మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏపీలో వైయస్ జగన్ వైయస్సార్ బీమా పధకంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుంటుంబంలోని వ్యక్తి ( 18 నుండి 50 వయసు లోపు ) సహజంగా మరణిస్తే 1 లక్ష రూపాయలు, అలాగే 18 నుండి 70 వయసు లోపు వారు ప్రమాదం వలన చనిపోతే 5 లక్షలు అందించాలి అని తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న కుంటుంబానికి  నెలలోగా పరిహారం అందించాలి అని తెలిపారు. జులై 1 వ తరుకు నుండి ఈ వైయస్సార్ బీమా పధకానికి మార్పు చేసి అమలు చెయ్యాలి అని సూచించారు. 



































Share:

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


జగనన్న తోడు అనే పధకం క్రింద ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు,చేతి వృత్తి కళాకారులకు 10 వేలరూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు వారి ఖాతా లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకానికి అర్హులు అయి ఉండి పేర్లు నమోదు చేసుకొని వారు గ్రామ,వార్డు వాలంటీర్లను సంప్రదించండి. వారి ద్వారా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోండి. 3 నెలలో పరిశీలించి రుణాలు అందిస్తారు. మరిన్ని వివరాలకు 08912890525, 1902 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. 

జగనన్న తోడు పధకానికి వీరు మాత్రమే అర్హులు 

* చేనేత, ఇత్తడి పని చేసేవారు. 

* కొండపల్లి బొమ్మలు తయారు చేసే వారు, కలంకారీ , తోలుబొమ్మలు, కుమ్మరి , బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక , ఇతర చేతి వృత్తుల వారు 

* తోపుడు బండ్ల పైన కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్ధాలు అమ్మేవారు 

* గంపలలో, బుట్టలలో వస్తువులు అమ్మే వారు, 

* సైకిళ్ళు, ఆటోలలో , బైకుల పై వ్యాపారం చేసుకునే వారు

* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కలిక షాపులు ఉండేవారు 
అర్హులు 
   






































Share:

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో భారీగా దొరికిన గుట్కా నిల్వలు- వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం గ్రామము నందు నిషేదిత గుట్కా అమ్మే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిలకలూరిపేట నుండి ఈ గుట్కా, పాన్ పరాగ్ సప్లై వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిఘా వేసి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం దగ్గిరలోని 3 గోడోన్లలలో  గుట్కా నిల్వల పైన ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అక్కడ దొరికిన గుట్కా నిల్వలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీగా నిల్వ ఉంచిన 3 గోడోన్లను తనిఖీ చేసి అందులోని గుట్కా నిల్వలను రెండు లారీలలో వేటపాలెం తరలించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. వేటపాలెం CI రోశయ్య, SI కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 


https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం

 చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.  

కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక  బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద

గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్  వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము. 


























Share:

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు

 ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు 

https://chilakaluripetspeednews.blogspot.com/
ఏపీలో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 10 తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే  కర్ఫ్యు సమయంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు పని వేళల  సమయాన్ని పొడిగించారు. మధ్యాన్నం 2 గంటల నుండి తర్వాత ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పని చేస్తాయి అని తెలిపారు.   






























Share:

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని అమ్మ పాలిక్లినిక్ నందు కరోనా సోకినా వారికీ,కరోనా సోకకుండా ఉండేందుకు ఆనందయ్య లాంటి మందుని పంపిణి చేస్తున్నట్లు డాక్టర్ హనీఫ్ తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ SI అనిల్ బాబు, శానిటరీ ఇన్స్పక్టర్ శ్రీనివాసరావు, మునిసిపల్ రెవెన్యూ అధికారి ఫణి కుమార్  అమ్మ పాలిక్లినిక్ కి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన మందుని పరిశీలించి మందు పంపిణీ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే పంపిణీకి సిద్ధం గా ఉన్న మందును సీజ్ చేసి పోలీస్టేషన్ కి తరలించారు. 








































Share:

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య  

https://chilakaluripetspeednews.blogspot.com/

చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణి పైన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఎర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలు మందు కోసం వేచి చూస్తున్నారు అని అందువలన సోమవారం నుండి మందు పంపిణి జరుగుతుంది అని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య సోదరుడు, శిష్యబృందం మందుని అందజేస్తారు అని. క్యూ లైన్ లో ఉన్న వారికి త్వరగా మందు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాల వారికీ త్వరలో మందు పంపిణి చేస్తాం అని తెలిపారు     























Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు 

















Share:

