబాలను మెరుగైన వైద్య చికిత్స కై పట్టణంలోని ఆర్కే ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. శివ బాల పరిస్థితి విషమంగా ఉందని స్నేహితులు తెలిపారు. ఘటనకు కారకుడైన వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న టౌన్ సిఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్


పల్నాడు జిల్లా :- భారీ ర్యాలీతో చిలకలూరిపేట మీదుగా కోటప్పకొండను చేరుకొని ప్రత్యేక పూజలు అనంతరం నరసరావుపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..

నా నియోజకవర్గం వదిలి పెట్టి వస్తున్నప్పుడు బాధ వేసింది. పల్నాడు గడ్డపై అడుగుపెట్టిన వెంటనే గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను సరైన చోటుకు పంపించాడనుకున్నాను. నా జీవితంలో అనేక కష్టాలు, బాధలున్నాయి. నాకు మీసం తిప్పాలని ఉంది. మా నెల్లూరులో మీసం తిప్పితే రౌడీ అంటారని రాజకీయ నాయకులు చెప్పారు, కాని పల్నాడు వచ్చిన తర్వాత మీసం తిప్పుతా, పంచె కట్టుకుంటా  నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా. జగనన్న కోసం తల తెగుతుందన్నా ముందుకే వెడతా. రాష్ట్రంలో ఎక్కడైనా ఓడి పోయే సీటు ఉంటే అక్కడికి వెళ్ళమన్నా వెళతాను. నెల్లూరు నాకు సెట్ అవ్వదు అంటారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పల్నాడుకే నన్ను పంపించారు. గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారని టిడిపి వాళ్ళు అన్నారు. మా గొర్రెల, బర్రెల పాలు అమ్ముకునే వేల కోట్లు సంపాదించిన విషయం భువనేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. నేను గొర్రెలు కాసిన వారసత్వం నుండే వచ్చానని గర్వంగా చెప్పుకుంటాను. నన్ను పెంచుతారో తెంచుతారో మీ చేతుల్లో ఉంది. నా రాజకీయ భవిష్యత్ మీ చేతిలో పెడుతున్నాను. నేను వదిలి పెట్టిన సీటును మైనార్టీకి ఇచ్చారు. నెల్లూరు చరిత్రలో మైనార్టీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

తిరిగి సిఎంగా జగన్ చూసే వరకూ అందరి కలిసి పని చేయాలని, టిడిపి ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే అరవై రోజుల్లో తేల్చుకుందామని ఆయన తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎంపి తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం అని జోస్యం చెప్పారు.

 ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి, సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ...

సింహపురి నుండి నూతన ఉత్సాహం నర్సరావుపేటకు వచ్చిందని, జలవనరుల శాఖ సీటును రాంబాబుకు వదిలి పెట్టు అని జగన్మోహన్ రెడ్డి అంటే  వదిలి పెట్టిన విశ్వాస పాత్రుడు అనిల్ అని ఆయనను కొనియాడారు, అలాగే ఇక్కడ సీటు వదిలి పెట్టి గుంటూరు వెళ్ళు అంటే పార్టీనే వదిలి పెట్టిన విశ్వాస ఘాతకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అని ధ్వజమెత్తారు. నరసరావుపేట లోక్ సభ లో ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ తో అనిల్ ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. బిసి లకు సీటు ఇస్తామంటే పార్టీ మారిన ద్రోహులకు బిసిల ఓటు అడిగే హక్కు లేదు అని, ఏడు రథాలను నడిపించిగల శ్రీ కృష్ణుడు అనిల్ అని, ఈ రథం కింద అందరూ నలిగిపోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ....

"చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా బిసిలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారా. మహిళలు గడప దాటకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లా లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ అభ్యర్థులతో పాటు లోక్ సభ అభ్యర్థి అనిల్  ను గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ...

