మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ

చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ 

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేటలో కరోనా మృతుదేహాలను తరలించటానికి భారీగా చార్జీలు వసూళ్లు పాల్పడుతున్న కారణంగా అలాంటి వాటికీ అన్నిటికి చెక్ చెపుతూ రవాణా శాఖ కిలోమీటర్ కి ఎంత వసూళ్లు చెయ్యాలో నిర్ణయించారు. వీటి నియమాలు అనుసరిస్తూ ఛార్జీలు వసూళ్లు చెయ్యాలి అని సూచించారు. వాటి వివరాలను పట్టణ మోటార్ వాహనాల తనిఖీ అధికారి నాగేశ్వరరావు గారు తలియజేసారు. 


















































Share:

చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు

 చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యశాల అయిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమవారం నాడు తసీల్ధార్ సుజాత గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా గురించి, ఒకొక్క బెడ్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు. అని వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఆసుపత్రి పైన ఫిర్యాదులు రావటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తసీల్ధార్ సుజాత గారితో పాటుగా ఎంపీడీఓ, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు  

















Share:

ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు

 ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో రోజురోజుకి మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా యువకులు, చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరిని తీసుకువెళ్లిపోతుంది. ఇది ఎలా ఉంటే ఏదో స్టేట్ గవర్నమెంటో , లేదా సెంట్రల్ గవర్నమెంటో సహాయం చేసే వరకు మనం వేచి చూస్తే మన అనుకున్న వాళ్లకు అందరూ దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. దీని కోసం ఒక చిన్న ప్లాన్ నచ్చితే పాటించండి. 

చిలకలూరిపేటలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో ఆర్ధికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ ప్లాన్ అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి వార్డు కౌన్సిలర్ వాళ్ళ వాళ్ళ వార్డులలో ఆర్ధికంగా ఉన్న వాళ్ళ దగిర నుండి వార్డు మొత్తం మీద ధాతల రూపంగా డబ్బులు పోగుచేసి ( ఎవరిని ఇబ్బంది పెట్టకుండా). అన్నదానం, రక్త దానం, గోదానం, కన్నా ప్రాణ వాయువు దానం ముఖ్యం అని తెలియ చేయండి. ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వార్డుకి 5 వచ్చేలా కొనాలి. మనం రోజుకి ఆక్సిజెన్ లేక పేట మొత్తం మీద 10 మంది చనిపోతున్నారు అనుకుందాం. 38 వార్డులు * 5 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు = 190 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వస్తాయి. వీటి వల్ల చాలా మందిని రక్షించిన వాళ్ళము అవుతాము. 

ఈ అంశాన్ని శాసనసభ్యురాలు గారికి కానీ, మునిసిపల్ కమిష్నర్ గారికి కానీ, ఛైర్మెన్ గారికి కానీ వివరించండి. తప్పుగా అనుకోకుండా మొన్న విజయోత్సవ ర్యాలీ ఖర్చు మొత్తం మునిసిపల్ బిల్లు పెట్టి ఆమోదించారు. అలాగే దీన్ని కూడా  అలాగే చేసి వార్డుకి మునిసిపాలిటీ  పరంగా 2 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు ఇచ్చిన మిగిలినవి దాతల రూపంలో తీసుకొని వార్డులోని ప్రజలకు ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడినవాళ్ళం అవుతాం. ఎన్నికలలో చాల డబ్బు ఖర్చు చేస్తున్నాం, ఎన్నో ఎన్నో దానాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. 

రాష్ట్రంలో ఏ ప్రాంతం వారు అయిన ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాల ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, కమిటీలు,  చాలా ఉన్నాయి. వాళ్ల్లు అందరూ ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి. 


ఒక్క వార్డు లో అయినా ఈ ప్లాన్ అమలు చేస్తారు అని ఆశిస్తూ - CHILAKALURIPET SPEED NEWS 

    



















Share:

చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి

చిలకలూరిపేట ASI శ్రీరాములు గారు అనారోగ్యంతో మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట అర్బన్ పోలీస్టేషన్లో ASI గా విధులు నిర్వహిస్తున్న దేవినేని శ్రీరాములు(60) గారు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం RTC కాలనీ లో నివాసం ఉంటున్న అయన స్వస్థలం వట్టిచేరుకు మండలం ముట్లూరి గ్రామము. అయన మృతుదేహాన్ని ముట్లూరు తరలిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగున్నర  సంవత్సరాలుగా పట్టణంలో ASI గా పని చేస్తున్నారు.
అయన మరణవార్త విన్న SI, CI మరియు పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసారు.  






















