మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



ఉరిశిక్ష,ఎన్కౌంటర్ వీటికి ఉన్న శక్తి చాలా గొప్పది.ఉరిశిక్ష  అమలు చేయడం చట్టం.కానీ ఎన్కౌంటర్ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య. కానీ చట్ట ప్రకారం ప్రభుత్వం వెంటనే ఎవరయినా మృగాడు తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించేందుకు ఉన్న అవకాశం"కనిపిస్తే కాల్చివేత"మాత్రమే. తప్పించుకోవడానికి ప్రయత్నించే తీవ్రమైన నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే వీలు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు"పోలీసులు షూట్ ఎట్ సైట్"ఆర్డర్ జారీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అదే విధానాన్ని చిన్నారులు,యువతులు,మహిళలను అత్యాచారం చేసి చంపిన మానవ మృగాలకు వర్తింపజేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఆరేళ్ళ చిన్నారిని హైదరాబాద్ లో అత్యాచారం చేసినా,అయేషా మీరా ను హాస్టల్లో మానభంగం చేసి చంపినా,గుంటూరు లో రమ్య ను నడిరోడ్డుపై నరికి చంపినా,ఢిల్లీలో నిర్భయ ను బస్సులో మానభంగం చేసి కిరాతకంగా చంపినా,సుగాలి ప్రీతి,దిశా లను మృగాళ్లు చంపినా ఇంకా అత్యాచారం హత్యకు గురై చనిపోయిన వారికి న్యాయం జరిగేందుకు నిందితులను  మన భారత దేశంలో న్యాయ పరంగా శిక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన విధానం.అయితే దానిని ప్రజలు సమర్దించలేక పోవడం గురించి సమగ్రమైన చర్చలు జరగాలి.ప్రజా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన విధానాన్ని అమలు చేయడం కుదరదు.కానీ ఇలాంటివి జరిగిన ప్రతీసారి ఉరితీయాలని,ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేయడం చూస్తున్నాము.ఇటువంటివి జరిగినపుడు ప్రజల్లో ఉన్న ఆవేశం,భాద,అత్యాచారం జరిగిన కుటుంబంకు న్యాయం చేయడానికి సులభంగా ఉన్న ఓకే ఒక మార్గం"కనిపిస్తే కాల్చివేత".దీన్ని అమలు చేయాలి.చట్టం చేయాలి.ఉరిశిక్ష కాదు ఆలస్యంగా అమలు జరగడానికి,రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడానికి,ఎన్ కౌంటర్ కాదు చట్టవ్యతిరేకమైన ప్రభుత్వ విధానం అనటానికి.సరయిన చేయగలిగిన, చట్టబద్దత కలిగిన శిక్షా విధానం"షూట్ ఎట్ సైట్"నవతరం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది.న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు క్రింద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలి.ప్రజలు ఆలోచించాలి,మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత"అమలుకు ఉద్యమించాలి,ఇదే ప్రభుత్వ విధానం కావాలని డిమాండ్ చేయాలి.

Share:

చిలకలూరిపేట పట్టణంలో 15/ 09 /2021 నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 చిలకలూరిపేట పట్టణంలో 15/ 09 /2021 నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


 చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీగా 10 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.

పండరీపురం లో 1 

తూర్పు మాలపల్లి 2 

వెంకట రెడ్డి నగర్ 1 

ఆర్టీసీ కాలనీ 1 

ఎన్టీఆర్ కాలనీ 1 

సుభాని నగర్ 2 

ఎం వి నారాయణపురం 1 

కృష్ణా నగర్ 1గా నమోదు అయ్యాయి.





