మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి

 చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు  లోనే  ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి



అంబులున్స్ లోనే డెలివరీ 

పట్టణంలోని డైక్మెన్ కాలనీ కి చెందిన  వెంకటేశ్వరమ్మ   అన్నే మహిళా శుక్రవారం అర్ధరాత్రి నాడు 108 వాహనం లోనే ఆడపిల్లకి జన్మనిచ్చారు . వివరాలలోకి వెళ్తే వెంకటేశ్వరమ్మ మహిళకి అర్ధరాత్రి నాడు పురిటినొప్పులు ఏక్కువ అయ్యాయి . ఆయా సమయం లో 108 వాహనానికి కాల్ చెయ్యగా హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించే సమయంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి . 108 సిబ్బంద్ది శోభన్ బాబు , ఖమీర్ మియ వాహనాన్ని రోడ్ పక్కకి ఆపి పురుడు పోశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం గా ఉన్నారు . వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 


Share:

చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!

చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!


https://chilakaluripetspeednews.blogspot.com/
గంగా శ్రీనివాసరావు 

చిలకలూరిపేట లో గడిచిన మునిసిపల్ ఎలెక్షన్లలో 38 వార్డులకు గాను 30 వార్డులు వైస్సార్సీపీ , 8 వార్డులు టీడీపీ విజయం సాధించాయి . అయితే మునిసిపల్ ఛైర్మెన్ గా రఫాని గారిని, వైస్ ఛైర్మెన్ గా  కొలిశెట్టి శ్రీనివాసరావు ని ఎన్నుకున్నారు . ప్రతిపక్ష నేతగా ఎవరిని నియమిస్తారు అని ఎవరిని నియమించాలి అనే ఆలోచనలో వున్నా టీడీపీ అధిష్టానం కి 8 లో 7గురు మహిళలు ఒక్కరు పురుషులుగా ఉన్నారు . ప్రతిపక్షనేతగా గంగా శ్రీనివాసరావు గారిని నియమించినట్లు తెలుస్తుంది . గంగా శ్రీనివాసరావు గారు గణపవరం 4వ వార్డ్  లో తన సమీప అభ్యర్థి కాటా వెంకటేశ్వర్లు గారిపై  117 ఓట్ల మెజారితో గెలిచారు 

Share:

చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !

 చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా  .. !


లవర్స్ ట్రీ 

పైన ఫోటో లోని  లొకేషన్ చూసి  ఇది ఎక్కడో ఊటీనో  , కొడైకెనాలోనో  లేదా సిమ్లా , కాశ్మీర్ అనుకుంటే పొరపాటు పడినట్లే . ఈ లొకేషన్ మన చిలకలూరిపేటలోనే ఉంది . ఎక్కడ అని  ఆలోచించకండి . నేనే చేపుతాను. మన మంచినీటి చెరువుకి వెళ్ళేదారిలో KGF ధాబా  కి 100 అడుగుల దూరం ఉంది  ఈ లొకేషన్ . పోదు పొద్దునే వాకింగ్ కి వెళ్ళివాళ్ళు  ఈ ట్రీకి లవర్స్ ట్రీ అని పేరు కూడా పెట్టేసారు . కేవలం ఈ లవర్స్ ట్రీ ని చూడటానికి కూడా పొద్దునే చాల మంది వస్తున్నారు . ఇంక ఎందుకు ఆలస్యం మీరుకూడా ఒక లుక్ వేసి రండి .

 మీకోసం ఇంకొన్ని ఫొటోస్ 









Share:

చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు 



చిలకలూరిపేట మండల పరిధిలోని కుక్కపల్లివారి గ్రామములో పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకున్నారు రురల్ ఎస్ఐ భాస్కర్ గారు . ఈ సందర్బంగా ఆయనా మాట్లాడుతూ ఎక్కడైనా పేకాడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు . కుక్కపల్లివారిపాలెం గ్రామము నందు ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1800 రూపాయల నగదుని సీజ్ చేసారు ..  


Share:

వాట్సాప్ ఆగిపోయింది

  వాట్సాప్ ఆగిపోయింది

వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి . ఈ రాత్రి సుమారు 11 గంటల నుండి  వాట్సాప్ మెసెంజర్ యాప్ సేవలు నిలిచిపోయాయి . ఆండ్రాయిడ్ ,  ఐఫోన్ , విండోస్ , బ్లాక్బెర్రీ మొబైల్స్ లో సేవలు ఆగిపోయాయి . దీనికి  కారణం తెలియలిసివుంది . మేజర్ మెసెంజర్ యాప్ ఆగిపోవటం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు యూజర్స్ . 



Share:

గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది

 గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది 


ప్రతిష్టాత్మక గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది . అయితే ఈసారి మేయర్ పదవులు ఇద్దరిని వరించాయి . నిన్నా ప్రమాణంస్వీకారం చేసిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారితో పాటుగా పాదర్తి రమేష్ గాంధీ గారిని కూడా మేయర్ పదవి వరించింది . మొదటి రెండున్నర సంవత్సరాలు మనోహర్ నాయుడు గారు మిగిలిన రెండున్నర సంవత్త్సరాలు రమేష్ గాంధీ గారు చేపడతారు అని నిన్న కాన్వెంక్షన్ హాలులో  జరిగిన సమావేశం అనంతరం గుంటూరు జిల్లా ఇంచార్జి అయిన చెరుకువాడ శ్రీరంగనాధం గారు ప్రకటించారు . 