Share:

నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్

నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ( 52 ఎకరాలలో) టిడ్కో వసతి సముదాయం నందు కరోనా వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు గా  ఉన్న వాళ్లు అందరూ  ఉచితంగా సేవలు చేస్తుంటే, సామాజిక మాధ్యమాలలో ఎంట్రీ ఫీజు 1000 చెలించాలి అని అబద్దపు ప్రచారం చేస్తున్నారు అని డాక్టర్ గోపి నాయక్ గారు ఆవేదన వ్యక్తం చేసారు. నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలను సామజిక మాధ్యమాలలో ప్రచారం చేసేవారి పైన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిరియాదు చేసాము అని తెలియచేసారు. పగలు రాత్రి తేడా లేకుండా మంచి భోజన సదుపాయాలు, అందజేస్తున్నామని, కరోనా బారిన పడినవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియచేసారు. అలాగే గతంలో 500 మందికి ఇక్కడ వైద్య సదుపాయాలు అందజేశాము, కానీ ఇప్పుడు 200 మందికి మాత్రమే అనుమతి అవి కూడా ఫుల్ అయ్యాయి అని తెలిపారు. త్వరలో ఇంకో 300 మందికి సదుపాయాలు ఎర్పాటు చేస్తాము అని తెలియచేసారు . 

అలాగే కరోనా టెస్టు చేపించిన వారికీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కానీ ID నెంబర్ ఇస్తారు. ఆ ID నెంబర్ ఉన్న వాళ్ళని అనుమతి ఇస్తున్నాము అని తెలిపారు. ప్రైవేట్ టెస్టులు చేసి ID నంబర్లు ఇవ్వకుండా గవర్నమెంట్ కు లెక్క చెప్పకుండా  ప్రజల దగిర డబ్బులు ఎక్కువగా దండుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.   














Share:

చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం

https://chilakaluripetspeednews.blogspot.com/


నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం కారును ఢీ కొట్టినది.  ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయినది. విషయం తెసుసుకున్న యడ్లపాడు SI రాంబాబు గారు ఘటన స్థలానికి వచ్చి ట్రఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. గాయపడిన వారిని  స్థానికులు ప్రైవేట్ వాహనంలో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. 



















Share:

చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !

చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా యువకులు చనిపోవటంతో ఆయా ప్రాంతాలు బయాందోనళకు గురి అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కరొనతో మరో యువకుడు గుండా వెంకటేశ్వరరావు (27)  చనిపోయారు. పట్టణంలోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటూ ఇంట్లోనే అకౌంటెంట్ & టాక్స్ కన్సల్టెంట్స్ నడుపుతున్నారు. కొన్ని రోజులు గా కరొనతో బాధపడుతూ శుక్రవారం నాడు మూడు హాస్పిటల్స్లలో చికిత్స కోసం  తిరిగిన ఎవరు జాయిన్ చేపించుకోలేదు. ఆక్సిజెన్ అంధక శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సమయానికి ఆక్సిజెన్ దొరికితే బ్రతికి ఉండొచ్చు అని తెలియజేసారు.

                                                                                      మా మిత్రుని మృతుకి సంతాపం తెలుపుతూ 

                                                             chilakaluripet sepped news & ఫ్రెండ్ సర్కిల్   



   








 

Share:

చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.

చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత. 

https://chilakaluripetspeednews.blogspot.com/

నిన్న జరిగిన కౌంసిల్ సమావేశంలో చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు టీడీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు. 

