మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్


చిలకలూరిపేట :- టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో 17వ తారీకు అనగా ఆదివారం నాడు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి పనులని చకచగా కార్యరూపం దాల్చడంతో సభ నిర్వహించేందుకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు, బిజెపి పార్టీ నుండి నాగభూషణం, జనసేన పార్టీ నుండి గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ చిలకలూరిపేట తోట రాజా రమేష్ మరియు టిడిపి, జనసేన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సభ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి ఉమ్మడి మేనిఫెస్టో సభ నభూతో నభవిష్యతీ అన్నట్టుగా ఉంటుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యమైందని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రాభివృద్ధికి కొత్తబాటలు వేస్తాయన్నారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కలవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సభకు బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో లోకేష్‌ ప్రత్యేకంగా భేటీ అయి ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భాజపాతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు సుమారు 15లక్షల మంది జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. పైగా ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సభ చిలకలూరిపేట కావటంతో ప్రత్తిపాటి పుల్లారావుపై బాధ్యతలు పెరిగాయని లోకేష్‌ వ్యాఖ్యానించారు. లోకేష్‌తో భేటీ తర్వాత పుల్లారావు మీడియాలో మాట్లాడుతూ 17న జరిగే సభతోనే జగన్‌ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుందని, తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌లో 175 నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని వెల్లడించారు. లక్షలాది మందితో జరిగే ఈ సభ దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. దేశానికి మోదీ ఒక దశ దిశ అయితే.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దశ దిశ అన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా దేశానికి ఒక సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజలను కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషం, ఆడబిడ్డలు క్షేమం, యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ బహిరంగ సభ దిక్సూచిలా ఉంటుందని తెలిపారు.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.