చంద్రబాబుకి అనిల్ కుమార్ పంపి జగన్ కౌంటర్ ఇచ్చారని, తానా తందానా అయిపోయిందయ్య కృష్ణయ్య. అనిల్ కుమార్ యాదవ్ తో కాదు నాతో పెట్టుకో చాలు కృష్ణ అంటూ ఎంపీ లావు కృష్ణ పై కామెంట్స్ చేశారు. అలాగే తోలు తీస్తాం అంటూనారు ఎవరికి తీస్తారు తాట.35 మంది కాపులకు టికెట్స్ జగన్ ఇచ్చారు గుర్తుపెట్టుకో పవన్. నువ్వు 35 టికెట్స్ తెచ్చుకోకపోతే పవన్ కల్యాణ్ కు కాపులు తోలు వలుస్తారు అటు ఆయన ధ్వజమెత్తారు.

Share:

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట టౌన్:-  సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన చిలకలూరిపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గణపవరం చెందిన మాధవి తన కుటుంబంతో కలసి చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేశా కళ్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. వివాహం జరుగుతుండగా తమ సెల్ఫ్ ఫోన్ చోరీకి గురయ్యాయని గమనించిన వారు పెళ్లికి హాజరైన బంధువులతో విషయాన్ని పంచుకున్నారు. పెళ్లికి హాజరైన వారిలో మొత్తం ఐదు సెల్ ఫోన్లు దొంగిలించబడినట్లు సమాచారం. సదరు మహిళా సెల్ ఫోన్ చోరీకి గురైందని బాధతో రాత్రి 11 గంటలకు సమయంలో కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. చిలకలూరిపేట, గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు సమీపంలో ఇద్దరి యువకులు అనుమానాస్పదంతో ఉండటంతో గమనించి సోదా చేయగా వారి వద్ద దొంగిలించిన సెల్ ఫోన్లు గుర్తించారు. విషయాన్ని గమనించిన ఒక దొంగ వారిని నెట్టివేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మిగిలిన ఇంకొక దొంగని కాళ్లు చేతులు కట్టివేసి దేహశుద్ధి చేసి ఆరా తీయగా నరసరావుపేటకు చెందిన రామూగా తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి సమయంలో దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మహిళలను స్థానికులు అభినందించారు. రాత్రి సమయంలో మహిళ అని అధైర్యం పడకుండా ధైర్యంగా దొంగలను ఎదిరించి పట్టుకున్నారు.

Share:

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:- న‌ర‌స‌రావుపేట‌ పార్లమెంట్ వైయ‌స్సార్‌సీపీ ఇన్ చార్జ్ గా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారికి  ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఘన స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు జ‌ల‌వ‌న‌రుల‌శాఖామంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు న‌ర‌స‌రావుపేట మునిసిప‌ల్ గెస్ట్ లో బుధ‌వారం మీడియా స‌మావేశంలో జ‌లవ‌న‌రుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, వైస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, చిలకలూరిపేట వైయ‌స్సార్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్ నాయుడు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మంత్రివ‌ర్యులు అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ కు బీసీ అభ్యర్థిని కేటాయించడం సీఎం జ‌గ‌న్  తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలో అభ్య‌ర్థుల మార్పులు అయిపోయాయ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు పోటీ చేయ‌బోతున్నార‌ని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకు రావడం జ‌రిగింద‌ని వివ‌రించారు. 

      ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14న నరసరావుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు మరియు పార్టీ సానిభూతిపరులకు పిలుపునిచ్చారు. న‌రసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ సభను  ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారటే మాటపై నిలిచే వ్యక్తి అని ఎన్నడు లేని విధంగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయించడం గొప్ప విషయం అని అన్నారు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అత్యధిక‌ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019లో మాదిరిగానే 2024లో కూడా జిల్లాలోని 7నియోజకవర్గలు విజయం సాధించ బోతున్న‌ట్లు చెప్పారు.

