మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణములోని రాగన్నపాలెంలో కరోనా కారణంగా పాస్టర్ మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కరాలకి హాజరైన పలువురు కరోనా అనుమానితులుగా ఉన్న సందర్భంలో స్థానికుల కోరిక మేరకు నిన్న గురువారం నాడు కరోనా  టెస్టులు నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ అధికారి   గోపి నాయక్ గారు మాట్లాడుతూ రాగన్నపాలెం చుట్టుపక్కల ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వచ్చి టెస్టులులలో పాల్గొని పాజిటివ్ వస్తే తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు   

























Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు

 చిలకలూరిపేటలో  ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి నరసరావుపేట సెంటర్ నందు కిచిడి తినేందుకు వచ్చి వాహనాన్ని కిచిడి సెంటర్ ముందు పార్క్ చేసి వెళ్లి వచ్చిన క్రమంలో సదరు వాహనదారుడు  ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్లే సమయంలో అనూహ్యంగా వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనదారుడు బైక్ ను క్రిందపడ వేసి భయంతో దూరంగా పరుగుతీసాడు.ఇదంతా చుసిన స్థానికులు వాహనం పైన నీరు చల్లి మంటలు అదుపుచేశారు. 





Share:

చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత

 చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం  ఈ ప్రాంతాల వారికి  కరెంటు కోత 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో రేపు గురువారం 15-04-2021న మరమ్మతుల కారణంగా  విద్యుత్ సరఫరా అంతరాయం ఎర్పడుతుంది. పట్టణంలోని చౌత్రసెంటర్ , షరాఫ్ బజార్,యల్లయ్య హోటల్ రోడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్,పద్మసాలిపేట , గబ్బిటివారి వీధి, హైస్కూల్ రోడ్ , శివాలయం బజార్,మెయిన్ రోడ్ నందు రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు  విద్యుత్ అంతరాయం ఎర్పడుతుంది. 









Share:

చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు

 చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  గారి 130 వ జయంతి వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తేళ్ల సుబ్బారావు గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ గారు మాట్లాడుతూ  న్యాయవాదిగా,ఆర్ధికవేత్తగా,రాజ్యాంగ నిర్మాతగా భారతీయ్యుల గుండెలో ఎప్పటికి చెరగని ముద్రవేసుకున్నారు అన్నారు. అలాగే ఈరోజు రిజర్వేషన్ ద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు ఎంత లబ్ది పొందుతున్నారో అవన్నీ అంబెడ్కర్ గారి వలన అని ఆయనని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులూ, పెద్దలు, పాల్గొని జయప్రదం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. 













Share:

చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/


నిన్న మొన్నటిదాకా వాక్సిన్ అంటే అంతగా మొగ్గుచూపని పట్టణవాసులు కరోనా కేసుకు రోజు రోజుకి పెరుగుతున్నందువల్ల  ఈ రోజు బుధవారం నాడు మొదలుపెట్టిన వాక్సినేషన్ ప్రక్రియకు జనాలు బారులు తీరారు . అయితే వాక్సిన్ ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే " పట్టణంలోని AMG బాయ్స్ హాస్టల్ వద్ద రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం నందు మరియు సుబ్బయ్యతోట - పద్మసాలిపేట డిస్పెన్సరీ నందు, అన్ని వార్డు,గ్రామా సచివాలయాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు " ఈ రోజు ప్రారంభించిన వాక్సిన్ ప్రక్రియను ఛైర్మెన్ రాఫ్ఫాని గారు, కమిష్నర్ రవీంద్ర గారు  పరిశీలించారు. అలాగే నోడల్ వైద్యధికారి గోపీనాయక్ గారు పట్టణంలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయినది ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలిపారు.  













Share:

చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన

చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో  భయాందోలన 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణములోని రాగన్నపాలెంలో స్థానికంగా ఉన్న ఒక చర్చ్ నందు పాస్టర్గ్ ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈస్టర్ పండుగ నాడు రాగన్నపాలెం చర్చ్ నందు ప్రార్ధన నిర్వహించటానికి వచ్చిన వేలూరు గ్రామానికి చెందిన పాస్టర్  పని ముగించుకొని రాగన్నపాలెం ఉన్న పాస్టర్ని పలకరించి వేలూరు వెళ్లిపోయారు. శనివారం నాడు రాగన్నపాలెం పాస్టర్ కరొనతో  మృతి చెందారు. ఆయన స్వగ్రామం వూనురు. అంతిమసంస్కారాలకి ఆయనను పూనూరుకి తరలించారు. ఆయన అంతిమసంస్కరరాలకి రాగన్నపాలెం నుండి 50 మందికి పైగా పాల్గొన్నారు. వేలూరు పాస్టర్ కి ఆరోగ్యం బాగోలేక మంగళవారం నాడు మృతి చెందారు. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.ఇక రాగన్నపాళెం వాసులకి భయం పట్టుకుంది.స్థానికులు రాగన్నపాలెం నందు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శానిటైజ్ చెయ్యాలి అని అధికారులని కోరారు.  










