మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

తూబాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 8

కనపర్రు గ్రామంలో - 1

ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి

మార్కండేయనగర్ లో - 3

సాలిపేట లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 1

రాజాపేట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ అతి సమీపంలో పేకాట నిర్వహిస్తునట్లు వచ్చిన సమాచారంతో టౌన్ SI అజయ్ బాబు దాడులు నిర్వహించారు. హనుమయ్యమ్మ సత్రం పక్కనే ఉన్న విగ్నేశ్వరా కారు ట్రావెల్స్ వద్ద ఈ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మొబైల్స్, 3500 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారి పైన కేసు నమోదు చేసారు.  

Share:

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో  - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు 

https://chilakaluripetspeednews.blogspot.com/`

చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం. 

మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక  ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.

కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. 

శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది. 

అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. 

రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి. 

 ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం. 
 
Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట మండల గ్రామంలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 9 

మురికిపూడి గ్రామంలో రెండు కుటుంబాలలో ఈ తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. ఒక కుటుంబంలో 5 మరో కుటుంబంలో 4 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 1 కేసు నమోదు అయింది. 

సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యింది. 

Share:

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - సినీ నటుడు శివాజీ చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామం అయిన గణపవరం నందు పీహెచ్సి నందు సోమవారం మధ్యాహ్నం నాడు వాక్సిన్ తీసుకున్నారు. వివరాలోకి వెళ్తే  శివాజీ స్వగ్రామం చిలకలూరిపేట నియోజకవర్గం అయిన నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామం అయితే గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహనా పెంచటం కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకునట్లు అయన తెలిపారు. సోమవారం రోజున మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తి మయూరి గారు శివాజీకి వ్యాక్సిన్ వేశారు. అనంతరం డాక్టర్ గోపీనాయక్ తో మాట్లాడి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని కరోనా నుండి ప్రాణాలతో బయటపడాలి వ్యాక్సిన్ ఒక్కటే మనకి ఆయుధం అని తెలిపారు. 

Share:

సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు

సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ రోజు పట్టణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది.ఉదయం సాధారణ ఉష్ణోగ్రతతో మొదలై మధ్యాహ్నం అయ్యే సరికి 40 డిగ్రీలకు చేరింది. ఈ రోజు నుండి కర్ఫ్యూ సమయం తగ్గించిన ప్రజలు ఎవరు రోడ్ల పైన కనపడలేదు. NRT సెంటర్ , చౌత్ర,మార్కెట్ సెంటర్లు ఎండ దెబ్బకి బోసిపోయాయి. ఈ రోజుకి మాత్రం 40 డిగ్రీలు రేపటి నుండి మూడు రోజుల పాటు వరుసగా 39,38,37 డిగ్రీలు తరువాత నుండి ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. 

Share:

చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు

చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నుండి పాత పశువుల సంత వరకు ఉన్న రహదారి మధ్య ఉండే స్ట్రీట్ లైట్స్ డిస్కో లైట్లను తలపించాయి. ఆదివారం నాడు సాయంత్రం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పూర్తిగా ఆగిపోయిన కానీ ఎలాగో వెళ్తాము కానీ ఎలా వెలుగుతూ ఆగుతూ ఉంటే రోడ్ల పైన వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఒక వాహనదారుడు తెలిపాడు. అతను చిలకలూరిపేట నుండి కావూరి గ్రామం వెళ్తుండగా ఎదురుగా గేదె రావటంతో తృటిలో ప్రమాదం తప్పింది అని తెలిపారు. 

డిస్కో లైట్లను తలపిస్తున్న రోడ్డుకి సంబందించిన వీడియో 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల మండల గ్రామాలలో 11 కేసులు నమోదు అయ్యాయి 

కనపర్రు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 8 గా నమోదు అయ్యాయి 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి 

మైదవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు  నమోదు అయ్యాయి 

కొమరవల్లి పాడు లో - 2

మద్ది నగర్ లో -1

చిలకలూరిపేట మండల గ్రామాల ప్రాంతాలలో ఎటువటిని కేసులు నమోదు కాలేదు 

Share:

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అమీన్ సాహేబుపాలెం ST కాలనిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను MLA విడదల రజిని పరామర్శించారు. MLA రజిని మాట్లాడుతూ ఇలాంటి అగ్ని ప్రమాద జరగటం చాల దురదృష్టకరం అని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 5000 రూపాయల చొప్పున ఆరు కుటుంబాలకు 30,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంలో MLA తో పాటుగా గ్రామా పార్టీ అధ్యక్షుడు గుర్రం ఉపేంద్ర , మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రామా సర్పంచ్ కామినేని లలిత , కాట్రగడ్డ మస్తాన్ , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని అమీన్సాహెబ్పాలెం గ్రామము  నందు అగ్ని ప్రమాదం సంభవించింది. అమీన్సాహెబ్పాలెం ST కాలనీ లోని రామయ్య అని వ్యక్తి నీరు కాగబెట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. నీరు కాగబెట్టుకుంటుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి రామయ్య గుడిసె తగలబడింది. వెంటనే పక్కనే ఉన్న గుడిసెలకు అంటుకున్న నిప్పు రవ్వలు మొత్తం 6 గుడిసెలు బూడిదపాలైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు ఈలోపే చాల ఆస్థి నష్టం జరిగింది. రమేష్, వెంకటేశ్వర్లు, చెంచమ్మ, నాగమలేశ్వరరావు యొక్క గుడిసెలు తగలబడ్డాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాధచాయలు అలుముకున్నాయి. 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు మొత్తం 33 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

యడ్లపాడు మండల గ్రామంలో 16 కేసులు నమోదు అయ్యాయి 

బోయపాలెం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 1

జగ్గాపురం గ్రామంలో - 1

సొలస గ్రామంలో - 4

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉప్పరపాలెం గ్రామంలో - 8 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండల గ్రామాలలో 17 కేసులు నమోదు అయ్యాయి 

నాదెండ్ల గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 14

కనపర్రు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.