మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పండరీపురంలోని  ఒక అపార్టుమెంట్లో పేకాట ఆడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 13,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం లో డబ్బులు , ఒకే అపార్టుమెంట్లో 33 మందిని ఒకేసారి అరెస్ట్ చెయ్యటం తో ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. కుటుంబాలు నివసించే ప్రదేశాలలో ఇలాంటి కార్యాకలాపాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని స్థానికులు చెపుతున్నారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు హాజరుపరుస్తాం అని తెలిపారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తెనాలి, పట్టణంలోని వ్యక్తులుగా గుర్తించారు. 

Share:

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని అమ్మ పాలిక్లినిక్ నందు కరోనా సోకినా వారికీ,కరోనా సోకకుండా ఉండేందుకు ఆనందయ్య లాంటి మందుని పంపిణి చేస్తున్నట్లు డాక్టర్ హనీఫ్ తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ SI అనిల్ బాబు, శానిటరీ ఇన్స్పక్టర్ శ్రీనివాసరావు, మునిసిపల్ రెవెన్యూ అధికారి ఫణి కుమార్  అమ్మ పాలిక్లినిక్ కి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన మందుని పరిశీలించి మందు పంపిణీ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే పంపిణీకి సిద్ధం గా ఉన్న మందును సీజ్ చేసి పోలీస్టేషన్ కి తరలించారు. 

Share:

చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు

 చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల పరిధిలో ఆదివారం నాడు మొత్తం 28 కేసులు నమోదు అయ్యాయి. అందులో 

చిలకలూరిపేట పట్టణం లో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

సుధా వారిపాలెం లో  - 1

సుగాలి కాలనీ లో - 1

రజక వీధి లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 25 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

మురికిపూడి గ్రామంలో - 4

యడవల్లి గ్రామంలో  - 1

బొప్పూడి గ్రామంలో  - 1

గోవిందపురం గ్రామంలో  - 2

కావూరు గ్రామంలో - 9

లింగంగుంట్ల గ్రామంలో - 4

గొట్టిపాడు గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2

నాగబైరువారిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 

Share:

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య  

https://chilakaluripetspeednews.blogspot.com/

చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణి పైన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఎర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలు మందు కోసం వేచి చూస్తున్నారు అని అందువలన సోమవారం నుండి మందు పంపిణి జరుగుతుంది అని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య సోదరుడు, శిష్యబృందం మందుని అందజేస్తారు అని. క్యూ లైన్ లో ఉన్న వారికి త్వరగా మందు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాల వారికీ త్వరలో మందు పంపిణి చేస్తాం అని తెలిపారు     

Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు 

Share:

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది -  అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు 

https://chilakaluripetspeednews.blogspot.com/

కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు  పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు  

Share:

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి  మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు. 

Share:

చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు

చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు  పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి. అందులో 

చిలకలూరిపేట పట్టణంలో 7 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 

సుబ్బయ్యతోట లో - 1

పురుషోత్తమపట్నం లో  - 1

పండరీపురం 9 వ లైన్ నందు - 2

మదర్ థెరిసా కాలనీ నందు - 1

వేలూరు రోడ్డు లో - 1

తూర్పు మలపల్లి లో  - 1 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామాలలో  15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 

