మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని ప్రజలందరి దాహం తీరుస్తూ వారి నిత్య అవసరాలు  తీరుస్తున్న మన అందరి జీవనాధారం పట్టణ శివారులలో ఉన్న మన మంచినీటి చెరువు. ఇంతమందికి జీవనాధారం అయిన మంచినీటి చెరువుకు భద్రత కరువైంది. గత కొంత కాలం క్రితం చెరువు చెరువులో అకృత్యాలు ఎక్కువ అయిపోయాయి.పట్టణంలో ఇన్ని లక్షల దాహం తీరుతున్న మన మంచినీటి చెరువును పట్టించుకునే నాధుడు లేరా అని అక్కడికి వచ్చిన పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికి అయినా మునిసిపల్ కమిష్నర్ చెరువు దగ్గిర పరిస్థితిని సమీక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రానికి చెరువులో గేదెలు,మేకలు జలకాలాడటం పట్ల పట్టణ ప్రజలు ఒకింత అభద్రతకు లోనవుతున్నారు. అధికారులు వీటి పైనా తగిన చర్యలు తీసుకోవాలి అని సామాన్యులు కోరుకుంటున్నారు. 



 
Share:

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బిలాలుద్దీన్ ను పేకాట నిర్వహణ విషయంలో అధికారులు విఆర్ కి పంపారు. అయితే ఇంకమీదట జి.రాజేశ్వరావు గారు టౌన్ సీఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.శుక్రువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ పోలీస్టేషన్ నందు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. గతంలో ఆయన మొదటిగా 2004 లో అచ్చంపేట SI గా మొదలై రేపల్లె,చెరుకుపల్లి ప్రాంతాలలో SI గా విధులు నిర్వహించి తరువాత మాచర్ల CIగా , నరసరావుపేట దిశా పోలీసుస్టేషన్లో CI గా పనిచేస్తూ ఇప్పుడు మన చిలకలూరిపేటకి CIగా వచ్చారు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

డైక్ మెన్ నగర్ లో - 1

పోలిరెడ్డిపాలెం లో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సందెపూడి గ్రామంలో - 2

నాదెండ్ల మండలంలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

గిరిజవోలు గ్రామంలో - 8

నాదెండ్ల గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో  ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

Share:

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపైనా కారు ఢీ కొని వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణానికి చెందిన దేవరకొండ రాంబాబు తాతపూడి వైపు నుండి ద్విచక్ర వాహనం పైన పట్టణం వైపు వస్తుండగా వెనుక నుండి TS07GP4448 బ్లాక్ బెంజ్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. రాంబాబు బైక్ పైనుండి క్రిందపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి మృతిచెందారు.



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మెన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. గత రెండు రోజులగా ఆ ప్రాంతంలో 12 కేసులు నమోదు అవ్వగా కమిషనర్ కరోనా విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.అలాగే ఆ ప్రాంతం అంతా హైపోక్లోరిక్ సోడియం తో శానిటైజేషన్ చేపించారు. వారం రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలియజేసారు. 














Share:

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. 

యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600

నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500

గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500

కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800 

పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200

రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300

సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200

పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. 













































Share:

చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -

చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం - 

https://chilakaluripetspeednews.blogspot.com/


అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర  సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గంలో 15-07-2021 గురువారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

డైక్ మెన్ కాలనీ లో - 3

రజక కాలనీ లో - 1

సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 3

పసుమర్రు గ్రామంలో - 1

గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

తిమ్మాపురం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 






Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

పురుషోత్తమపట్నం లో - 1

మారెళ్లవారివీధి లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 10 కేసులు నమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 8

బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 1 కేసు నమోదు అయ్యింది. 

యడ్లపాడు గ్రామంలో - 1

నాదెండ్ల మండల గ్రామంలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


Share:

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు. 
 
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే. 




























Share:

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఒక దేశంలో రెండు జండాలు,రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆమరణ నిరాహారదీక్ష చేసి సంఘ విద్రోహుల చేతులో హత్య కాబడిన జనసంఘ్ పార్టీ సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పుట్టిన రోజు వేడుకలు మన నరసరావుపేట పార్లమెంట్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం చేసినందుకు ఈనాడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దు చెయ్యటం వలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుతుంది అని. ఏ నినాదంతో ఆయన మరణించారా నరేంద్రమోడీ ముఖర్జీ గారు కన్నా కళలన్ని నిజం చేసారు అని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అచ్చుకోల బ్రహ్మస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎనుగంటి నరేష్,మాదాల మణి, తేజ,రవికుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు

























Share:

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం 
మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె పరిస్థితి ఇంత వరకు ఎప్పుడు రాలేదు. మొత్తానికి మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టారు అని ఒప్పుకున్నారు.MLA గెలిచినప్పుడు సీఎం గారితో మాట్లాడి పట్టణ మునిసిపాలిటికి 50 కోట్ల రూపాయలు గ్రాండ్ ఇప్పిస్తూన్నాము అని తెలిపారు. అప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి మేము ఆమెని అభినందించాము. కానీ ఈ రోజు ఆ గ్రాంట్ రావాలి అంటే మునిసిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలి అని చెప్తున్నారు.ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని పట్టణ టీడీపీ ఆఫీస్ నందు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్సుమీట్లో తెలిపారు. 

ప్రత్తిపాటి పుల్లారావు గారు పట్టణంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పధకం తీసుకు వచ్చి అంతర్గత పైపు లైనులు 41 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చాక 1 కిలోమీటరు పని కూడా చెయ్యలేదు. 6 వ వార్డులో 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలియదా రఫాని గారు అని తెలిపారు.పట్టణంలో ఎంత అభివృద్ధి చేసిన ఒక్క మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టలేదు అని తెలిపారు.మీరు మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలి అని తెలిపారు. 
































Share:

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

చింఘిజ్ ఖాన్ పేట గ్రామంలో - 1

లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

కావూరు గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -7 

కనపర్రు గ్రామంలో - 2

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి.

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/



 

చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ అధికారులు మంగళవారం నాడు కర్ఫ్యూ అమలులో భాగంగా వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులను మూయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ పట్టణంలోని దుకాణాలు అన్ని మధ్యాహ్నం 2 గంటలకల్లా మూసివేసి మాకు సహకరించండి అని కోరారు. అన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ మన పట్టణంలో మాత్రం కరోనా కర్ఫ్యూ పాటిస్తున్నాము.అందరూ కలసి కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటే తీవ్రత తగ్గించగలిగితే ఎవరి వ్యాపారాలు వారు కొనసాగించుకోవచ్చు అని వారు తెలిపారు. 





























 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.