Share:

అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పాటిమీద ప్రాంతం నుండి పర్చూరు మండలం శ్యామలవారిపాలెం గ్రామం నందు మిరపకాయల కోతకు కూలీ పనికి వెళ్తుటారు. ఈ క్రమంలో 10 మంది కూలీలు కలిసి వెతున్న ఆటో అన్నంబొట్లవారిపాలెం వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వద్ద ఆగి ఉన్న ఆటో ని డీ కొట్టాడు డ్రైవర్ అంకమ్మరావు. ఆటోలో ఉన్న మహిళా ఫరింభి అక్కడకిఅక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు హుటా హుటిన వచ్చిన 108 సిబంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులని పేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. 









Share:

13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

13-04-2021 మంగళవారం  నాడు  చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు, రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర వ్యాప్తగా , జిల్లా వ్యాప్తంగా మంగళవారం  నాడు భారీ గా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తగా 4228 కేసులు నమోదుకాగా, జిల్లాలో 622 కేసులు నమోదు అయ్యాయి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గం లో 20 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆంక్షలు తప్పవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేవాళ్లు పరిస్థితి చాల దారుణంగా అవుతుంది. కావున మాస్క్ వాడండి . సోషల్ డిస్టెన్స్ పాటించండి. చిలకలూరిపేట కరోనా ఫ్రీగా ఉండటానికి మన అందరం సహకరించుదాము . 


నాదెండ్లలో 2 కేసులు,సాతులూరు 2 కేసులు , గణపవరం 5 కేసులు , పసుమర్రు గ్రామం లో 2 కేసులు, ఈవూరివారిపాలెం 1 కేసు, యడ్లపాడు 4 కేసులు , లింగారావు పాలెం 1 కేసు, పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 



















Share:

చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన

 చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన 


https://chilakaluripetspeednews.blogspot.com/

మొన్న జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం లో ఛైర్మెన్ రఫాని గారు చౌత్రసెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చెయ్యటానికి ఆమోదం తెలిపారు. అలాగే ఉగాది పర్వదినము రోజున చౌత్రసెంటర్ నందు ఆంజనేయ స్వామి గుడి వద్ద  పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో విడదల గోపి గారు, ఛైర్మెన్ రఫాని గారు, వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు ఆనాడు చేసిన త్యాగాలని తలుచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ని గుర్తుచేసుకున్నారు  ఈ కార్యక్రమానికి వార్డ్ కౌసిలర్లు , వైస్సార్సీపీ నాయకులూ పాల్గొన్నారు . 

https://chilakaluripetspeednews.blogspot.com/





















Share:

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 


https://chilakaluripetspeednews.blogspot.com/
https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు కొత్త సంవత్సర శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు. నిన్న సౌదీ అరేబియా నందు రంజాన్ నెలవంక కనిపించింది. దీనితో  ముస్లింలకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానున్నది.




 

Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో కొన్ని రోజులగా  మునిసిపాలిటీ ద్వారా అందించే మంచి నీరు రంగు మారుతూ వస్తున్నాయి. దీనిపైనా ఇప్పటికే మునిసిపల్ కమీషనర్ రవీంధ్ర గారు వివరణ ఇచ్చారు. అధికంగా ఫ్లోరిన్ , బ్లీచింగ్ కలపటం వలన రంగు మారుతోంది అని చెప్పారు. కానీ వివరణ ఇచ్చి నాలుగురోజులు అయినా ఇప్పటికి నీరు అలాగే వస్తున్నాయి. దీనికి త్వరగా పరిష్కారం ఆలోచించాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అసలే ఒక వైపు కరోనా భయం మరొకపక్క ఈ నీరు తాగితే కలరా లాంటి వ్యాధుల బారిన పడతామేమో అని భయపడుతున్నారు పుర ప్రజలు.  








Share:

జిల్లాలో భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి

జిల్లాలో  భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి


https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన 24గంటలలో రాష్ట్రంలో 31,268 మందిని పరీక్షించగా వారిలో 2558 కేసులు నమోదు అయ్యాయి, అతధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పముగా పశ్చిమ గోదావరి జిల్లా 37 కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 








Share:

చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

 చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు బేకరీలు,రెస్టారెంట్లు,ఆయిల్ మిల్లు, సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. తహశీల్ధార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అధికారులు పట్టణంలోని రత్నబేకరీ,సురక్ష స్టోర్స్, బిర్యానీ హౌస్, హోటల్స్,రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి ఆహార నాణ్యత పరిమాణాలు, తయారీ రూమ్ లో శుభ్రత లో ఏ మాత్రం లోపించిన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. 







Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.