కట్టుబడివారిపాలెం గ్రామంలో  - 1

రామచంద్రపురం గ్రామంలో   - 2

మురికిపూడి గ్రామంలో   - 1

తాతపూడి గ్రామంలో   - 1

పసుమర్రు గ్రామంలో  - 2 

యడవల్లి గ్రామంలో   - 4

బొప్పూడి గ్రామంలో   - 2

కావూరు గ్రామంలో   - 1

వేలూరు గ్రామంలో   -1 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నందు శ్రీనివాస లాడ్జి నందు ఆస్థి పంజరం కలకలం సృష్టించింది. లాడ్జి మరమ్మతుల కొరకు నిర్వాహకులు పరిశీలించగా  3వ అంతస్థులో  
ఒక గది లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. అయితే సదరు మేస్త్రి తలుపులు పగలోగొట్టగా గది లోపల మరుగుదొడ్డి నందు కూడా లాక్ చేసి ఉంది. దాని తలుపులు కూడా పగలగొట్టగా లోపల అస్థిపంజరం టవల్ తో వేలాడుతూ కనపడి ఉంది. దీనితో షాక్ కి గురి అయిన సదరు నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్థిపంజరానికి T - షర్ట్ ఉండటంతో పురుషుడిగా నిర్ధారించారు. కరోనా లాక్ డౌన్ వలన రూమ్ తక్కువగా వినియోగిస్తున్నాం అని అందువలన గుర్తించలేకపొయ్యాం అని నిర్వాహకులు తెలిపారు. 

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలు అయిన యడ్లపాడు, నాదెండ్లలో నమోదు అయిన కేసుల వివరాలు. 

04-06-2021 శుక్రువారం నాడు యడ్లపాడు మండల గ్రామాలలో 6 , నాదెండ్ల మండల గ్రామాలలో 16 కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామంలో 

లింగారావు పాలెం గ్రామంలో  - 1

బోయపాలెం గ్రామంలో  - 1

యడ్లపాడు గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండలంలోని గ్రామంలో 

గిరిజవోలు గ్రామంలో  - 2

గణపవరం గ్రామంలో - 7 

చంద్రవరం గ్రామంలో - 3

నాదెండ్ల గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం

 చిలకలూరిపేట మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు. 04-06-2021, శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని గ్రామంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

04-06-2021 శుక్రువారం నాడు మండలంలోని గ్రామంలో 18 కేసులు నమోదు అయ్యాయి. 

నాగభైరవారిపాలెం గ్రామంలో  - 3

రామ చంద్రపురం గ్రామంలో  - 1

గోవిందపురం గ్రామంలో  - 1

లింగంగుంట్ల గ్రామంలో  - 1

పసుమర్రు గ్రామంలో  - 2

పోతవరం గ్రామంలో  - 3

బొప్పూడి గ్రామంలో   - 2

వేలూరు గ్రామంలో   - 3

కావూరు గ్రామంలో   - 2 గా నమోదు అయ్యాయి 

Share:

చిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం

చిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన  కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు అనగా 04-06-2021, శుక్రువారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు 
 పట్టణంలో ఈ రోజు చాల తక్కువగా 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట - 1

పండరీపురం - 1

గుర్రాలచావిడీ - 2 కేసులు నమోదు అయ్యాయి. 

Share:

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలోని ప్రముఖ స్వచ్చంధ సేవ సంస్థ అయిన అసిస్ట్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన ప్రచార రధాన్ని ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రచార రధం ద్వారా 200 గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ పైన అవగాహనా కలిపించటమే ముఖ్య ఉదేశ్యంగా తెలిపారు. అలాగే జిల్లా రూరల్ ఎస్పీ గారు మాట్లాడుతూ అసిస్ట్ సంస్థ గుంటూరు,ప్రకాశం జిల్లాలో వారు చేసిన మంచి కార్యక్రమాలను కొనియాడారు. గ్రామాలలో ని ప్రజలకు వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలను తొలగించి వ్యాక్సిన్ కి అందరూ సహకరించాలి అని తెలిపారు. 

Share:

చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం

చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ రోడ్లో ఉన్న BSNL ఆఫీస్, AP ఆన్లైన్ నందు జనాలు బారులు తీరటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు కమిష్నర్ రవీంద్ర. పట్టణంలోని ఆధార్ సవరణ కోసం జనాలు బారులు తీరటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. కరోనా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం కరోనా రూల్స్ బ్రేక్ చేస్తూ జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఈ ప్రజలు గుంపులు చూసిన కమిష్నర్ రవీంద్ర గారు త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణకు అవకాశం కలిపిస్తాం అని తెలిపారు. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.