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు అనిల్‌కుమార్ యాద‌వ్‌ నెల్లూరు నుండి రోడ్డు మార్గాన బ‌య‌లుదేరుతార‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని అడ్డరోడ్డు సెంట‌ర్ కు చేరుకుంటార‌న్నారు. అక్క‌డ త‌న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనిల్‌కుమార్ యాద‌వ్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లక‌నున్న‌ట్లు చెప్పారు. 2:30 గంట‌ల‌కు కోట‌ప్పకొండలో త్రికోటేశ్వ‌రుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 4 గంట‌ల‌కు కోట‌ప్ప‌కొండ నుంచి బ‌య‌లుదేరి న‌ర‌స‌రావుపేట మండ‌లం పెట్లూరివారిపాలెం చేరుకుంటార‌న్నారు. అక్క‌డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి స్వాగ‌తం పలకనున్నారు. అక్క‌డి నుంచి న‌ర‌స‌రావుపేట‌ ప‌ల్నాడు బ‌స్‌స్టాండ్ సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ వ‌ద్ద‌కు చేరుకుంటార‌ని తెలిపారు. స్వాగ‌త ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, సానుభూతి ప‌రులు పెద్ద ఎత్తున హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Share:

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

♦️🕉️🕉️♦️ *శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు*  చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు పక్కన శ్రీనివాసానగర్ కొత్త వాటర్ ట్యాంకు వద్ద వేంచేసియన్న శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకలుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు ఆదివారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజేష్ నాయుడు గారు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట:-  పట్టణంలోని పెదనందిపాడు మారుతీ నగర్ నందు వేంచేసి ఉన్న జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలుకు వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share:

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

చిలకలూరిపేట:-  నేడు చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. గుంటూరు - శంకర్ కంటి ఆసుపత్రి వారి జిల్లా అంగత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచిత బీపీ మరియు షుగర్ టెస్టులను చేసి ఆరోగ్య పరిస్థితి మరియు స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆపరేషన్ చేసే రోజును వారికి ఇస్తారు. అనంతరం ఆయా రోజులలో చిలకలూరిపేట నుండి గుంటూరు శంకర ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తారని టిడిపి నాయకుడు తెలిపారు. వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు.

Share:

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

CR క్లబ్ నందు ఘంటసాల వర్ధంతి మహోత్సవం - పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు

చిలకలూరిపేట పట్టణం :- సి ఆర్ క్లబ్ నందు గోరంట్ల నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కళాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు మరియు ఎంతోమంది కళాకారులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని ఘంటసాలను కొనియాడారు. అలాగే చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల జీవితాలను ఎప్పుడు మనస్మరించుకుంటా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లీడర్ నాయుడు శివకుమార్, సి ఆర్ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య, లోక్సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాధాకృష్ణ, రోటరీ క్లబ్ వెంకట్రావు, కళాకారులు గొట్టిపాటి రామారావు, భక్తవత్సలం, రవీంద్ర బాబు, బంగారు బాబు, చించు పున్నయ్య, పావులూరి కృష్ణారావు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ కళాకారుడు గుండెపోటుతో మృతి

చిలకలూరిపేట - నృత్యం చేస్తూ  కళాకారుడు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న( వేణుగోపాల్) 37 గుండెపోటుతో మృతి చెందారు వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకు చెందిన పూల చిన్న అనే నృత్య కళాకారుడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మవారి వేషధారణలో కనిపిస్తూ భక్తి రసాన్ని రక్తి కట్టించేవాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో మరియు పలు టీవీ కార్యక్రమాలలో కూడా తన నాట్యంతో మెప్పించేవాడు. అయితే గత రాత్రి పెదనందిపాడు రోడ్డు, మారుతి నగర్ లోని జ్వాలాముఖి పోలేరమ్మ మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అతను డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు సిపిఆర్ చేసినట్లయితే బ్రతికి అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సుబ్బయ్య తోటలోని సొంత గృహం నందు విషాదఛాయలు అలముకున్నాయి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నేడు, రేపు కొండవీడు ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