Share:

చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు

 చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము  ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు


చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నాదెండ్ల మండలంలోని సాతులూరు, అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, అప్పాపురం, తూబాడు గ్రామాలు, చిలకలూరిపేట పట్టణంలోని పాత వార్డు లు   08, 22, 31 అసంబద్దంగా పోలింగ్ బూత్  మార్పుల   ఫై  వివరాలతో సహా వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై సదరు అధికారి ఉన్నత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.  తెలుగుదేశం  పార్టీ నేతలు మాట్లాడుతూ, గ్రామస్తులు ఫిర్యాదు చేయకుండా, ఎక్కడ ఏమి అభ్యంతరాలు లేకపోయినా ఏ రకంగా పోలింగ్ బూతులు మారుస్తారని, ఈ ఆలోచనను విరమించుకొని పక్షంలో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా శ్రీనివాసరావు, నందిగం శివ కోటేశ్వరరావు, కొండ్రగుంట సురేష్, నాగ పూర్ణచంద్ర రావు, జి.రామాంజనేయలు, ఎం.భాస్కర్ రావు, కల్లి సాంబశివరావు, నెల్లూరి హరిబాబు, షేక్ మస్తాన్ వలి (అప్పాపురం), దగ్గుమల్లి కోటేశ్వరరావు, షేక్ యాసీన్,సిరిబోయిన కోటయ్య, నజీరున్నిసా బేగం, మురకొండమల్లిబాబు, షేక్ అజారుద్దీన్, షేక్ భారీ సైదా, షేక్ ముజఫర్, షేక్ రహీమ్, శివుడు  తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు

 చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



చిలకలూరిపేట పట్టణం లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేస్తూ అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా మార్కింగ్ లైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉండే తోపుడు బళ్ళు చిరు వ్యాపారులు లైన్ దాటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తేతే వారిపై పై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ సహకరించాలని కోరారు.
















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు మొత్తం 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో రెడ్ల బజార్లో ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఒక్క కేసు నమోదు అయ్యింది. 

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలం లో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 





















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో  ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో ఒక్క కరోనా కేసు కుడా నమోదు కాలేదు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

రాజు గారి పాలెం గ్రామంలో - 1

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో యడ్లపాడు గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు అయ్యింది. 


















Share:

రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

రేపు (26-07-2021,సోమవారం )  చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు 26-07-2021 సోమవారం నాడు మొత్తం 6,700 కోవిషిల్డ్ వ్యాక్సిన్లతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ తెలిపారు. అయితే ఎక్కడ ఎక్కడ ఎన్ని డోసులు వేస్తున్నారు అంటే ! 

చిలకలూరిపేట సిహెచ్ సి లో - 200 

చిలకలూరిపేట యు ఎఫ్ డబ్ల్యూ సి నందు - 1000

సుబ్బయ్యతోట యు పి హెచ్ సి నందు - 500

రజకకాలనీ  యు పి హెచ్ సి నందు - 500

పురుషోత్తమపట్నం యు పి హెచ్ సి నందు - 500

కావూరు పి హెచ్ సి నందు - 1000

గణపవరం పి హెచ్ సి నందు - 1000

యడ్లపాడు పి హెచ్ సి నందు - 1000

నాదెండ్ల పి హెచ్ సి నందు - 1000 డోసులు కేటాయించారు. 





































Share:

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు మొత్తం 6 కరోనా  అయ్యాయి. 

పండరీపురం లో - 1

గాంధీపేట లో - 1

జాలయ్య కాలనిలో - 1

రహమత్ నగర్ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 


























Share:

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా CI బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు. శనివారం సాయత్రం సమయంలో పట్టణంలోని పలు రద్దీ ప్రదేశాలు పర్యటించి ట్రాఫిక్ సమస్యల పైనా వ్యూహాలు సిద్ధం చేసారు. పట్టణంలోని ట్రాఫిక్ ప్రధాన సమస్యలలో ఒకటి ముఖ్యంగా మార్కెట్ సెంటర్,చలివేంద్రం బజార్ కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్న కారణంగా, అసలే కరోనా సమయంలో రద్దీ తగ్గించాలి అనే ఆలోచనతో CI రాజేశ్వరావుతో పాటుగా టౌన్ పోలీస్ సిబ్బంది పళ్ళు మార్కెట్ వ్యాపారులను పిలిచి వారితో చర్చించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని వారిని సూచించారు. తోపుడు బళ్లకు హద్దులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి అని తెలిపారు. అలాగే కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి అని తెలిపారు. కర్ఫ్యూ సమయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం అని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన తెలిపారు.  












