మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో యూజర్ చార్జీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు

 చిలకలూరిపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో యూజర్ చార్జీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద అక్టోబర్ 1వ తేదీ నుండి యూజర్ చార్జీల వసూళ్లు చేయనున్నారు. దీంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి మన చిలకలూరిపేట పట్టణంలో కూడా యూజర్ చార్జీలు ప్రతి ఇంటి నుండి 60 రూపాయలు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ షేక్ రఫ్పాని తెలిపారు. 30వ తేదీ గురువారం నాడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెల 19వ తేదీన చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ నందు పట్టణంలోని 38 వార్డు లో తడి చెత్త పొడి చెత్త సేకరణకు మున్సిపల్ సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చిలకలూరిపేట లోని 38 వార్డు లో గానూ మొత్తం 27 వేల గృహాల నుంచి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం కోసం 39 ఆటోలను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దీని ద్వారా సుమారు 16 లక్షల 20 వేల రూపాయలు ఆదాయం రానున్నది .దీంతోపాటు చికెన్ స్టాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు, హోటల్స్, లాడ్జిలు, వ్యాపార వాణిజ్యపరమైన  38 వ్యాపార వర్గాల నుండి ఈ చెత్త సేకరణకు సర్వం సిద్ధం చేశారు

Share:

చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

 చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణం లోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం అతి సమీపంలోని ఎలక్ట్రానిక్ గోడౌన్ నందు గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చౌత్ర  సెంటర్ లోని ప్రముఖ విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన  ఏసీలు, ఫ్రిట్జ్ ,కూలర్స్ ,టీవీలు వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ స్టాక్ ఉంచటం కోసం ఆర్య వైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న ఒక గోడౌన్లో ఉంచారు. అయితే గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి గోడౌన్ యజమాని సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రఫ్పాని మరియు వైయస్సార్సిపి నాయకులు విడుదల గోపి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి గోడౌన్ యజమాని మధును పరామర్శించారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

Share:

కమ్యూనిస్టు ఉద్యమనేత పెరుబోయిన రాము కన్నుమూత

కమ్యూనిస్టు ఉద్యమనేత పెరుబోయిన రాము కన్నుమూత

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ప్రముఖ సి.పి.ఎం.పార్టీ సీనియర్ నాయకులు,సి.ఐ. టీయూ. కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు  ఉద్యమ నేత పెరుబోయిన రాములు 90 సంవత్సరాలు ఆదివారం నాడు సాయంత్రం చనిపోయారు. ఈయన జీవిత కాలం ఉద్యమాల్లోనే గడిపారు. గత 8 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతు చివరికి కన్నుముశారు. ఈయన నరసరావుపేటలోని ఇకక్కుర్తి గ్రామము నుంచి చిలకలూరిపేట వచ్చి అప్పటి  కమ్యూనిస్టు నాయకుల ఉద్యమాలకు ప్రభావితులై  సభ్యులుగా 1964లో చేరారు. అప్పటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.   సి.ఐ టి.యూ లో పనిచేసిన ఈయన చిలకలూరిపేట  కంది మళ్ల టుబాకో కంపెనీ ఉద్యమములో ప్రముఖ పాత్ర పోషించారు.జైల్లో 2 నెల్లపాటు ఉండి లాఠీదెబ్బలు కూడ తిన్నా రు. అయిన ఉద్యమాలు వీడక ట్రేడ్ యూనియన్ తరపున పోరాడారు. అంతే కాక రిక్షా కార్మిక సంఘములోను. రైతు సంఘములోనూ  ఇంకా పలు సంఘాలలో పని చేశారు. అనారోగ్యంతో పార్టీ సభ్యులుగానే ఈ రోజు వరకు  కొనసాగుతున్నారు  ఈయనకు భార్య 4 గురు కుమారులు,4 గురు కుమార్తెలు మనవాళ్ళు,మనవరాలు ఉన్నారు.ఈయన చనిపోవడం పార్టీకి తీరని లోటని పలువురు నాయకులు అన్నారు.