నేడు, రేపు కొండవీడు  ఫెస్ట్ - 2024 కొండవీడు ఫెస్ట్ ను విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ శివ శంకర్

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

 పల్నాడు జిల్లాలో చారిత్రక,సాంస్కృతిక పరంగా, పర్యాటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అమరావతి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు చాలావరకు పర్యాటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని, మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. పర్యాటక పరంగా అమరావతి, కొండవీడు కోట, కోటప్పకొండ, నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పులిచింతల, దైద, గుత్తికొండ బిలం, చేజర్ల, దుర్గి శిల్పకళ, మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం, వెన్న ముద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ (చంఘిజ్ ఖాన్ పేట) ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నిలయం పల్నాడు జిల్లాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని, కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే, ఆ తరహా పర్యాటక అభివృద్ధికి, బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేసామన్నారు, ఆ ప్రాంతమంతా (రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతం కావడంతో వారి సహకారంతో సుమారు రూ 4 కోట్లు ఖర్చు చేసి అక్కడ కొన్ని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని గుర్తు చేసుకుంటూ "కొండవీటి ఫెస్ట్ - 2024" ఉత్సవాల సందర్భంగా కొండవీడు కోటను సందర్శిస్తే బాగుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కోసం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లో అడ్వెంచర్ లాగా చేస్తే ఆ జ్ఞాపకాలతో కొండవీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు వెళ్లి ఇంకొంత మంది పర్యాటకులతో చెప్పి తీసుకువచ్చే విధంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రిక్కింగ్, రాక్ లైనింగ్, షూటింగ్, ఆర్చరీ, విధుల చెరువును చాలా క్లిష్టతరమైన పని పూర్తి చేసి బోటింగ్, కయా కింగ్, ఫిషింగ్, హార్సింగ్ ఏర్పాటు చేశాం, ఇది ఎప్పుడు అలానే ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది, అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ఒక టైం లో "నైట్ క్యాంప్" అక్కడే ఒక టెంట్ ను మరియు భోజన వసతులను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ( జంతు రక్షిత  ప్రాంతం) కనుక ఎటువంటి ప్రాణహాని లేకుండా జాగ్రత్తగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొండవీటి ప్రాంతాన్ని ఒక జాతరలా (ఫెస్టివల్ తరహాలో) జరిగేలా ప్రీ ప్లాన్ గా తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటించారు, పల్నాడు జిల్లాతో పాటు పక్క జిల్లాలైన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి 10,11 తేదీల్లో సెలవులు ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పిబ్రవరి 10,11 తేదీల్లో కొండవీడు కోట-2024 ఫెస్ట్ ను చేయ బోతున్నట్లు పైన చెప్పినవన్నీ పర్మినెంట్ యాక్టివిస్ అని, ఇవి కాక  హెలీ రైడ్, పారా రైడ్, హార్స్ రైడ్ లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు, ఇందులో హెలీ రైడ్ కు 4 వేలు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు, పారా రైడ్ కు 2వేలు, హార్స్ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ను ఏర్పాటు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా పిల్లల కోసం తెప్పిస్తున్నామన్నారు. పూల తోటలతో పాటు ఇసుకను ఏర్పాటు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్ గీసేలా ఏర్పాటు చేస్తామాన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాములు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి అందులో క్లాసికల్, వెస్ట్రన్ పోటీలను పెట్టడం జరుగుతుందన్నారు, ఇందులో ఎంపిక కమిటీ (జడ్జెస్)ఉంటుందన్నారు.వీటిలో ప్రధమ రూ. 10,116, ద్వితీయ రూ. 5,116,తృతీయ  బహుమతులు రూ.2.500లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొండవీడు కోట-2024 లో ఉత్సాహంగా పాల్గొనే వారికి అన్ని వసతులను కల్పిస్తున్నట్లు, క్రీడలతోపాటు, ఆహ్లాదకరమైన, సహస కృత్యాలు, ఆటలు, ఫుడ్డు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చినా, వారి మదిలో గుర్తుండి పోయేలా "కొండవీడు “ఫెస్ట్-2024" తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట - సుబ్బయ్యతోట - ఆర్థిక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట:- పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన L పద్మ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుబ్బయ్య తోటకి చెందిన పద్మ అనే మహిళ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గత కొన్ని రోజుల క్రితం 52 ఎకరాల్లోని ప్రభుత్వం వారు నిర్మించిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆమెకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న కుమారుడు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. చలాకీగా ఉండే కుమారుడు మతిస్థిమితం కోల్పోవడంతో మానసికంగా చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త కూడా చనిపోవడంతో, పనిచేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ప్రభుత్వం ఇచ్చే వితంతువు పెన్షన్తో జీవనం సాగించేది. శుక్రవారం రాత్రి ఆర్థిక మానసిక ఇబ్బందులను తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సదరు బంధువులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట - జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ 

