మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - ఇరువురు అరెస్ట్

చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - ఇరువురు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు మండలం కొత్త సొలస గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వచేసి ఉన్నది అని ఇద్దరిని అరెస్ట్ చేసిన SI రాంబాబు. మేడిద మోహన్ రావు, తిరుమలశెట్టి కోటేశ్వరరావు అని ఇద్దరి వ్యక్తుల నుండి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారి పైన కేసులు నమోదు చేసారు. మండలంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 

































Share:

చిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

చిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పసుమర్రు గ్రామంలో నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.చిలకలూరిపేట రురల్ SI భాస్కర్ కి వచ్చిన సమాచారంతో గ్రామంలో తనిఖీ చెయ్యగా గ్రామా శివారులలో అక్రమంగా అమ్ముతూ పట్టుబడ్డాడు. గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఈ  షేక్ బాషా అనే వ్యక్తి  చాలా కాలంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు 8500 వరకు ఉంటుంది అని తెలిపారు.ఇలాంటి నిషేదిత గుట్కా అమ్మీనా , కొనిన వారి పైన కూడా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 






































Share:

చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్

చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఇతర రాష్ట్రాల మద్యం అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు. అర్బన్ సీఐ బిలాలుద్దీన్ కి వచ్చిన సమాచారం మేరకు SI అజయ్ బాబు నిర్వహించిన దాడిలో రామకృష్ణ, పవన్ సాయి అనే వ్యక్తుల నుండి 70 వేలరూపాయల విలువ గల తెలంగాణకు చెందిన మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారు. అందులో 35 ఫుల్ బాటిల్స్, 141 క్వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల,లోకల్ మద్యం అయినా అక్రమంగా అమ్ముతూ పట్టుబడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 











































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

యడ్లపాడు మండలంలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి 


తిమ్మాపురం గ్రామంలో - 2


నాదెండ్ల మండలంలో 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


నాదెండ్ల గ్రామంలో  - 2

చంద్రవరం గ్రామంలో - 1

ఇర్లపాడు గ్రామంలో  - 1

కనపర్రు గ్రామంలో  - 2

గణపవరం గ్రామంలో  - 6

సాతులూరు గ్రామంలో  - 7 గా నమోదు అయ్యాయి 



























































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
 
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

పండరీపురం లో - 3 గా నమోదు అయ్యాయి. 



చిలకలూరిపేట మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి వాటా వివరాలు 

కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 1

లింగంగుంట్ల గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 4

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 












Share:

చిలకలూరిపేట - నిరుపేదల జేబులుకొడుతున్న ఆధార్ సెంటర్ - ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు

చిలకలూరిపేట - నిరుపేదల జేబులుకొడుతున్న ఆధార్ సెంటర్ - ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు అందాలి అంటే మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేసి ఉండాలి అని పేద ప్రజలు ఆధార్ వెరిఫికేషన్ సెంటర్లకు వెళ్తే అక్కడ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ ముందు ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్ నందు సిబ్బంది ఆధార్ రీవెరిఫికేషన్ కోసం వచ్చిన నిరుపేదల వద్ద నుండి ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు బయటపడింది. ఆధార్ కార్డులోని మార్పుల కోసం 50 రూపాయలు చెలించవలసి ఉంది. కానీ సదరు సిబ్బంది పేద ప్రజల నుండి 200 రూపాయలు వసూళ్లు పాల్పడుతున్నారు అని అక్కడికి వచ్చిన బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 200 ఇవ్వకపోతే రెండు రోజులు ఆగాక రావాలి అని చెపుతున్నారు అని బాధితులు వాపోయ్యరు. అదేంటి అని గట్టిగ ప్రశ్నించినందుకు సర్వర్ పని చెయ్యటం లేదు అని చెప్పి మధ్యాహ్నం 1:30 నిమిషాలకల్లా షాప్ మూసి వెళ్లిపోయారు. పొద్దున్నే 7 గంటలకు వచ్చాము అని తమది చుట్టుపక్కగా గ్రామాలు అని పొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా లైన్లో వేచి ఉంటే ఇప్పుడు ఆన్లైన్ పని చెయ్యటం లేదు అని చెప్పి షాపు మూసివేశారు అని తెలిపారు.   





































Share:

చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్

చిలకలూరిపేట - తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా బయటపడుతున్న గుట్కా నిల్వలు - మరో 3 లక్షల నిషేదిత గుట్కా సీజ్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో మద్ది మల్లయ్య వీధిలో 11 లక్షల సరుకు పట్టుకున్న పోలీసు వారు గంట వ్యవధిలోనే మరో గోడోన్లో మరో 3 లక్షల సరుకు సీజ్ చేసారు. పట్టణంలోని MRO ఆఫీస్ వెనుక బజార్లోని యూనియన్ బ్యాంకు బిల్డింగ్ నందు ఈ సరుకుని గుర్తించటం జరిగింది. సీఐ బిలాలుద్దీ, SI అజయ్ బాబు  మరియు పోలిస్ర్ సిబ్బంది ఈ సోదాలలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు బిల్డింగ్ ఓనరే ఈ నిల్వలను ధాచినట్లు DSP విజయ్ భాస్కర్ తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతాయి అని ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసారు. 




















































Share:

చిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్

చిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న దాడులతో గుట్కా అమ్మే వారికీ గుండెలో రైళ్లు పరిగెట్టిస్తున్నారు పట్టణ పోలీసులు. తాజాగా మద్ది మల్లయ్య వీధిలోని ఒక గోడోన్లో నిర్వహించిన సోదాలలో 11 లక్షల నిషేదిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోటి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  జిల్లా SP విశాల్ గున్ని ఆదేశాలతో సీఐ బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ విజయభాస్కర్ గారు సీజ్ చేసిన సరుకుని పరిశీలించి ఇంకా పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని వదిలేది లేదు అని వారి పైన ఖఠినమైన చర్యలు తీసుకొంటాం అని తెలిపారు.  







































Share:

చిలకలూరిపేట పట్టణ & నియోజకవర్గ గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే !!!

చిలకలూరిపేట పట్టణ & నియోజకవర్గ గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

12-06-2021, శనివారం నాడు పట్టణ & నియోజకవర్గ మండల గ్రామాలలో ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్ డోసులు వెయ్యటానికి సిద్ధంగా ఉన్నాయి అంటే 

చిలకలూరిపేట పట్టణంలో 

చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 200

సుబ్బయ్యతోట మునిసిపాలిటీ డిస్పెన్సరీ నందు - 200

పురుషోత్తమపట్నం నందు - 100

రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 200

నాదెండ్ల - 300

యడ్లపాడు పీ.హెచ్.సీ నందు - 300

కావూరు  పీ.హెచ్.సీ నందు - 300   డోసుల కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు నోడల్ అధికారి గోపీనాయక్ తెలిపారు.









































Share:

చిలకలూరిపేట - చలివేంద్రం బజారులో పలు అనుమానాస్పద గోడోన్లలో దాడులు

చిలకలూరిపేట - చలివేంద్రం బజారులో పలు అనుమానాస్పద గోడోన్లలో దాడులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో నిషేదిత గుట్కా అమ్మే వారిపైన దృష్టిపెట్టారు పట్టణ పోలీసులు. గత 3 రోజుల క్రితం బయటపడ్డ గుట్కా నిల్వలతో పట్టణ పోలీసుల పైనే వత్తిడి ఎక్కువ అయినందున ఈ రోజు పట్టణ పోలీసువారు మూడు బృందాలుగా ఏర్పడి అనుమానిత గోడోన్లలో తనిఖీలు నిర్వహించారు. జప్పని భాస్కర్ గారి ఇంటి వద్ద ఉన్న గోడోన్లలో దాడులు నిర్వహించారు. ఇంకా అనుమానాస్పద షాపులలో సోదాలు నిర్వహించారు. ఇలాంటి అసాంఘిక పదార్ధాలను అమ్మే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. 



















































Share:

చిలకలూరిపేట రేపు 12-06-2021, శనివారం రోజు ఈ ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట రేపు 12-06-2021, శనివారం రోజు ఈ ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రేపు రెండవ శనివారం కారణంగా సబ్ స్టేషన్ మరమ్మతులు జరిగుతున్నాని అందువలన పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు సీ,హెచ్ రాంబొట్ల తెలిపారు. పోలిరెడ్డిపాళెం, కోండ్రుపాడు, వైయస్సార్ కాలనీ, జిడ్డు కాలనీ, లక్ష్మి నరసింహ కాలనీ, మదర్ థెరిసా కాలనీ, బ్యాంకు కాలనీ, సుగాలి కాలనీ, ఆదిఆంధ్ర కాలనీ, పండరీపురం 9,10 లైన్లు, సాంబశివనగర్, శాంతి నగర్, సుబ్బయ్యతోట, విజయాబ్యాంక్ రోడ్, హైస్కూల్ రోడ్, బోసు రోడ్, మండల ఆఫీస్ వెనుక బజార్, సుభాని నగర్, మార్కెట్ బజార్, గడియారస్తంభం రోడ్, వడ్డెర పాలెం, రాగన్నపాలెం, బొందిలిపాలెం, కొమరవల్లి పాడు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు తెలిపారు.  


















