Share:

చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం

చిలకలూరిపేట మున్సిపల్ రెండవ  వైస్ ఛైర్మెన్ ను  ప్రకటించే అవకాశం 


గతంలో ఒక డిప్యూటీ మేయర్ మరియు ఒక వైస్ ఛైర్మెన్ మాత్రమే ఉండేవారు . కొత్తగా వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్సు ప్రకారం ఇద్దరు డిప్యూటీ మేయర్లు , ఇద్దరు వైస్ ఛైర్మన్లను ఎన్నుకొనే  అవకాశం కలిపిస్తూ గవర్నర్ అప్రూవల్ కోసం చూస్తున్నారు.ఈ ఆర్డినెన్సు అప్రూవల్ అయితే అన్ని కార్పొరేషన్ లలో మరియు మునిసిపాలిటీలలో అధనంగా ఇంకొకరికి అవకాశం ఉంటుంది . ప్రస్తుతానికి నిన్న  వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు . 

Share:

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా


ప్రత్తిపాడు రహదారి వద్ద ఉదయం 40 మంది కూలీలతో  ప్రత్తిపాడు నుండి గొట్టిపాడుకి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది . స్థానికుల సహాయం తో  క్షతగాత్రులను 108 లో ఆసుపత్రికి తరలించారు . పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు . 


Share:

చిలకలూరిపేట వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు నియమితులు అయ్యారు

చిలకలూరిపేట వైస్  ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు నియమితులు అయ్యారు 

కొల్లిశెట్టి శ్రీనివాసరావు 

చిలకలూరిపేట వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు ఎన్నిక అయ్యారు . గడిచిన ఎన్నికలలో 6వ వర్డ్ నందు గెలుపొందిన  కొలిశెట్టి శ్రీనివాసరావు గారు కరోనా లాక్ డౌన్ సమయం లో MLA రజని గారికి వెన్నుదండుగా నిలిచ్చారు . పట్టణం పైన పూర్తి అవగాహన ఉన్నందున కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని ఎన్నిక అయ్యారు 


Share:

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం

     చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా రఫాని ప్రమాణ స్వీకారం 

రఫాని 20 వ వార్డ్ కౌన్సిలర్

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ గా 20వ వార్డ్ కౌన్సిలర్ రఫాని గారు నియమితులు అయ్యారు . గడిచిన మున్సిపల్ ఎలక్షన్ లో  ముస్లిమ్ మైనారిటీ  సభ్యులు 38 వార్డలుకి గాను 12 వార్డులు ఎన్నిక అయ్యారు . గెలిచినా  మైనారిటీ కౌన్సిలర్లు పరిశీలించి పట్టణం లో వున్నా సమస్యలపైనా అభివృద్ధి పైన  అవగాహనా వున్నా షేక్ రఫాని గారిని ఎన్నుకున్నారు . చిలకలూరిపేట లో ఏ గతం లో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలు ఎన్నిక అయ్యారు . 







Share:

చిలకలూరిపేట సీసీ న్యూస్ యూట్యూబ్ 24/08/2020

చిలకలూరిపేట సీసీ న్యూస్  యూట్యూబ్ 24/08/2020:----


24/08/2020


Share:

చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

చిలకలూరిపేట పట్టణంలో 700 మార్క్ కి చేరిన కరోనా బాధితుల సంఖ్య :--

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో సోమవారం నాడు వచ్చిన 6 కేసులు కలుపుకొని 702 కేసులు నమోదు అయ్యాయి . గత కొన్ని రోజులగా పట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . కరోనా ఫ్రీ పట్టణంగా నిలపాలి అని ప్రతి ఒక్కరు నిర్ణయంచుకుంటే మన తో పాటుగా మన పక్కవున్న వాళ్ళని మన చుట్టాలని , ఫ్రెండ్స , ఫామిలీ, అందరూ ఆనందంగా జీవితం సాగించవచ్చు . 
Share:

చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలు

 చిలకలూరిపేట లోని BJP పార్టీ ఆఫీస్ నందు జెట్ల్లి ప్రధమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు:---

https://chilakaluripetspeednews.blogspot.com/
అరుణ్ జెట్ట్లై


పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ నందు అరుణ్ జెట్ల్లి  గారి వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సమయంలో ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసి  దేశానికీ ,పార్టీ కి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఘనంగా నివాళులు  అర్పించారు . ఈ కార్యక్రమంలో పార్టీలోని ముఖ్యనాయకులు , యువకులు పాల్గొన్నారు . 

Share:

చిలకలూరిపేట సోమవారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు

చిలకలూరిపేట  సోమవారం నాడు నమోదు అయిన  కేసుల వివరాలు :-----

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణం లో సోమవారం నాడు 6 కేసులు నమోదు అయ్యాయి . సుబ్బయ్యతోట 1, గుండయతోట 1, పురుషోత్తపట్నం 1, గుర్రాలచావిడీ 1, రహమత్ నగర్ 1, వడ్డెరకాలనీ 1, గ నమోదు అయ్యాయి 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.