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

చిలకలూరిపేట :- పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు పాఠశాల యందు విద్యార్ధిని, విద్యార్థులకు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా  (నులిపురుగుల నివారణ) ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయించడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సుధ మాట్లాడుతు విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. ANM ధన లక్ష్మీ మాట్లాడుతూ ఈ  టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ.నీలిమ. టి.కుమారీ. ఆశ వర్కర్ యన్ రాజేశ్వరి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరుపేట నియోజకవర్గంలోని బీసీలందరూ టిడిపి గెలుపుకై కృషి చేస్తాం - చిలకలూరిపేట బీసీ నాయకులు

చిలకలూరిపేట:- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయిలోని బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలందరూ పార్టీకి వెన్నుదండుగా ఉన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ... వైకాపా అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ఆ వర్గాలు మళ్లీ జగన్‌కు ఓటేయాలని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్‌ వర్గాలంటే వారి వెన్ను విరిచినందుకా... 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా... 74మంది బీసీలు నాయకుల్ని క్రూరంగా నరికి చంపినందుకా...  5వేల మందిబీసీలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినందుకా... వాళ్లే వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పగలరా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. తెలుగుదేశం ప్రభుత్వ హయంతో ఆత్మగౌరవంతో, అన్నింటా అవకాశాలతో తలెత్తుకుని బతికిన వెనకబడిన వర్గాల వారిని అన్ని విధాలుగా మోసం చేసి రోడ్డున పడేసిన దుర్మార్గుడు జగన్ అని ఆయన దుయ్య బట్టారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 1983 తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు తెదేపా రాజకీయ ప్రాధాన్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు . అలాంటి పరిస్థితుల నుంచి గడిచిన అయిదేళ్లలో 56 బీసీ కార్పొరేషన్లు అంటూ ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా వాటికి పైసా విదల్చక పోగా బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన దాదాపు రూ. 75 కోట్లు దారి మళ్లించడం వారి కుటిలనీతికి నిదర్శమన్నారు. ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా జగన్ అత్యధికంగా అన్యాయం చేస్తోంది బీసీలకే అని తెలిపారు ప్రత్తిపాటి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈసారి తమ రాజకీయ అవకాశాల పుట్టినిల్లు తెలుగుదేశంతో కలసి నడవాలని కృతనిశ్చయంతో ఉన్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

చిలకలూరిపేట - మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నారా భువనేశ్వరి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొగిలి సత్యనారాయణ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక మనస్థాపనతో గుండెపోటుతో మృతి చెందారు. నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం గా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్ సభ్యులు, మాజీ టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేటలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్:- పట్టణంలో యువకుడి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన గోపి నాయక్ అనే యువకుడు పండరిపురం లోని ఒక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవం సాధిస్తున్నాడు. ప్రేమ విఫలం అవటంతో మనస్థాపానికి గురై ఈనెల ఐదవ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సింగ్ నగర్ లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవుడై చెట్టుకి వేరేలాడుతున్న గోపి నాయక్ ను చూసి కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.