Share:

చిలకలూరిపేట పట్టణంలో 19/ 09 /20 21 ఆదివారంనాడు నమోదైన కరోన కేసుల వివరాలు

 చిలకలూరిపేట పట్టణంలో 19/ 09 /20 21 ఆదివారంనాడు నమోదైన కరోన కేసుల వివరాలు


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



చిలకలూరిపేట పట్టణంలో 19/ 09/20 21 ఆదివారం నాడు ఏడు కేసులు నమోదయ్యాయి వాటి వివరాలు

గుండయ్య తోట 1

గుర్రాల చావడి 2

 వాసవి నగర్ 2 

సుగాలి కాలనీ 1

 రెడ్ల బజార్ 1




Share:

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



ఉరిశిక్ష,ఎన్కౌంటర్ వీటికి ఉన్న శక్తి చాలా గొప్పది.ఉరిశిక్ష  అమలు చేయడం చట్టం.కానీ ఎన్కౌంటర్ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య. కానీ చట్ట ప్రకారం ప్రభుత్వం వెంటనే ఎవరయినా మృగాడు తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించేందుకు ఉన్న అవకాశం"కనిపిస్తే కాల్చివేత"మాత్రమే. తప్పించుకోవడానికి ప్రయత్నించే తీవ్రమైన నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే వీలు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు"పోలీసులు షూట్ ఎట్ సైట్"ఆర్డర్ జారీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అదే విధానాన్ని చిన్నారులు,యువతులు,మహిళలను అత్యాచారం చేసి చంపిన మానవ మృగాలకు వర్తింపజేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఆరేళ్ళ చిన్నారిని హైదరాబాద్ లో అత్యాచారం చేసినా,అయేషా మీరా ను హాస్టల్లో మానభంగం చేసి చంపినా,గుంటూరు లో రమ్య ను నడిరోడ్డుపై నరికి చంపినా,ఢిల్లీలో నిర్భయ ను బస్సులో మానభంగం చేసి కిరాతకంగా చంపినా,సుగాలి ప్రీతి,దిశా లను మృగాళ్లు చంపినా ఇంకా అత్యాచారం హత్యకు గురై చనిపోయిన వారికి న్యాయం జరిగేందుకు నిందితులను  మన భారత దేశంలో న్యాయ పరంగా శిక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన విధానం.అయితే దానిని ప్రజలు సమర్దించలేక పోవడం గురించి సమగ్రమైన చర్చలు జరగాలి.ప్రజా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన విధానాన్ని అమలు చేయడం కుదరదు.కానీ ఇలాంటివి జరిగిన ప్రతీసారి ఉరితీయాలని,ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేయడం చూస్తున్నాము.ఇటువంటివి జరిగినపుడు ప్రజల్లో ఉన్న ఆవేశం,భాద,అత్యాచారం జరిగిన కుటుంబంకు న్యాయం చేయడానికి సులభంగా ఉన్న ఓకే ఒక మార్గం"కనిపిస్తే కాల్చివేత".దీన్ని అమలు చేయాలి.చట్టం చేయాలి.ఉరిశిక్ష కాదు ఆలస్యంగా అమలు జరగడానికి,రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడానికి,ఎన్ కౌంటర్ కాదు చట్టవ్యతిరేకమైన ప్రభుత్వ విధానం అనటానికి.సరయిన చేయగలిగిన, చట్టబద్దత కలిగిన శిక్షా విధానం"షూట్ ఎట్ సైట్"నవతరం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది.న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు క్రింద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలి.ప్రజలు ఆలోచించాలి,మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత"అమలుకు ఉద్యమించాలి,ఇదే ప్రభుత్వ విధానం కావాలని డిమాండ్ చేయాలి.

Share:

చిలకలూరిపేట పట్టణంలో 15/ 09 /2021 నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 చిలకలూరిపేట పట్టణంలో 15/ 09 /2021 నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


 చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీగా 10 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.

పండరీపురం లో 1 

తూర్పు మాలపల్లి 2 

వెంకట రెడ్డి నగర్ 1 

ఆర్టీసీ కాలనీ 1 

ఎన్టీఆర్ కాలనీ 1 

సుభాని నగర్ 2 

ఎం వి నారాయణపురం 1 

కృష్ణా నగర్ 1గా నమోదు అయ్యాయి.





Share:

చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు

 చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము  ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు


చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నాదెండ్ల మండలంలోని సాతులూరు, అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, అప్పాపురం, తూబాడు గ్రామాలు, చిలకలూరిపేట పట్టణంలోని పాత వార్డు లు   08, 22, 31 అసంబద్దంగా పోలింగ్ బూత్  మార్పుల   ఫై  వివరాలతో సహా వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై సదరు అధికారి ఉన్నత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.  తెలుగుదేశం  పార్టీ నేతలు మాట్లాడుతూ, గ్రామస్తులు ఫిర్యాదు చేయకుండా, ఎక్కడ ఏమి అభ్యంతరాలు లేకపోయినా ఏ రకంగా పోలింగ్ బూతులు మారుస్తారని, ఈ ఆలోచనను విరమించుకొని పక్షంలో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా శ్రీనివాసరావు, నందిగం శివ కోటేశ్వరరావు, కొండ్రగుంట సురేష్, నాగ పూర్ణచంద్ర రావు, జి.రామాంజనేయలు, ఎం.భాస్కర్ రావు, కల్లి సాంబశివరావు, నెల్లూరి హరిబాబు, షేక్ మస్తాన్ వలి (అప్పాపురం), దగ్గుమల్లి కోటేశ్వరరావు, షేక్ యాసీన్,సిరిబోయిన కోటయ్య, నజీరున్నిసా బేగం, మురకొండమల్లిబాబు, షేక్ అజారుద్దీన్, షేక్ భారీ సైదా, షేక్ ముజఫర్, షేక్ రహీమ్, శివుడు  తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు

 చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



చిలకలూరిపేట పట్టణం లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేస్తూ అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా మార్కింగ్ లైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉండే తోపుడు బళ్ళు చిరు వ్యాపారులు లైన్ దాటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తేతే వారిపై పై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ సహకరించాలని కోరారు.
















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 28-07-2021 బుధవారం నాడు మొత్తం 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో రెడ్ల బజార్లో ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఒక్క కేసు నమోదు అయ్యింది. 

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలం లో ఈ రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 





















Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో 26-07-2021,సోమవారం నాడు మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో  ఒక్క కేసు నమోదు అయింది. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో ఒక్క కరోనా కేసు కుడా నమోదు కాలేదు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

రాజు గారి పాలెం గ్రామంలో - 1

సాతులూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో యడ్లపాడు గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు అయ్యింది. 


















Share:

రేపు (26-07-2021,సోమవారం ) చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

రేపు (26-07-2021,సోమవారం )  చిలకలూరిపేట నియోజకవర్గంలో 6700 వ్యాక్సీలతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్ని వ్యాక్సిన్లు కేటాయించారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు 26-07-2021 సోమవారం నాడు మొత్తం 6,700 కోవిషిల్డ్ వ్యాక్సిన్లతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ తెలిపారు. అయితే ఎక్కడ ఎక్కడ ఎన్ని డోసులు వేస్తున్నారు అంటే ! 

చిలకలూరిపేట సిహెచ్ సి లో - 200 

చిలకలూరిపేట యు ఎఫ్ డబ్ల్యూ సి నందు - 1000

సుబ్బయ్యతోట యు పి హెచ్ సి నందు - 500

రజకకాలనీ  యు పి హెచ్ సి నందు - 500

పురుషోత్తమపట్నం యు పి హెచ్ సి నందు - 500

కావూరు పి హెచ్ సి నందు - 1000

గణపవరం పి హెచ్ సి నందు - 1000

యడ్లపాడు పి హెచ్ సి నందు - 1000

నాదెండ్ల పి హెచ్ సి నందు - 1000 డోసులు కేటాయించారు. 





































Share:

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 25-07-2021 ఆదివారం నాడు మొత్తం 6 కరోనా  అయ్యాయి. 

పండరీపురం లో - 1

గాంధీపేట లో - 1

జాలయ్య కాలనిలో - 1

రహమత్ నగర్ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 


























Share:

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు

చిలకలూరిపేట - పలు రద్దీ సెంటర్లలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలపైనా వ్యూహాలు సిద్ధం చేసిన CI రాజేశ్వరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా CI బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు. శనివారం సాయత్రం సమయంలో పట్టణంలోని పలు రద్దీ ప్రదేశాలు పర్యటించి ట్రాఫిక్ సమస్యల పైనా వ్యూహాలు సిద్ధం చేసారు. పట్టణంలోని ట్రాఫిక్ ప్రధాన సమస్యలలో ఒకటి ముఖ్యంగా మార్కెట్ సెంటర్,చలివేంద్రం బజార్ కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్న కారణంగా, అసలే కరోనా సమయంలో రద్దీ తగ్గించాలి అనే ఆలోచనతో CI రాజేశ్వరావుతో పాటుగా టౌన్ పోలీస్ సిబ్బంది పళ్ళు మార్కెట్ వ్యాపారులను పిలిచి వారితో చర్చించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని వారిని సూచించారు. తోపుడు బళ్లకు హద్దులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి అని తెలిపారు. అలాగే కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి అని తెలిపారు. కర్ఫ్యూ సమయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం అని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన తెలిపారు.  












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 24-07-2021 శనివారంనాడు మొత్తం 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్రసెంటెర్ లో - 1

సుగాలి కాలనీ లో - 2

డైక్ మెన్ కాలనీ లో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 2కేసులు నమోదు అయ్యాయి 

తూబాడు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట, యడ్లపాడు మండల గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 












Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.