మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం


https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తన యాక్షన్ ప్లాన్ మార్పుపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థకు పోటీగా టీడీపీ సొంత టీమ్ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను ఎంపికచేసి ఎలక్షన్ బాధ్యత అప్పగించాలి అని చూస్తుంది. ఇప్పటికే ఈ యాక్షన్ ప్లాన్కు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. 



   

Share:

చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన

 చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం  జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన :-


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం గురువారం  మండలంలోని పోతవరం, బొప్పూడి గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు. ఆసుపత్రి ఎర్పాటు చెయ్యాలి అంటే 5 ఎకరాల భూమి అవసరం.  అయితే పోతవరం గ్రామా పరిధిలోని త్రాగునీరు చెరువు సమీపం లో 275,276 సర్వ్ నంబర్లలో 15 ఎకరాలని పరిశీలించారు . అయితే ఆ  భూమి ప్రజారోగ్య శాఖకు కేటాయించారు. ఆ భూమి లో నిర్మాణం చెయ్యాలి అంటే కేటాయించిన భూమిలో 5ఎకరాల భూమి కోసం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాల్సిఉంది . లేదా బొప్పూడి గ్రామా ప్రాంతంలో బొప్పూడి రాజాపేట మార్గంలో 513 సర్వే నెంబర్ కొంత పోరంబోకులో ఉన్న 29. 04 ఎకరాలను పరిశీలించారు. ఈ సందర్భంలో తసీల్ధార్ సుజాత, మండల సర్వేయర్ , ఆర్ఐ , విఆర్వోలు పాల్గొన్నారు.  




Share:

AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్

 AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/

ప్రస్తుత SEC గా వున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల చివరకు ముగియనున్నది. అందువలన SEC గా ఎవరిని నియమిస్తారు అనే ప్రశ్న కు తెర దిన్చుతూ నీలం సాహ్ని గారి పేరు ఖరారు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పేర్లను సిఫార్సు చెయ్యగా గవర్నర్ హరిచందన్ గారు నీలం సాహ్ని గా నియమిస్తూ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీఎం జగన్ కి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆమె ఆయా పదవికి రాజీనామా చేసి SEC గా బాధ్యతలు స్వకరించనున్నారు . 





Share:

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

 చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్ :--


https://chilakaluripetspeednews.blogspot.com/2021/03/blog-post_6.html

పట్టణంలో కళామందిర్ సెంటర్ నందు  రేపు శనివారం జరగబోయే భారీ బహిరంగ సభ ఎర్పాట్లను పరిశీలించిన ఛైర్మెన్ రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, పట్టణ అధ్యక్షులు తలహఖాన్ గారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చెప్పాలి అని తెలిపారు. 


https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/











Share:

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు  ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్ :--


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలోని శారదా హైస్కూల్ నందు మున్సిపల్ చైర్మెన్ రఫాని,వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గార్ల  పర్యటన ప్రాధాన్యతని సంతరించుకున్నది. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల మర్మతుల పైనా చర్చించారు. అలాగే పాఠశాలలోని విధ్యార్ధులతో మాట్లాడి మధ్యాహ్నం భోజన పథకం నాణ్యతని అడిగి తెలుసుకున్నారు.  కరోనా కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని , శానిటైజర్ వాడాలి అని . అలాగే భౌతిక దూరం పాటించాలి తెలిపారు. 









Share:

చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని

 చిలకలూరిపేట పట్టణంలో శనివారం  మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38  వార్డులకి గాను 30 వార్డులలో ఫ్యాన్ గాలి బాగా వీచింది అనే చెప్పాలి. ఆయా వియజానికి గుర్తుగా శనివారం నాడు పట్టణంలో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ లో పట్టణములోని వైస్సార్సీపీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా కోరారు మున్సిపల్ చైర్మెన్ రఫాని గారు 







Share:

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్  బంద్ - రోడ్ల పైకి రాని RTC  బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణములో  టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి.  ఉదయం నుండే  APSRTC బస్సులు నిలిపివెయ్యబడ్డాయి. అలాగే వ్యాపారులు బంద్ కి సహకరిస్తూ షాప్స్ మూసివేశారు. అయితే పొద్దున చలివేంద్రం బజార్,మెయిన్ రోడ్  లో కొంచం హడావిడి కనిపించినా తర్వాత దుకాణాలు అన్ని మూసివేసి వారీ మద్దతు తెలియచేసారు. పట్టణంలో అఖిలపక్షం, కార్మికసంఘాలు,ప్రజాసంఘాలు  భారీ ర్యాలీ తో పురవీధులలో తిరిగి కొత్తగా ఎర్పాటుచేసిన రైతు చట్టాలను , పెరుగుతున్న  పెట్రోల్ & డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  ప్రదర్శనలూ చేస్తూ దుకాణాలను,బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేసి బంద్ కి సహకరించాలి అని కోరారు. 