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు మొత్తం 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్రసెంటెర్ లో - 1

సుగాలి కాలనీ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2కేసులు నమోదు అయ్యాయి 

తూబాడు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట, యడ్లపాడు మండల గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడునమోదు అయినా కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

 చిలకలూరిపేట నియోజకవర్గంలో 22-07-2021 గురువారం నాడు మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

రెడ్ల బజార్ లో - 2

వేలూరు రోడ్డులో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

తుర్లపాలెం గ్రామంలో - 1

యడ్లపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట,నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. 


Share:

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

చిలకలూరిపేటలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన RBI రీజనల్ డైరెక్టర్ నిఖిల

https://chilakaluripetspeednews.blogspot.com/

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆధ్వర్యంలో UNION BANK యొక్క పర్యవేక్షణలో  గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు 10 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను 21 వ తారీఖు బుధవారం మధ్యాహ్నం  3:30 లకు  RBI రీజనల్ డైరెక్టర్ శ్రీమతి . K.నిఖిల గారు వర్చువల్ గా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో భాగంగా కందిమళ్ల హాస్పిటల్ పక్కన నూతన కార్యాలయం (CFL) (center for financial literacy) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీమతి. పైలా విజయ కుమారిగారు   ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభ సందర్బంగా  కావూరు గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాలకు 
50 లక్షల రూపాయలు ఋణాలు అందించడం జరిగింది. 
 కార్యక్రమంలో బ్యాంకు RDO హనుమంతు, బ్యాంకు ఉద్యోగులు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ కౌన్సిలర్స్ రవిరాజు, భాస్కర్ లు పాల్గొన్నారు.  


                                                                                      CFL OFFICE, చిలకలూరిపేట.  9989209814

https://chilakaluripetspeednews.blogspot.com/







 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు యంగ్ టైగర్ కుమ్మర క్రాంతి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చిలకలూరిపేట పట్టణం స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృధాశ్రమంలో కేకు కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ కట్ట్ చేసి కార్యక్రమాని ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు విచ్చేసారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు సభ అధ్యక్షత వహించారు, వారు మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకొనుటకు ముఖ్య ఉద్దేశం మీ లాంటి పెద్దల దీవెనలు ఆయనకు వుండాలని, అదే విధంగా కుమ్మర క్రాంతి కుమార్ గారు గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సమస్య వుండి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వేంటనే రెస్పాండ్ అయ్యి 20నిమిషాలలో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపారని ఆయన పోరాట పటిమ గురించి వివరించారు 

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుల వెంకట కోట్టయ్య గారు మాట్లాడుతూ క్రాంతి కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్ రావు గారికి అను క్షణం అండగా వుంటు బిసిల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్నారని మాకు సమస్య ఉన్నది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యపై రెస్పాండ్ అవుతారని, ఆయన తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలు వృద్దాశ్రమంలో జరగటం ఆనంద దాయకమని ఆయన కోనియాడారు. 

నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రుపేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కుమ్మర క్రాంతి కుమార్ అన్న జన్మదినాన్ని ఇంత మంది పెద్దవాళ్ల మధ్య నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, మా యంగ్ టైగర్ మా అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో ఇలాంటి  పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, బిసిల కోసం అన్న చేస్తున్న పోరాటాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అన్నలో వున్న దూకుడుని, పోరాట పట్టిమని నేటి యువత పునికి పుచ్చుకోవాలని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిరావుపూలే చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు గారు,నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తెప్పలి కాసులు గారు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంకదారి పుల్లయ్య గారు మరియు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/




















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 21-07-2021,బుధవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సాంబశివానగర్ లో - 1

గుర్రాలచావిడీ లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయింది. 

నాదెండ్ల మండల గ్రామాలలో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది. 

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయింది. 

యడ్లపాడు మండల గ్రామాలలో 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావుపాలెం గ్రామంలో - 1

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.