మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన

 చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన 

https://chilakaluripetspeednews.blogspot.com/

మొన్న జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం లో ఛైర్మెన్ రఫాని గారు చౌత్రసెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చెయ్యటానికి ఆమోదం తెలిపారు. అలాగే ఉగాది పర్వదినము రోజున చౌత్రసెంటర్ నందు ఆంజనేయ స్వామి గుడి వద్ద  పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో విడదల గోపి గారు, ఛైర్మెన్ రఫాని గారు, వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు ఆనాడు చేసిన త్యాగాలని తలుచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ని గుర్తుచేసుకున్నారు  ఈ కార్యక్రమానికి వార్డ్ కౌసిలర్లు , వైస్సార్సీపీ నాయకులూ పాల్గొన్నారు . 

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 

https://chilakaluripetspeednews.blogspot.com/
https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు కొత్త సంవత్సర శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు. నిన్న సౌదీ అరేబియా నందు రంజాన్ నెలవంక కనిపించింది. దీనితో  ముస్లింలకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానున్నది.

Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో కొన్ని రోజులగా  మునిసిపాలిటీ ద్వారా అందించే మంచి నీరు రంగు మారుతూ వస్తున్నాయి. దీనిపైనా ఇప్పటికే మునిసిపల్ కమీషనర్ రవీంధ్ర గారు వివరణ ఇచ్చారు. అధికంగా ఫ్లోరిన్ , బ్లీచింగ్ కలపటం వలన రంగు మారుతోంది అని చెప్పారు. కానీ వివరణ ఇచ్చి నాలుగురోజులు అయినా ఇప్పటికి నీరు అలాగే వస్తున్నాయి. దీనికి త్వరగా పరిష్కారం ఆలోచించాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అసలే ఒక వైపు కరోనా భయం మరొకపక్క ఈ నీరు తాగితే కలరా లాంటి వ్యాధుల బారిన పడతామేమో అని భయపడుతున్నారు పుర ప్రజలు.  

Share:

జిల్లాలో భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి

జిల్లాలో  భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి

https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన 24గంటలలో రాష్ట్రంలో 31,268 మందిని పరీక్షించగా వారిలో 2558 కేసులు నమోదు అయ్యాయి, అతధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పముగా పశ్చిమ గోదావరి జిల్లా 37 కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 

Share:

చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

 చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు బేకరీలు,రెస్టారెంట్లు,ఆయిల్ మిల్లు, సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. తహశీల్ధార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అధికారులు పట్టణంలోని రత్నబేకరీ,సురక్ష స్టోర్స్, బిర్యానీ హౌస్, హోటల్స్,రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి ఆహార నాణ్యత పరిమాణాలు, తయారీ రూమ్ లో శుభ్రత లో ఏ మాత్రం లోపించిన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. 

Share:

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్రంలో కరొన కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 2331 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు అయ్యాయి. 11 మంది చనిపోయారు. కరోనా నియంత్రం చర్యలు ప్రతిఒక్కరు పాటించాలి. మళ్ళి లాక్ డౌన్ అమలు చేస్తే, రెక్కాడితే డొక్కాడని వారి పరిస్థితి ఆలోచించండి. 

Share:

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్

 తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికలలో 2 అసెంబ్లీ స్థానాలు దక్కిన్చుకున్న తెలంగాణ టీడీపీ ఆ ఎన్నికలలో భారీ పరాభవాన్ని చవిచూసింది. సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి, మచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట నుండి గెలిచారు. ఇప్పటికే సండ్ర తెరాస పార్టీ జండా కప్పుకోగా. ఈ రోజు మచ్చ  నాగేశ్వరావు TRS లో చేరుతున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ రాసారు. ఈ దెబ్బతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒకింత షాక్ కి గురి అయ్యారు. 

Share:

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఎత్తివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తరువులు ఇచ్చింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేసారు అధికారులు. తదుపరి విచారణ  కౌంటింగ్ లెక్కింపు  ఉండదు అని స్పష్టం చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జడ్పిటిసి , 7258 ఎమ్పిటిసి స్థానాలకు గాను 2092 మంది జడ్పిటిసి, 19002 ఎంపిటిసి అభ్యర్థులు పోటీ చేయనున్నారు, 

Share:

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళ్లే మార్గంలోని మానుకొండవారిపాలెం , దండమూడి జంక్షన్ వద్ద చిలకలూరిపేట వస్తున్నహోమ్ గార్డ్ నిరీక్షణరావు ని నందిపాడు వైపు గా వెళ్తున్న మహేంద్ర మినీ వ్యాను ఢీ కొని మరణించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఎంవి నారాయణపురం లో నివాసం ఉంటున్న వేముల నిరీక్షణరావు (46) గతం లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నందు హోమ్ గార్డ్గా  విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి డిప్యుటేషన్ పైన గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ నందు పని చేసున్నారు. అయితే ఈస్టర్ పండుగ సందర్భంగా స్వగ్రామం అయిన గరికపాడు లోని పెద్దల సమాధులకు రంగులు వేపించటానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినది. ప్రమాద సమయములో నిరీక్షణరావు హెల్మెట్ పెట్టుకున్నారు. కానీ అది పగిలిపోవటం వలన తలకు బలమైన గాయం తో అక్కడికి అక్కడే చనిపోయారు. పట్టణ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని పట్టణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తోటి హోమ్ గార్డులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఉదయమే తమతో పాటుగా కరోనా వ్యాక్సిన్ వేపించుకున్నాడు ఇంతలో ఇలా జరగటం ధిక్బ్రాంతి లోనయ్యారు. మృతుడికి ఒక పాప,ఒక బాబు, వారి భార్య సన్నిధి గారు ఆర్టీసీ నందు కండక్టర్ గా పనిచేస్తున్నారు. 

