మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు -  రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. హాస్పిటల్ బయట వరకు Q కట్టారు. అయితే సుమారు 400 మంది టెస్టులకి వచ్చారు అని అంచనా . హాస్పిటల్ సిబంది ముందస్తు చర్యలు తీసుకోకుండా అందరికి ఓపీ ఇచ్చారు. కానీ టెస్టులకు  మాత్రం 100 రెజిస్ట్రేషన్ ఫారంలు మాత్రమే ఉన్నాయి అని ఈ రోజుకి 100 మాత్రమే అని చెప్పారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు మండుటెండలో నిలబడి ఇప్పుడు ఫోరంలు లేవు అంటారు ఏంటి అని కొంచంసేపు ఆసుపత్రి సిబ్బందికి ప్రజలకి వాగ్వివాదం జరిగింది. చివరకు హాస్పిటల్ డాక్టర్ గారి చొరవతో వచ్చిన అందరికి టెస్టులు చేస్తాం అని చెప్పారు.ప్రైవేట్ టెస్టుల వలన బయట మెడికల్ ఫెసిలిటీ లేదు. అందువలన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినట్టు చెప్పారు. 

వీడియో:-































Share:

చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

 చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు. 









Share:

చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ

 చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది.  రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు  " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు  వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR  టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు. 

ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.  


 











Share:

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I )  నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు. 
















Share:

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది. 

https://chilakaluripetspeednews.blogspot.com/

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న, ప్రజలు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులకు ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలలో ఏకంగా 9300 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలకన్నా ఎక్కువ. వీటిలో చాలా వరకు మన చుట్టుపక్క దేశాలకు ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ముందు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని దేశ ప్రజలు వాపోతున్నారు.  

















Share:

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు. 

గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు. 










Share:

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి


https://chilakaluripetspeednews.blogspot.com/


దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. దేశంలో కరోనా ఉదృతి ఆపాలి అంటే మాస్క్ వాడాలి అని. అది కూడా ఒక మాస్క్ సరిపోదు అని 2 మాస్కులు వాడాలి అని తెలిపారు. క్లాత్, సర్జికల్ మాస్క్ వాడేవారు 2 ఖచ్చితంగా వాడాలి అని తెలిపారు.  
















Share:

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం నందు స్వతంత్ర సమర యోధుడు, బీసీ వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శ్రీ సర్ధార్ గౌతు లచ్చన్న గారి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సర్ధార్ అంటే గుర్తు వచ్చేది రెండే పేర్లు 1 సర్ధార్ వల్లభాయ్ పటేల్, 2 సర్ధార్ గౌతు లచ్చన్న గారు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలు సార్లు మంత్రిగా చేసారు. బ్రిటిష్ వారికీ వ్వతిరేకంగా 1932 లో జరిగిన శాసన ఉల్లంఘన  ఉద్యమాల్లో పాల్గొని 5 నెలల పటు జైలు జీతాన్ని గడిపారు. 1930 లో గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహము లో పాల్గొని బారువా సమీపంలో ఉన్న ఉప్పు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బులతో ఉద్యమాన్ని నడిపారు. తన  96 వ ఏటా కన్నుమూశారు  అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యకమాలొ చిలకలూరిపేట గౌడ్ యూత్, బీసీ సంఘ నాయకులూ పాల్గొన్నారు 













Share:

చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్

 చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో పేకాట స్థావరాల పైనా సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో  దాడులు నిర్వహించారు . వివరాల్లోకి వెళితే పట్టణములోని పండరీపురంలోని ఒక అపార్టుమెంట్ నందు పేకాట ఆడుతున్నారు అని సమాచారంతో సీఐ ఆ ప్రాంతాన్ని చేరుకొని తనిఖీలు చేసారు. ఆ సమయంలో 16 మంది పేకాట రాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.6 లక్షల నగదు ,16 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. 























Share:

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు 
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు పైన నోటీసు రిలీజ్ చేసారు తసీల్ధార్ సుజాత గారు . తక్షణమే ఆంక్షలు అమలులోకి రావని అని చెప్పారు. పట్టణంలోని రురల్,అర్బన్, పరిధిలో గల కళ్యాణ మండపాలను తక్షణమే మూసివేయ్యాలి అని, అలాగే సినిమా హాళ్లలో 50% సీట్ ఆక్యుపెన్సీ తో కొనసాగించాలి అని. మార్కెట్ ను తక్షణమే మూసివేసి విశాలంగా ఉండే మైదానాలో స్టాల్స్ ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలి అని సూచించారు.  





















Share:

ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

 ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కారణంగా ఇప్పటికే 1-9 తరగతులకు ఎగ్జామ్స్ లేకుండా ఫై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యకుండా వాటి టైం టేబుల్ రిలీజ్ చేసారు. 

పదవ తరగతికి :- సాధారణంగా ఉండే 11 పరీక్షలను 7 పరిక్షలుగా కుదించారు. 

జూన్ 7 - ఫస్ట్ లాంగ్వేజ్ ,

జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్,

జూన్ 9 - ఇంగ్లీష్,

జూన్ 10 - గణితం,

జూన్ 11 - భౌతిక శాస్త్రం,

జూన్ 12 - జీవ శాస్త్రం,

జూన్ 14 - సోషల్ ,

ఇంటర్ :- మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్,

                  మే 5-23 వరకు సెకండ్ ఇయర్ 

















Share:

ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు

 ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.  స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే  ఉంచండి  














Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.