72 సంవత్సరాల క్రితం చిలకలూరిపేట ప్రజల సౌకర్యార్ధం అప్పటి పంచాయితీ సర్పంచ్ గా ఉన్న మైలవరపు గుండయ్య గారి ఆధ్వర్యంలో కురగాయల మార్కెట్ ను ఏర్పాటు చేసారు. గుంటూరు జిల్లలో అప్పటి మంత్రిగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు , బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో 1937 లోనే మద్రాసు ఫ్రాన్సిస్ యందు శాసనసభకు ఎన్నిక అయి దేవాదాయ మంత్రిగా పని చేసిన గణణీయుడు శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి గుర్తుగా 1948లో  అయన పేరు  నామకరణం  చేసారు. ఈ రోజు పాలకవర్గం అయన పేరుని మర్చి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ గా మార్చటాన్ని టీడీపీ కౌంసిల్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు. దేశం కోసం ఏడు సార్లు జైలు జీవతాన్ని గడిపిన అయన పేరు మార్చటం దారుణమని. అలాగే పట్టణంలో చేపట్టే నూతన భవనాలకు వైఎస్ఆర్ పేరు పెట్టకుంటే తమకి అటువంటి అభ్యంతరం లేదు అని పట్టణంలో 7 పురపాలక సంఘాలు ప్రతినిత్యం వాహినప్పటికీ ఏ పాలకవర్గం ఎలాంటి పనులు చెయ్యలేదు అని స్వాత్రంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను గౌరవించకపోయిన కానీ అవమానించ వద్దు అని  తెలియచేసారు. ఇది చిలకలూరిపేటలో చెడు సంప్రదాయాలకు దారి తీస్తుంది అని తెలియచేసారు. ఛైర్మెన్ రఫాని ,కమిష్నర్ రవీంద్ర గారికి లేఖలు అందించారు. 















Share:

చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు

 చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కృష్ణారెడ్డి డొంక నందు గుట్కా, ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 3500 పాకెట్లను సీజ్ చేసారు అధికారులు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


































 

Share:

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట శాలిపేట నందు ఉన్న డిస్పెన్సరీ వద్ద వ్యాక్సిన్ కోసం గుంపులు గుంపులుగా ప్రజలు. కరోనా భయంతో ప్రజలు వ్యాక్సిన్ బాట పట్టారు కానీ వెళ్ళే చోటే కరోనా ప్రమాదం పొంచి ఉన్నది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని రోజు టీవీలలో, మైకులలో,అవగాహన కలిపిస్తుంటే. వీరు మాత్రం ఇలా ! , వాక్సిన్ వేసుకుంటే కరోనా భయం తగ్గుతుంది కానీ వాక్సిన్ ఉన్న ఏరియాలో ఉంటే కరోనా రాదు అని ఎవరు చెప్పలేదు కదా ! వ్యాక్సిన్ ప్రక్రియ రెండు రోజులలో అయిపోతుంది అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇలా ఉన్న చోటే కరోనా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నాకు లేదు కదా అనుకుంటే పొరపాటే ప్రక్కవాడికి  ఉంటే మీరు ఏంచేస్తారు. వ్యాక్సిన్ వేపించుకున్నాం అని అనుకున్నటున్నారు కానీ దగర ఉండి కరోనని ఇంటికి తీసుకువెతున్నాం అని ఎవరు ఏలోచించటం లేదు అని తెలిపే చిత్రం ఇది.    



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఒకప్పటి దేవాదాయ మినిస్టర్ అయిన కల్లూరి చంద్రమౌళిగారి చేతుల మీదుగా అప్పటి చిలకలూరిపేట పంచాయితీ లో మొదటిసారిగా ఎర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ కు గుర్తుగా చంద్రమౌళి కూరగాయల మార్కెట్ గా నామకరణం చేసారు. ఈ రోజు జరిగిన కౌంసిల్ సమావేశంలో షేక్ రాఫ్ఫాని గారి అధ్యక్షతన సభ్యుల ఆమోదం మేరకు చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరును వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్చారు. 

















Share:

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


యడ్లపాడు భూషయ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్- వివరాల్లోకి వెళ్తే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద TSRTC బస్సు నందు నిర్వహించిన తనిఖీలలో 100 రెమిడేసివర్ ఇంజక్షన్ లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ దాదాపు బ్లాక్ మార్కెట్లో 45 లక్షలు ఉండవొచ్చు అని అంచనా. పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నందు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న భవ్య  ద్వారా తీసుకువస్తునట్లు సమాచారం. రేపు ఆమెని కూడా విచారించి ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని విచారణ చెయ్యనున్నారు. అసలు కరోనా కేసులు ట్రీట్మెంట్ చెయ్యటనికి గుర్తింపు లేని హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఎలా వైద్యం అందిస్తారు అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.  
















Share:

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ  ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.   













Share:

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి 

http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ 

పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది. 











Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.