చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
పట్టణములోని రాగన్నపాలెంలో స్థానికంగా ఉన్న ఒక చర్చ్ నందు పాస్టర్గ్ ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈస్టర్ పండుగ నాడు రాగన్నపాలెం చర్చ్ నందు ప్రార్ధన నిర్వహించటానికి వచ్చిన వేలూరు గ్రామానికి చెందిన పాస్టర్ పని ముగించుకొని రాగన్నపాలెం ఉన్న పాస్టర్ని పలకరించి వేలూరు వెళ్లిపోయారు. శనివారం నాడు రాగన్నపాలెం పాస్టర్ కరొనతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం వూనురు. అంతిమసంస్కారాలకి ఆయనను పూనూరుకి తరలించారు. ఆయన అంతిమసంస్కరరాలకి రాగన్నపాలెం నుండి 50 మందికి పైగా పాల్గొన్నారు. వేలూరు పాస్టర్ కి ఆరోగ్యం బాగోలేక మంగళవారం నాడు మృతి చెందారు. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.ఇక రాగన్నపాళెం వాసులకి భయం పట్టుకుంది.స్థానికులు రాగన్నపాలెం నందు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శానిటైజ్ చెయ్యాలి అని అధికారులని కోరారు.
అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
చిలకలూరిపేట పాటిమీద ప్రాంతం నుండి పర్చూరు మండలం శ్యామలవారిపాలెం గ్రామం నందు మిరపకాయల కోతకు కూలీ పనికి వెళ్తుటారు. ఈ క్రమంలో 10 మంది కూలీలు కలిసి వెతున్న ఆటో అన్నంబొట్లవారిపాలెం వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వద్ద ఆగి ఉన్న ఆటో ని డీ కొట్టాడు డ్రైవర్ అంకమ్మరావు. ఆటోలో ఉన్న మహిళా ఫరింభి అక్కడకిఅక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు హుటా హుటిన వచ్చిన 108 సిబంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులని పేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు
చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన
చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన
మొన్న జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం లో ఛైర్మెన్ రఫాని గారు చౌత్రసెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చెయ్యటానికి ఆమోదం తెలిపారు. అలాగే ఉగాది పర్వదినము రోజున చౌత్రసెంటర్ నందు ఆంజనేయ స్వామి గుడి వద్ద పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో విడదల గోపి గారు, ఛైర్మెన్ రఫాని గారు, వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు ఆనాడు చేసిన త్యాగాలని తలుచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ని గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమానికి వార్డ్ కౌసిలర్లు , వైస్సార్సీపీ నాయకులూ పాల్గొన్నారు .
చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు
చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు
జిల్లాలో భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్
గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు
తెలంగాణలో టీడీపీకి భారీ షాక్
తెలంగాణలో టీడీపీకి భారీ షాక్
తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికలలో 2 అసెంబ్లీ స్థానాలు దక్కిన్చుకున్న తెలంగాణ టీడీపీ ఆ ఎన్నికలలో భారీ పరాభవాన్ని చవిచూసింది. సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి, మచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట నుండి గెలిచారు. ఇప్పటికే సండ్ర తెరాస పార్టీ జండా కప్పుకోగా. ఈ రోజు మచ్చ నాగేశ్వరావు TRS లో చేరుతున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ రాసారు. ఈ దెబ్బతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒకింత షాక్ కి గురి అయ్యారు.
పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి
చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి.
చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి.
పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ నందు బుధవారం నాడు సెస్ వసూళ్లు చేసుకునే హక్కుల వేలం నిర్వహించారు. గతంలో చంద్రమౌళి కూరగాయ మార్కెట్ హక్కుల విలువ 7 లక్షల రూపాయలు సంవత్సరానికి , 2021 సంవత్సరానికి గాను సర్కారివారి పాట నెలకు 90,420 గా నిర్ణయించారు. విడదల శేషగిరిరావు గారు 1,12,000 రూపాయలకి దకించుకున్నారు. ఆ లెక్కన సంవత్సరానికి 13,44,000 రూపాయలు అవుతుంది గతం తో పోలిస్తే ఇది చాల ఎక్కువ . అలాగే సండ్రీ మార్కెట్, చేపల& మాంసము మార్కెట్ కు కూడా వేలం నిర్వహించారు. ( 1-04-2021 నుండి 31-03-2021 వరకు ) సండ్రీ మార్కెట్ సర్కారి వారి పాట 17,60,000 కాగా షేక్ నాసర్ వలి 17,64,000 గా , చేపల&మాంసము మార్కెట్ సర్కారు వారి పాట 1,60,000 కాగా షేక్ అబ్రహం 1,65,000 కి దక్కిన్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముసిపల్ అధికారులు, కమిషనర్ పాల్గొన్నారు.