Share:

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి.

  చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ నందు బుధవారం నాడు సెస్ వసూళ్లు చేసుకునే హక్కుల వేలం నిర్వహించారు. గతంలో చంద్రమౌళి కూరగాయ మార్కెట్ హక్కుల విలువ 7 లక్షల రూపాయలు సంవత్సరానికి , 2021 సంవత్సరానికి గాను సర్కారివారి పాట నెలకు 90,420 గా నిర్ణయించారు. విడదల శేషగిరిరావు గారు 1,12,000 రూపాయలకి దకించుకున్నారు. ఆ లెక్కన సంవత్సరానికి 13,44,000 రూపాయలు అవుతుంది  గతం తో పోలిస్తే ఇది చాల ఎక్కువ . అలాగే సండ్రీ మార్కెట్, చేపల& మాంసము మార్కెట్ కు కూడా వేలం నిర్వహించారు. ( 1-04-2021 నుండి 31-03-2021 వరకు ) సండ్రీ మార్కెట్ సర్కారి వారి పాట 17,60,000 కాగా షేక్ నాసర్ వలి 17,64,000 గా , చేపల&మాంసము మార్కెట్ సర్కారు వారి పాట 1,60,000 కాగా షేక్ అబ్రహం 1,65,000 కి దక్కిన్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముసిపల్ అధికారులు, కమిషనర్ పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల మార్క్ ని టచ్ అయింది. పట్టణ ప్రజలు రోడ్లు బయట తిరగకుండా లాక్ డౌన్ రోజులని తలపిస్తున్నాయి.  రోజు రోజు కి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఇలా ఉంటే రేపు వచ్చే రోహిణి కార్తీలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేసేలా ఉంది. ఇప్పటికే విద్యార్థులకు స్కూళ్లు కి ఒంటిపూట బడులు మొదలుపెట్టటం వలన కొంచం ఇబ్బంది తెగినట్లే. ఇక ముసలివాళ్ళు సంగతి చెప్పే పనే లేదు ఉదయం వడగాలులు, సాయంత్రానికి ఉక్క,చమటలు తో సతమతం అవుతున్నారు. ఏది ఏమి అయినా పొద్దునే 11 గంటలకల్లా బయటపని చూసుకోవటం.  సాయంత్రం 5 గంటల వరకు బయటకి రావొద్దు. ఇక రోజువారీ కూలి పని చేసుకునే వారు, ముఠావారు, ఉద్యోగులు నీడ పట్టున ఉండటానికి ట్రై చెయ్యండి.  

Share:

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు  

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం మీదుగా వచ్చే కుప్పగంజి వాగు లోకి కలుపుతున్నారు. అందువలన వాగులో నీరు కాలుష్యం ఎర్పడి రంగు మరి , అందులో ఉండే జలచరాలు చేపలు,కప్పలు భారీగా చనిపోతున్నాయి, అంతేకాకుండా ఆ వాగు నుండి వచ్చే నీరును మానుకొండవారిపాలెం , ఏలూరు ప్రజలు పంటల సేద్యానికి వాడుతుంటారు, కొందరు త్రాగునీరుగా వాడుతుంటారు. అయితే అక్కడి గ్రామ ప్రజలు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి  నిరసనగా ధర్నా చేపట్టారు. దాని వలన  రోడ్లు పైన ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. విషయం తెలుసుకున్న MLA రజని గారు హుటా హుటిన అక్కడికి చేరుకొని వాగుని పరిశీలించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

దీనిపైనా స్పందించిన రజని ఈ కాలుష్యానికి కారణం అయిన  కంపెనీల పైన తగు చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అలాగే ఆయా నీటిని శాంపిల్ తెలుసుకొని ల్యాబ్ కి పంపాలి అని ఆదేశించారు, రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని , ఏ కంపెనీ నుండి వ్యర్ధాలు నీటిలో కలవకూడదు అని , నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది అని, MLA రజని తో పాటుగా పోలీస్,పొల్యూషన్ అధికారులని, తహశీల్ధార్ సుజాత గారు,అక్కడికి చేరుకున్నారు. 

పొల్యూషన్ అధికారి AE శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంపిళ్లను విజయవాడ ల్యాబ్ లకు పంపారు అని, ఒక వారం రోజులలో రిపోర్ట్స్ వస్తాయి అని, అప్పుడు ఆయా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటాం అని అవసరం అయితే మూసివేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటికిగాని గ్రామ ప్రజలు శాంతించారు. ఈ ధర్నాలో గ్రామా పెద్దలు , గ్రామ సర్పంచ్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు . 
https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు  కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు గారిని చిలకలూరిపేట టౌన్ SI గా, అలాగే గుంటూరు రూరల్ డి ఎస్ బి గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ళ మోహన్ రెడ్డి గారిని చిలకలూరిపేట రూరల్ SI గా  బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Share:

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు  విశిష్టమైన సేవలు అందించిన SI పైడి రాంబాబు గారికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక  ధన్యవాదాలు.  లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం పైన ఉక్కు పాదం, పేకాట శిబిరాల పైనా దాడులు,  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టలు వేసి, విధి నిర్వహణలో తనకి తానే సాటి అనీ విధంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ పోలీస్ SI రాంబాబు గారు యడ్లపాడు SI గా బదిలీ అయ్యారు. ఎక్కడ ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటు -- చిలకలూరిపేట ప్రజల తరుపున CHILAKALURIPETA SPEED NEWS తరుపున శుభాకాంక్షలు. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.