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది -  అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు 

https://chilakaluripetspeednews.blogspot.com/

కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు  పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు  







































Share:

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వైయస్సార్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10,000రూపాయల ఆర్థికసాయం అందించాలి అని సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి గారు ఈ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ పధకానికి క్రింది పేరుకున్న వారు అనర్హులు 

* 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట భూమి ఉంటే అనర్హులు . 
* మునిసిపాలిటీలలో 1000 చదరపు అడుగుల మించి ప్లేస్ ఉండకూడదు. 
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ( ఆదాయపు పన్ను ) చెలించేవారు ఉంటే అనర్హులు . 
* కుటుంబంలో  గవర్నమెంట్ జాబ్,పింఛను పొందేవారు ఉన్న అనర్హులే. 
* ఆటో, టాక్సీ నడిపేవారు తప్ప , సరుకు రవాణా వాహనదారులు అర్హులు కారు. 
* గత ఆరు మాసాల ( 6 నెలల ) ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 600 యూనిట్ల కన్నా మించకూడదు. మించితే అనర్హులే. 
పైన పేరుకున్న వారు అనర్హులు 






























Share:

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజుల క్రితం దేశంలో ఎన్నికలు ముగిసిన తరువాత నుండి పెట్రోల్ రేట్ మోత మోగించటం మళ్లీ మొదలైంది. ప్రస్తుత సమాజంలో మోటార్ వెహికల్ ఉండటం సాదాసీదాగా అయిపోయింది. అయితే దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా మినిమం టూ వీలర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పెట్రోల్ భారం సామాన్యు ప్రజలు మోయలేనిదే అని చెప్పొచ్చు. వారి సంపాదనలో 20% &30% పెట్రోల్ ఖర్చు చేస్తే వారి జీవితం ఎలా సాగుతుందో అర్ధంకావటం లేదు. 
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పెంచటం వలన వచ్చే డబ్బులతో కరోనా ప్యాకేజీలు, టీకాలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు టీకాలు సమయానికి దొరక్క , పెట్రోల్ బాదుడు సామాన్య ప్రజలకు సర్కారు పైన  విశ్వాసం తగ్గుతుంది అని చెప్పుతున్నారు ప్రతిపక్షాలు. 

ఈ రోజు విజయవాడ పెట్రోల్ రేట్ :- 100.48 , డీజిల్ :- 94.76

డీజిల్ రేట్లు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి. 
ఈ పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెరుగుదలతో సామాన్యు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. 




































Share:

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈ రోజు 31/05/2021 సోమవారం నాడు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి అలాంటిది ఈ రోజు చాలా తక్కువ గా 7943 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 98 మంది చనిపోయినట్టు తెలిపారు. ఈ రోజుతో రాష్ట్రంలో కరోనా కేసులు  16,93,085 లకు చేరింది. ఆక్టివ్ కేసులు 1,53,795గా ఉంది.  





























Share:

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి

ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచం మొత్తం తన గురుంచి మాట్లాడుకునేలా చేసిన ఆనందయ్య మూలికల వైద్యంనకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. సీసీఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య పసరు ముందుకు అనుమతులు లభించాయి. అయితే కంటిలో వేసుకునే మందుకు, కే అనేమందుకు మాత్రం అనుమతులు రాలేదు. వాటి పైనే ఇంకా నివేదికలు రావలసి వున్నది అని తెలిపారు. మందులో ఆరోగ్యానికి హాని కలిగేంచే పదార్ధాలు ఏమి లేవు అని స్పష్టం చేసారు. అయిన మందు వలన కరోనా రోగం తగ్గుతుంది అని కానీ, దాని వల్ల దుష్ప్రబావాలు ఉంటాయి అని కానీ ఎక్కడ నివేదికలో తెలపలేదు అని తెలిపారు. కంట్లో వేసే మందు కు ఇంకా 2&3 వారల వరకు పట్టొచ్చు అని, మాములు ఇంగ్లీష్ మెడిసన్ వాడుతున్న కానీ ఈ మందు వాడొచ్చు అని తెలిపారు. అయితే మందు కోసం కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని. కరోనా బాధితులు మందు కోసం రావొద్దు అని,వారి కుటుంబసభ్యులు కానీ బంధువులు కానీ వచ్చి తీసుకోవచ్చు అని తెలిపారు. 





















Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే 

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ  ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ 

అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 


https://chilakaluripetspeednews.blogspot.com/
https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు కొత్త సంవత్సర శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు. నిన్న సౌదీ అరేబియా నందు రంజాన్ నెలవంక కనిపించింది. దీనితో  ముస్లింలకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానున్నది.




 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.