Share:

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత రెండు రోజులుగా పట్టణంలోని 27వ వార్డు వాలంటరీ లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సామాజిక మాధ్యమాలలో, పట్టణ, రాష్ట్ర మీడియా ఛానళ్లలో కోడై కూసింది. వీడియో లో వాలంటరీ చెప్పినట్లుగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంతా ఫై అధికారులకు వెళ్తుంది అని చెపింది. దీని పైనా సీరియస్ అయిన మునిసిపల్ కమిష్నర్ ఘటన తెలిసిన వెంటనే ఆయా వాలంటరీని విధుల నుండి తప్పించారు. అలాగే తాజాగా ఆమె పైన ఉన్న అడ్మిన్లను బదిలీ చేస్తూ మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసారు. 9,27,29 వార్డు అడ్మిన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 9 వ వార్డు అడ్మిన్ సిద్దాబత్తుని రాజేష్ ను 27 వ వార్డుకి , 29 వ వార్డు అడ్మిన్ కరిష్మాను 9 వ వార్డుకి, 27 వ వార్డు అడ్మిన్ గడ్డం మురళి కృష్ణ ను 29 వ వార్డుకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.  






























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 11-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 11-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వెంకటరెడ్డి నగర్ లో - 4

పురుషోత్తమపట్నం లో - 1

పండరీపురం లో - 1

మారుతీ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


వేలూరు గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 



























Share:

అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్

అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొంతకాలంగా చిలకలూరిపేట అక్రమ, నిషేదిత మత్తు పదార్ధాల హోల్ సేల్ మార్కెట్ గా తయారవుతుంది. చిలకలూరిపేట చుట్టుపక్క గ్రామాలలో, మండలాలలో మందుబాబులు, చిన్న చిన్న గుట్కా అమ్మే షాపులను ఎవరిని అడిగినా వారి నోటు నుండి వచ్చే ఒకేఒక్క మాట చిలకలూరిపేటలో ఫలానా ఏరియాలో, ఫలానా వ్యక్తుల వద్ద దొరుకుతాయి అని చెప్తారు. ఆవిధంగా చిలకలూరిపేట లో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది. 

ఏపీ మందు క్వాలిటీ తక్కువ, రేట్ ఎక్కువ అని చెప్పి, ఇతర రాష్ట్ర మద్యం తక్కువ రేట్, క్వాలిటీ ఫిల్టరింగ్ ఎక్కువ అని చెప్పి యధేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. పక్క జిల్లాలో పోలీసులు మన ఊరికి వచ్చి ఇక్కడ అమ్మేవారి గుట్టు బయట పెడుతున్నారు. ఉదాహరణకి వేటపాలెం పోలీసులు పేటలో సుమారు 60 నుండి కోటి రూపాయలు విలువ చేసే గుట్కాలు అమ్మే పెద్ద చేపని పట్టుకున్నారు. అతనికి గుట్కాలు రైల్వే గూడ్స్ ద్వారా చీరాల, అక్కడి నుండి పేటకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి హోల్ సేల్ గా చుట్టుపక్కల గ్రామాలకి అందిస్తున్నారు. ఈ విషయాన్ని పక్క జిల్లా పోలీసులు ఛేదించారు. మన పేట పోలీసులు ఎం చేస్తున్నారు అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లేదా పైన అధికారుల కన్ను సైగలలో ఇది నడుస్తుందా అని అందువలన మన పోలీసులు పట్టించుకోవటం లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది ఎలా ఉంటే చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల గ్రామం వద్ద ఈ రోజు అనగా శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రము నుండి తీసుకు వచ్చిన మద్యం అక్రమంగా తరలిస్తుండగా ఎక్ససైజ్ అధికారులు వారిని పట్టుకున్నారు. వీరు ఇన్నోవా కారు నుండి మద్యం ను 5 బైకులతో సర్ది అక్కడ నుండి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారులు 5 బైకులను, ఒక ఇన్నోవా కారు తో పాటుగా 735 మద్యం బాటిల్స్ సీజ్ చేసారు. 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 
 






































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.