https://chilakaluripetspeednews.blogspot.com/












Share:

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది  !!! ???


https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరపాలక, పురపాలక సంస్థల చట్టాలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్సు ప్రకారం నగరపాలక సంస్థలకు రెండవ డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలకు రెండవ వైస్  ఛైర్మెన్ నియమితులు కానున్నారు. 
 అయితే చిలకలూరిపేట కు రెండవ వైస్ ఛైర్మెన్ గా ఎవరిని ఎన్నుకోవాలి  అనే ఆలోచనలో ఉన్నారు పాలకవర్గం . రిజర్వేషన్ ఖరారు అయితే ఎవరికీ దక్కుతుందో చెప్పలేము. మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధికంగా మహిళా కౌన్సిలర్లు  గెలిచారు . అయితే ఈసారికి రెండవ వైస్ ఛైర్మెన్ పదవి మహిళలకి దక్కవచ్చు. 






Share:

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--


https://chilakaluripetspeednews.blogspot.com/

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ  మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షడు అయిన శ్రీ కొనకళ్ల విద్యాధరావు లేఖ విడుదల చేసారు. కనుక దుకాణాలు&వ్యాపార సంస్థలు మూసివేసి భారత్ బంద్ కి సహకరించవల్సినదిగా కోరుతున్నారు.  ఇప్పటికే టీడీపీ , వైస్సార్సీపీ,కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. 








Share:

దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 దేశంలో రెండవరోజు కూడా  స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో వరుసగా రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు. ఈ రోజు పెట్రోల్ పైన 21పైసలు , డిజిల్ పైన 20 పైసలు తగ్గినది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అక్కడ అక్కడ  లాక్ డౌన్  , బ్రెజిల్ లో కరోనా బీభత్సము, ప్రపంచంలో కరోనా, స్ట్రైన్, తాకిడి వలన వాహనం వినియోగం తగ్గటం  మరియు  దేశంలో 5 రాష్ట్రాలలో  ఎలక్షన్ వంటి ప్రభావాలు పెట్రోల్ రెట్లపైన పడ్డాయి అనే చెప్పొచ్చు. గత 4 వారాల నుండి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. 







Share:

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో  రహదారి పక్కనే ఉన్న  సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 




 

Share:

చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు

 చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--

https://chilakaluripetspeednews.blogspot.com/
 
నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI  సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రురల్ SI రాంబాబు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాని గారు, కళాశాల ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున విధ్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలూ కావద్దు అని , వాటివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియచేసారు. అయితే నిన్న పట్టుబడ్డ గంజాయి అమ్మే వ్యక్తి నుండి రాబట్టిన సమాచారం మేరకు విద్యార్థులు ఈ మత్తు పధార్ధాలకి దూరంగా ఉంచటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం పట్ల CHILAKALURIPET SPEED NEWS తరుపున పోలీస్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 





Share:

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు  

https://chilakaluripetspeednews.blogspot.com/


గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చిలకలూరిపేటలో నూతనముగా ఎన్నుకోబడిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవుల అనంతరం బుధవారం ఉదయం ఆయా సేఖలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఛైర్మెన్ గా షేక్ రఫాని గారు మరియు వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యకరంలో MLA  రజని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బోలేదు చిన్నగారు , పట్టణ వైస్సార్సీపీ బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, ముస్లిం నాయకులూ, మతపెద్దలు, వైస్సార్సీపీ నాయకులూ పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 




Share:

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ఓగేరు వాగు సమీపంలో జాతీయ రహదారి పైనా ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న టాటా ఏసీ వాహనం వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరావు అనే వ్యక్తి ఓగేరు వాగు సమీపంలోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్లి ఇంటికి  వచ్చేటప్పుడు డివైడర్ దాటుతూ రోడ్ అవతలవైపుకి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న టాటా మినీ ఏసీ  వాహనం ఢీ కొన్నది. స్థానికుల సంచారంతో అక్కడికి వచ్చిన 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  అనంతరం ఆయనని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో కనుమూశాడు. 






Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.